నా ప్రియుడా యేసయ్య..........
నా శైలమా రక్షణ శృంగమ........
యుగయుగాలు నిన్నే వివరించెద
నా స్వాస్థమ నిన్నే దరియించెద
నిన్నే సేవించెద.....................
" నా ప్రియుడ "
(1)
పరిమళించెనే ప్రతివసంతము.......
మధురమైన నీ ప్రేమలో................
అసాధ్యమైన కార్యాలెన్నో.............
జరిగించేని నీ బాహువు............... "2"
ప్రతి దినం ప్రతి క్షణం
నన్ను వెంబడించె నీవాగ్దానం....... "3"
" నా ప్రియుడ "
(2)
సేదదీరేనే నా ప్రాణం..................
విడువని నీదు కృపలో...............
అనంతమైన ఆనందాన్ని............
కలిగించెనునీకౌగిలి....................
ప్రతి దినం ప్రతి క్షణం
నను వెంబడించె నీ అభిషేకం...... "3"
" నా ప్రియుడ "
(3)
ఆత్మ వసుడనై ఆరాధించేద.........
అనుదినము నీ మహిమలో.........
అక్షయమైన అనుబంధాన్ని..........
అను గ్రహించెను నీ సిలువ.......... "2"
ప్రతి దినం ప్రతి క్షణం
నను వెంబడించె నీసహవాసం...... "3"
" నా ప్రియుడ "
Na priyuda yesayya na sailama rakshana srumgama నా ప్రియుడా యేసయ్య నా శైలమా రక్షణ శృంగమ
Siluvalo aa siluvalo a ghora kalvarilo సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥
వెలియైన యేసయ్యా
బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥
॥సిలువలో॥
1
నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళిని చీల్చెనే }
నీ సుందర దేహమునే }॥2॥
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు॥2॥
॥వెలియైన॥ ॥సిలువలో॥
2
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను ॥2॥
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ॥2॥
॥వెలియైన॥ ॥సిలువలో॥
3
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ॥2॥
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను॥2॥
॥వెలియైన॥ ॥సిలువలో॥
Yesu raka tharuna maye nivu siddhama sodhara యేసు రాక తరుణ మాయే నీవు సిద్దమా సోదర
యేసు రాక తరుణ మాయే
నీవు సిద్దమా ! సోదర!
ఆ పవిత్రుని చేరుటకు
అర్హురాలివా? సోదరి! || 2 ||
తలుపు కొట్టి పిలిచినప్పుడు
పలుకుటకు నీకు సాధ్యమా!
తండ్రి రాజ్యం చేరుటకు
ఇదియే తరుణం ఓ సంఘమా || 2 ||
పగిలిన నీ హృదయమయిన
వదలకుండా చేర్చుకోనును
విరిగిన నీ మనసునయిన
విడువకుండా అదుకోనును ॥ 2 ॥
నీదు పాపం కొండ అయిన
నిండుగా క్షమియించు వాడు
నీదు గిన్నె పొంగులాగ
అవసరాలు తిర్చుతాడు ॥ 2 ॥ ॥ యేసు రాక ॥
కాయు కాలము కాదు అంటూ
మోడుగను నివు ఉండబోకు
ఆకలి గొన్న ప్రభు యేసు
శాపములను పొందబోకు ॥ 2 ॥
తైలము లెని దిపము తోని
పెళ్ళి మెళమును చేరుకోకు
కాలమంతయు ఖర్చు చేసి
అన్యుల గుంపులో కలిసిపోకు ॥ 2 ॥ ॥ యేసు రాక ॥
Nee numdi veedi ne brathakagalana na margama నీ నుండి వీడి నే బ్రతకగలనా నా మార్గమా నాసత్యమా
నీ నుండి వీడి నే బ్రతకగలనా ||2||
నా మార్గమా నాసత్యమా
నా జీవమా నా సర్వమా
ఆదిలో వాక్కును పలికిన దేవా
ఈ సృష్టిని చేసిన ప్రభువా
నీ కుమారుని పంపినదేవా
మమ్ము రక్షించిన ప్రభువా
నీ ప్రేమ ప్రకటింప నా తరమా
నీ మహిమ గ్రహింప నాకు సాధ్యమా ||నా మార్గమా||
నీ రూపమును ఇచ్చిన దేవా
నాకు ప్రాణం పోసిన దేవా
నన్ను పేరుతో పిలిచిన దేవా
నన్ను దీవించిన ప్రభువా
నువ్వులేక నేనేమి చేయగనైయ్యా
నువ్వు లేక నేనే లేనయ్యా
||నా మార్గమా||
Yemani pogadudha deva nee krupalo nee premalo ఏమని పొగడుద దేవా నీ కృపలో నీ ప్రేమలో
ఏమని పొగడుద దేవా
నీ కృపలో నీ ప్రేమలో
నేను పొందిన వరములకై
దేవా ప్రభువా దేవా నా ప్రభువా
ప్రభు నీకు సాటేవరు
నిన్ను పోలిన వారెవరు
కడలి పొంగు నడిచెదము
సంద్రమును అనచెదము
విజయములు ఒసగెదవు
||ఏమని||
నీవే నా జనకుడవు
నీవే నా దేవుడవు
జేష్ఠునిగా నన్ను నిలిపి
అధికునిగా దీవించి
శుభములతో దీవించి
||ఏమని||
Silanaina nannu silpivai marchavu naloni శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని
శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/
నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి /2/శిల/
1.మొడుబారిన నాజీవితం – నీప్రేమతోనే చిగురింపచేసావు /2/
నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/
వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/
2.ఏవిలువలేని అభాగ్యుడను నేను – నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/
నాయెడల నీకున్న తలంపులు విస్తారం /2/
నీకొరకే నేను జీవింతునిలలో /2/నీప్రేమే/
3.వూహించలేను నీ ప్రేమ మధురం – నా ప్రేమ మూర్తి నీకే నా వందనం /2/
నీప్రేమే నాకాధారం – నాజీవితం లక్ష్యం /2/
నీప్రేమ లేక – నేనుండలేను /2/నీప్రేమే/
Neeve neeve na sarvam neeve samastham neeve నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
llపllనీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
నీవే నీవే నా జీవం నీవేే సహాయము నీవేll2ll
నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నాll2ll
ఎదురు చూస్తున్నా యేసయ్యా
ఎదురు చూస్తున్నా
llనీవే నీవేll
llచllఅనుక్షణము నిన్ను చూడనిదే
క్షణమైనా వెడలనులే
హృదయములో నీ కోసమే
నిన్ను గూర్చిన ధ్యానమేll2ll
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
llనీవే నీవేll
llచllఒంటరి నైనా నీ స్పర్శ (స్వరము) లేనిదే
బ్రతుకే లేదని
అనుదినము నీ ఆత్మలో
నిన్ను చూసే ఆనందమేll2ll
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
llనీవే నీవేll