- అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము
- నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా? 'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్'
- రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా 'యుండుగాని ముండ్లచేత నల్లరి'
- నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? 'ఔను లోకాంతంబు దాఁక చేర్చును'
- వాని వెంబడింతు నేని యేమి లాభము? 'పాప దుఃఖ కష్టములు వచ్చును'
- చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? 'సంతోషంబు సౌఖ్య మింక మోక్షము'
Alasatapadda nivu dhaivokthi vinu ra అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా
Song no: 410
Ayyo iedhi dhukkamu prabhu thirppuvela అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ
Song no: 230
- అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||
- తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
- అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||
- భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||
- క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||
- శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||
- అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||
- సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||
Anukarinchedha ne nanudhinamunu అనుకరించెద నే ననుదినమును
Song no: 543
- అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||ననుకరించెద||
- పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||
- తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
- పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
- శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
- పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
- యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
- అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
- ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
- భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
Aduguchunna mo dheva kdu dhayanu gava అడుగుచున్నా మో దేవ కడు దయను గావ
Song no: 269
|
రాగం - శంకరాభరణము |
బోధకులకొరకైన ప్రార్థన |
తాళం - ఆది |
- అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||
- వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||
- సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||
- దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||
- తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||
- మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||
- దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||
- రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||
- ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||
Andhuda rava aramarayela adugonayya అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య
Song no: 627
- అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...
- నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||
- మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||
- ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||
- లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||
- పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||
- హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||
Amthya dhinamandhu dhutha bura nudhu అంత్య దినమందు దూత బూర నూదు
Song no: 497
- అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరి యుందు నచ్చ టన్||
- క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్.
- కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్
Devudinaddam mosalu cheyyaboku bible peru దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు బైబిలు పేరు
Song no: 121
దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా... నామాట వినరన్నా
ఓ..చిన్నన్నా...ఈమాట నిజమన్నా
1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పికైనా
2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీఆస్తి పెంచినా
అన్యాయపుసిరి నిలుచునా - దేవునిశిక్షతప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందాుముఇప్పటికైనా
3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా - ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పటికైనా
దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా... నామాట వినరన్నా
ఓ..చిన్నన్నా...ఈమాట నిజమన్నా
1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పికైనా
2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీఆస్తి పెంచినా
అన్యాయపుసిరి నిలుచునా - దేవునిశిక్షతప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందాుముఇప్పటికైనా
3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా - ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పటికైనా











