-->
Song no: #39
నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
Song no: #38
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును
పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Song no: #37
మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.
మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు
ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ? దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.
వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.
కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం ..
రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం... "2"
కడుపురగిలి క్షుద్బాదను తట్టుకునే జీవనం.
గుండెపగిలి గొంతుఎండి అడుగుతుంది కారణం
సమాజాన్ని ప్రశ్నించే చిన్నతనం
ఈ సమాజానికె ఎంతో చిన్నతనం...
ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే..
దిక్కులేనివారికి దారిచూపనోడురా అనాథ అంటే..
కడుపులు చేసినోళ్ళురా..కనిపారేసినోళ్ళురా...
కరుణేలేనివాళ్ళురా అనాథలు..
మనసే లేనివాళ్ళురా..మనిషిగా బ్రతుకనోళ్ళురా..
జాలే లేని రాళ్ళురా అనాధలు
దోచుకున్న వాళ్ళకి తొడబుట్టినోళ్ళురా అనాథలంటే
దైవాభీతి ఎరుగని నీతిలేని జనమురా అనాథలంటే
పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు..
వీదులలోన ఒంటరితనాన పెరిగెను ఓ అనాథ చెట్టు...
జాలిలేని కళ్లు అన్ని చూసి విడిచిపోతుంటే
మనపిల్లలు కాదుగదా మనకెందుకు అనుకుంటే
దిక్కులేని పసికందులు గుక్కపెట్టి ఏడుస్తూ శోకంతోరాసుకున్న శోక్షమిదే
అమ్మా - నాన్నలేని అనాథ ఎవరు?
రాళ్లు రప్పలు కలిస్తే పుడతాడావాడు?
క్షణికావేశపు కామం కొందరిదీ..
జీవిత కాలపు క్షామం ఎందరిదీ..
బీదల చావు కేకకి.. ఎగిరిన ఎంగిలాకురా అనాథ అంటే..
పెద్దల పాశవికతకి అల్పుల నిష్పహాయతరా అనాథ అంటే...
పాముకు పాలు పోసేభక్తులు. బీదలకు ఇవ్వరు చన్నీళ్ళు.. గుళ్లకు లక్షలు ఆర్భాటాలు అనాథ బ్రతుకులేమో బుగ్గిపాలు...
దీనహీనులైన సాటి మనుషులని
కనికరించి
ఆదుకునే నాదులుగా మీవంతుగా సాయపడితే
పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే..
భక్తి జీవితపు కొలమానం అదేకదా..........
గర్భం దాల్చి కన్నవాళ్లే పిల్లలూ...
మానవతతో కన్నవాళ్ళు మనపిల్లలుకారా?
జాలి అనే నీ కడుపు పండాలి ..
ప్రేమ గర్భముందు నెలలు నిండాలి..
దయ అనేటి నొప్పులు రావాలి..
అభ్యగులకు తల్లితండ్రి గా మారాలి.
ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఈ బోధకు మూలమెవరు
అంధకార భక్తిభందురాలను తెంపినదెవరు
మానవాళి మనోనేత్రమును తెరిపించినది ఎవరు
విశ్వశాంతికాముకుడు రక్షకుడు ఆయనపేరు
మంచితనపు మహోన్నతకు పరాకాష్ట ప్రభువు..
సాటిమనిషి భాదతెలిసి సాయపడిన మన గురువు...
ఆధ్యాత్మిక అనాథలకు నీడ నిచ్చిన తరువు..
కారుణ్యపు నిజస్వరూపమునకే ఆయన ఋజువు..
ప్రభుభోదకు పులకించెను స్వార్ధపు మనుజుల తనువు...
మార్పుచెంది బీదలకై పంచిన ఆస్తులే ఋజువు.
అందరికి ఓకే దేవుడు తండ్రి అని ఎరుగానోడురా అనాథ అంటే.
తనవలె పొరుగువానికి ప్రేమను పంచనోడురా అనాథ అంటే....
ప్రకృతి ఎవరి సొత్తురా దైవము మనిషికిచ్చెరా దాచుకు తినేవాళ్ళురా అనాథలు సిరినే నమ్మినోళ్లురా పరణితి లేనివాళ్ళురా స్వార్థము నిండునోళ్ళరా అనాథలు..
కృశించువారిని సహించనోళ్ళురా అనాథలంటే..
శుష్కించువారని పోషించు వాళ్ళురా పునీతులంటే..
నశించువారికై కృశించుపోయెరా దయగల క్రీస్తు...
ఆనాధజీవుల ఉషస్సుకోరు నా మాదిరి క్రీస్తు...
Song no: #36
సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ సర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ జేరరండి! మా రాకపోకలన్ మం వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును
మహా దయాళుఁడే మా జీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్మున్ ఎన్నండుఁ బ్రోచును.
ప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా! ప్రఖ్యాతికల్గగా అపారసన్నుతి నర్పింతు సర్వదా
Song no: #35
ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!
ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో
నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు
చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్
ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్
Song no: #34
సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!
నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర
రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్
స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి