Aduguchunna mo dheva kdu dhayanu gava అడుగుచున్నా మో దేవ కడు దయను గావ

Song no: 269

రాగం - శంకరాభరణము 

బోధకులకొరకైన ప్రార్థన

తాళం - ఆది

    అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||
  1. వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

  2. సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

  3. దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

  4. తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

  5. మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||

  6. దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||

  7. రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

  8. ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||

Andhuda rava aramarayela adugonayya అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య

Song no: 627

    అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...

  1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||

  2. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||

  3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||

  4. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||

  5. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||

  6. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||


Amthya dhinamandhu dhutha bura nudhu అంత్య దినమందు దూత బూర నూదు

Song no: 497

    అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరి యుందు నచ్చ టన్||
  1. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్.
  2. కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్

Devudinaddam mosalu cheyyaboku bible peru దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు బైబిలు పేరు

Song no: 121


దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా... నామాట వినరన్నా
ఓ..చిన్నన్నా...ఈమాట నిజమన్నా

1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పికైనా

2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీఆస్తి పెంచినా
అన్యాయపుసిరి నిలుచునా - దేవునిశిక్షతప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందాుముఇప్పటికైనా

3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా - ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పటికైనా

Halleloya yani padudi samadhipai హలెలూయ యని పాడుఁడీ సమాధిపై

Song no: 217


హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||

Vijayambu vijayambu vijayambu ma yesu విజయంబు విజయంబు విజయంబు మా యేసు

Song no: 216


విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||

Sudhathulara mi ricchata nevvari vedhakuchunnaru సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు

Song no: 215


సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||

ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||

మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||