Siluvalo vreladu prabhuve viluva kamdhaga సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ

Song no: 204

సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||

కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||

తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||

పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువ||

లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||

ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువ|| దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||

శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువ||

మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువ||

నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను ||సిలువ||

Yemdhu boyedhavo ha prabhuraya yendhu boyedhavo ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో

Song no: 203

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక నీవు ||ఎందు||

వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు నీవు ||ఎందు||

మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ ||ఎందు||

విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి పట్టుకొమ్మలవియో ||ఎందు||

ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను ||నెందు||

పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా ప్రభువా ||ఎందు||

ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త ||ఎందు||

Kalvari girijeru manasa silva sarasa కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస

Song no: 202

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి||

సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||

పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి||

కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి||

ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి||

ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి||

పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి||

స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి||

పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి||

సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||

Kalavari mettapai kalavara mettidho కలవరి మెట్టపై కలవర మెట్టిదొ

Song no: #201

    కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల||

  1. తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల||

  2. పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల||

  3. దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||

  4. జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల||

  5. శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కల||

Chediyulu gumpugudiri kreesthu jada gani చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని

Song no: 200

చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు||

వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి ||చేడియలు||

రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి ||చేడియలు||

Sirulella vrudha kaga parikimchi nakunna సిరులెల్ల వృధ కాగ పరికించి నాకున్న

Song no: 199

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్ వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన ||సిరు లెల్ల||

ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను ||సిరు లెల్ల||

చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన ||సిరు లెల్ల||

వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె ||సిరు లెల్ల||

Ayyo nadhagu ghorapapamu gadha bharamai అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై

Song no: 197


అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||

నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||

కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||

మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||

కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||

ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా ||నయ్యో||

ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||