-->
Song no: 20
సమయము లేదన్నా మరి లేదన్నా
పోతే మరలా తిరిగి రాదన్నా "2"
యేసన్న నేడో రేపో వచ్చెనన్నా"2"
భూమిమీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా
హృదయంలో యేసుని చేర్చుకున్న
పరలోక భాగ్యమే నీదగునన్నా "2"
నీ పాపజీవితం విడువకయున్న "2"
పాతాళగుండమే నీగతియన్నా
రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో
నేడన్నది ఉండగానే దారి తెలుసుకో "2"
చేయకాలస్యము - తెరువు నీ హృదయము "2" {సమయము}
ఆకాశం పట్టజాలని దేవుడన్నా
కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా "2"
లోక పాపమంత వీపున మోసాడన్నా
మానవాళి శాపం రూపుమాపాడన్నా "2"
నీ హృదయపు వాకిట నిలుచున్నాడు
నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు "2"
చేయకాలస్యము-తెరువు నీ హృదయము "2" {సమయము}
యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో
నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా "2"
గడ్డిపువ్వు లాంటిది నీ జీవితమన్నా
ఎపుడు ముగిసి పోతుందో తెలియదన్నా "2"
భూరధ్వనితో ఆర్భాటంతో మేఘారూఢుడై
తీర్పుతీర్చ యేసురాజు రానున్నాడు "2"
చేయకాలస్యము- తెరువు నీ హృదయము "2" {సమయము}
Song no: 106
నీ నీడలో నాబ్రతుకు గడవాలని
నీ అడుగు జాడలలో నేనడవాలని
అ.ప:హృదయవాంఛను కలిగియుంటిని } "2"
నీసహాయము కోరుకుంటిని || నీ నీడలో ||
నీయందు నిలిచి ఫలించాలని
ఈలోక ఆశలు జయించాలని "2"
నీప్రేమ నాలో చూపించాలని "2"
నాపొరుగువారిని ప్రేమించాలని || హృదయ ||
నీసేవలోనే తరించాలని
నీకైశ్రమలను భరించాలని "2"
విశ్వాస పరుగు ముగించాలని "2"
జీవకిరీటము ధరించాలని || హృదయ ||
నీరూపునాలో కనిపించాలని
నాఅహమంతా నశియించాలని "2"
నీవార్తఇలలో ప్రకటించాలని "2"
నీకడకు ఆత్మలనడిపించాలని || హృదయ ||
Song no:
దేశంలో మహా రక్షణ.... దేశంలో మహా దీవెన...
దేశంలో గొప్ప సంపద.. దేశంలో మహా శాంతిని..."2"
తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"
వ్యభిచారము మధ్య పానము... ప్రతి విధమైన... వ్యసనమును...."2"
తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"
ఉగ్రవాదమును ప్రేమోన్మాదము....ప్రతి విధమైన అవినీతిని........"2"
తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"
Song no: 21
మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా
విడువకురా విడువకురా ఆప్రభు సన్నిధి విడువకురా
అ.ప. : ఆప్రేమే నిత్యమురా - ప్రభు సన్నిధి మోక్షమురా {మరువకురా}
పరమును చేరే మార్గము ఇరుకని
శ్రమలుంటాయని ఎరుగుమురా "2"
నశించు సువర్ణము అగ్నిపరీక్షలో
శుద్దియగుననిగమనించరా "2" {ఆప్రేమే}
లోక సంద్రాములో ఎదురీదాలని
సుడులుంటాయని ఎరుగుమురా "2"
తీరము చేరిన మెప్పును మహిమ
ఘనత కలుగునని గమనించరా "2" {ఆప్రేమే}
విశ్వాసపరుగులో శోధానవలన
దుఃఖముందాని ఎరుగుమురా "2"
కడముట్టించిన నిత్యానందము
బహుమానముందని గమనించరా "2" {ఆప్రేమే}
Song no: 19
యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా
గురిలేని నాబ్రతుకు దరిచేర్చినావయా
నీసేవచేయగా - నీసిల్వమోయగా "2" {యేసు నీ సాక్షిగా}
ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప "2" మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప
సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప "2"
నిత్యం స్తుతి నొందదగిన నీనామము ప్రణుతింప "2" {యేసు నీ సాక్షిగా}
నాలోనీ సిల్వప్రేమ లోకానికి చూపింప "2"
రాకడకై కనిపెట్టుచు నీకొరకే జీవింప "2" {యేసు నీ సాక్షిగా}
Song no: 17
స్తుతియించెదాను స్తుతిపాత్రుడ నిను
భజియించెదను భయభక్తితోను
అ.ప. : వందానమయ్యా యేసయ్యా
నీకేప్రణుతులు మెస్సీయా
నీగుణగణములు పొగడనుతరమా
నీఘనకీర్తిని పాడనావశమా "2"
పరలోకసైన్యపు స్తుతిగానములతో "2"
దీనుడనాస్తుతి అంగీకరించుమా "2" {వందానమయ్యా}
నీఉపకారములు లెక్కింపగలనా
నీమేలులన్నియు వర్ణింపనగునా "2"
నాహృదిగదిలో నివసింపగోరిన
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా "2" {వందానమయ్యా}
నీసిల్వప్రేమను వివరింపశక్యమా
నీసన్నిధిలేక జీవింపసాధ్యమా "2"
ఆరాధించెదఆత్మతోనిరతం
నీక్షమముతో నింపుమాసతతం "2" {వందానమయ్యా}
Song no: 3
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడీ...హల్లేలూయ "ఆకాశ"
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా యెహోవాను
స్తుతియించుడీ..హల్లేలూయ "ఆకాశ"
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను
స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"