yennadu ganchedhamo yesuni nennadu ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు

Song no: 195


ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు||

అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||

వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||

చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు||

ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||

అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||

Yesunadhuni suluvapaini vesi sramabondhinchinadhi యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది

Song no: 194


యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసు||

కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసు||

మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసు||

పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసు||

దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే యందను రక్తియే ||యేసు||

హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే హృదయదు రేచ్ఛలే ||యేసు||

పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ సం దోహమే ||యేసు||

దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా ధారుణిఁ గడుతు నా ||యేసు||

aidhu gayamu londhinava nakora kaidhu ఐదు గాయము లొందినావా నాకొర! కైదు

Song no: 192


ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే ||ఐదు||

గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా ||ఐదు||

అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే ||ఐదు||

ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద ||ఐదు||

భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ ||ఐదు||

ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో ||ఐదు||

తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే ||ఐదు||

ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు ||ఐదు||

Aha yenthati sramabondhithi vayyo ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో

Song no: 190


ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా||

దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||

కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||

కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||

బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే ||ఆహా||





Vandhanam neeke vandhanam parishuddha sirama వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం

Song no: 189
(చాయ: చూడరే క్రీస్తుని)
వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద నందముగ మహిమ ప్రభువా ||వందనం||

భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి పోయెను మరణ బలమున ||వందనం||

సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే ||వందనం||

మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||

Chudare kreesthuni judare na sukhulara chudare చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే

Song no: 188

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||

మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||

మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||

ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే||



Papulayeda kree sthuni priya mettidho parikimpare పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె

Song no: 187

పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||

యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||

శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||

తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||

మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||