-->

Na neethi suryuda bhuvinelu yesayya నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని  (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2)  ||నా నీతి||

శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి   ||నా నీతి||

మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ..................యేసయ్యా
నీవుంటే ...................చాలునయా
నడిపించే ................. నజరేయుడా
కాపాడే .....................కాపరివి ||నా నీతి||

సంఘమై - నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా       ||నా నీతి||

Share:

Chirakala sneham neeprema charitham చిరకాల స్నేహం నీప్రేమ చరితం చిగురించే నాకొసమ

చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే  (2)

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2)

1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై  (2)
    నేను నీకు భారమైన దూరమైన వేళలో
    నీవే నాకు చేరువై చేరదీసినావయా
    ఎంత ప్రేమ యేసయ్యా             ||చిరకాల||

2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది  (2)
    సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో
    దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
    తోడు నీవే యేసయ్యా              || చిరకాలం||

3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు  (2)
    శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను
    శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా
    నిలిపినావు యేసయ్యా               ||చిరకాలం||

Share:

Yentha manchi prema needhi yesayya ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా

Song no:
HD
    ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
    నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
    అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
    అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2) || ఎంత మంచి ||

  1. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
    రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
    రాజులను మర్చిన రారాజువు...
    రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
    యేసయ్య నీ ప్రేమే మదురం...
    యేసయ్య నీ కృపయే అమరం.. (2) || ఎంత మంచి ||
     
  2. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
    అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
    అధికారాలను మార్చిన వాడా...
    అధికారులును మార్చిన వాడా.. (2)
    యేసయ్య నీ ప్రేమే మదురం...
    యేసయ్య నీ కృపయే అమరం.. (2) || ఎంత మంచి ||

  3. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
    ఆకాశము నుండి మన్నను పంపావు(2)
    బండను చీల్చిన బలవంతుడా...
    మార మధురంగా మార్చిన వాడా.. (2)
    యేసయ్య నీ ప్రేమే మదురం...
    యేసయ్య నీ కృపయే అమరం.. (2)
Share:

Mahamahimatho nindima krupa sathyasampurnuda మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా

మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి  చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
              ||మహామహిమతో||

కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము  కాచితివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు
                  ||మహామహిమతో ||

పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను
                 ||మహామహిమతో ||

Share:

Sumadhura swaramula ganalatho సుమధుర స్వరముల గానాలతో

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)
                       || సుమధుర ||
  1. ఎడారి త్రోవలో  నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన
    నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము  (2)
                       || సుమధుర ||
  2. సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక  - నా ధైర్యము నీవేగా  (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము  (2)
                  || సుమధుర ||
  3. వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు  నీబలమును
    పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా  (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన  (2)
                    || సుమధుర ||
Share:

Naa yesu athma suryuda nivunna rathri kammadhu నా యేసూ ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు

Song no: #54
    నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.

  1. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.
  2. నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.
  3. నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.
  4. రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.
Share:

E sayamkalamuna yesu prabho vededhamu ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము

Song no: #53
    ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ||

  1. చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||
  2. దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ||
  3. నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||
  4. జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts