Song no: 461
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
- ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
- క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
- పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
- నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
- జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||
- నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||
Song no: 546
ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న||
- ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న||
- ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న||
- ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న||
- శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||
Song no: 274
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||
- నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది ||యాచరించు||
- భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు||
- పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||
- పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్ దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||నాచరించు||
Song no: 410
అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము
- నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా? 'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్'
- రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా 'యుండుగాని ముండ్లచేత నల్లరి'
- నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? 'ఔను లోకాంతంబు దాఁక చేర్చును'
- వాని వెంబడింతు నేని యేమి లాభము? 'పాప దుఃఖ కష్టములు వచ్చును'
- చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? 'సంతోషంబు సౌఖ్య మింక మోక్షము'
Song no: 230
అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||
- తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
- అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||
- భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||
- క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||
- శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||
- అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||
- సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||
Song no: 543
అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||ననుకరించెద||
- పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||
- తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
- పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
- శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
- పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
- యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
- అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
- ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
- భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
Song no: 269
రాగం - శంకరాభరణము
|
బోధకులకొరకైన ప్రార్థన
|
తాళం - ఆది
|
అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||
- వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||
- సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||
- దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||
- తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||
- మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||
- దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||
- రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||
- ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||