-->

Vandhanamo vandhanam mesayya వందనమో వందనం మెసయ్యా

వందనమో వందనం మెసయ్యా
అందుకొనుము మా దేవా
మాదు వందన మందుకొనుమయా

1.
ధరకేతెంచి దరియించితివా
నరరూపమును నరలోకములో
మరణమునొంది మరిలేచిన మా
మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా
        /వందనమో/

2.
పాపిని జూచి ప్రేమను జూపి
కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కాడు ప్రేమతో కడిగి-
కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన
                     /వందనమో/

3.
అనాధుడను నా నాథుండా
అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డేందమున
నుండి నడిపించు
క్రీస్తుడా స్తుతిపాత్రుండా స్తుతించు
        /వందనమో/

Share:

Na pranama yehovanu sannuthimchuma నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా

నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా
నా అంతరంగ సమస్తము సన్నుతించుమా
ఆయనచేసిన ఉపకారములను దేనిని మారువకుమా || 2||

1.
నీ దోషములను క్షమించువాడు
మీ సంకటములను కుదుర్చువాడు //2//
ప్రతిమేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడుగా
          /నాప్రాణ/

2.
కరుణా కటాక్షము నీకు కిరీటముగా
ఉంచుచున్నవాడు  సర్వశక్తిమంతుడు
దీర్ఘాయువునిచ్చి సంవత్సరములు హెచ్చించు
ఉత్సాహ గానములు-పాడించుచున్నావు //2//
               //నా ప్రాణమా//

3.
పరిశుద్ద తైలముతో అభిషేకించినపుడు
బాహుబలము చూపి బలపరచుచున్నాడు
నిత్య నిబంధన నీతో స్థిరపరచి
శాశ్వతమైన సింహాసనంయిచ్చాడు //2//
               //నాప్రాణమా//

Share:

Samvastharamantha nee krupalone dhachavu yesayya సంవత్సరమంతా నీ కృపలోనే దాచావు యేసయ్య

సంవత్సరమంతా నీ కృపలోనే
దాచావు యేసయ్య      " 2 "
నీతిని ధరింపజేసి
పరిశుద్ధత నాకిచ్చి       " 2 "
నీ సొత్తుగ నను మార్చుకుంటివా " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "

గడచిన దినములలో
నీ దయా కిరీటమునిచ్చి
కృప వెంబడి కృపతో
నా నడకను స్థిరపరచినావు " 2 "
దినదినము అనుక్షణము
నన్ను కాపాడుచుంటివా    " 2 "
నా ధ్యాస నా శ్వాస నీవయ్య
నీ కాపుదల నీ సహాయము
నాకుండగా                       " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "
                   " సంవత్సరమంతా "

ఆకాశ పక్షులను చూడుడి
అవి విత్తవు కోయవు
పంటను కూర్చుకొనవు
దేనికి చింతించవు              " 2 "
వాటికంటే శ్రేష్ఠమైన
నీ స్వాస్థ్యము నేనే కదా     " 2 "
నా ధ్యాస నా శ్వాస నీవయ్య
నీ కాపుదల నీ సహాయము
నాకుండగా                       " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "
                   " సంవత్సరమంతా "

Share:

Chuda chakkani baludamma చూడా చక్కని బాలుడమ్మో

చూడా చక్కని బాలుడమ్మో
బాలుడు కాదు మన దేవుడమ్మో" 2 "
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున " 2 "
మనకై జన్మించినాడు " 2 "

బెత్లహేము పురమందున
లోక రక్షకుడు పుట్టేను
లోకానికి వెలుగుగా మనకు కాపరిగా నిలిచెను  "2"
ఆ జ్ఞానులు ప్రధానులు
నా ప్రభువుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను "2"
సంతోషించి స్తుతియించి కీర్తించి
ఘనపరచి పరవశించిసాగెను " 2 "
                             చూడ చక్కని

మన చీకటిని తొలగించి వెలుగుతో నింపెను
మన పాపాన్నీ క్షమియించి
పవిత్రులుగా మార్చెను         " 2 "
పరిశుద్ధుడు పరమాత్ముడు
మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు
మా లోక రక్షకుడు               " 2 "
దివి నుండి భువి పైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించేను " 2 "
                       " చూడ చక్కని "

Share:

Vreladuchunnava alladuchunnava nE chesina వ్రేలాడుచున్నావా ? అల్లాడుచున్నావా నే' చేసిన

వ్రేలాడుచున్నావా ?
అల్లాడుచున్నావా    " 2 " ?
నే' చేసిన పాపానికై
నాలో దాగిన దోషానికై " 2 "
అల్లాడుచున్నావా  ?
విలవిలలాడుచున్నావా  ? " 2 "
                        "   వ్రేలాడుచున్నవా"

నిను కృంగదీసిన నా హృదయము
నిను మోసపరచిన నా పాపము " 2 "
నాకై చూపిన నీ సహనము
చేజార్చుకున్నాను నీ ప్రేమను " 2 "
అల్లాడుచున్నావా  ?
విలవిలలాడుచున్నావా  ? " 2 "
                        "   వ్రేలాడుచున్నవా"

నాకై నీవు చేసిన ఈ యాగము
పరిశుద్ధ పరచెను నీ రక్తము " 2 "
నీ గాయములు రేపిన నా దోషము
నాకై సిలువలో విడిచిన నీ ప్రాణము " 2 "
అల్లాడుచున్నావా  ?
విలవిలలాడుచున్నావా  ? " 2 "
                        "   వ్రేలాడుచున్నవా"

          

Share:

Samvastharamulu veluchumdaga nithyamu ni krupatho సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో

సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా

నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య "2"

గడచిన కాలమంతా నీ
చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు " 2 "
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు " 2 "
                           "  నీకే వందనం  "

బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే  నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు " 2 "
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు " 2 "
                            "  నీకే వందనం  "

                   

Share:

Yesayya nijamaina dhevudavani ninne nammiyunnamu యేసయ్య నిజమైన దేవుడవని నిన్నే నమ్మియున్నాము

యేసయ్య నిజమైన దేవుడవని
నిన్నే నమ్మియున్నాము
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాము    " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
ఇమ్మానుయేలువని మాకై జన్మించావని

ఉంటావులే ప్రభువా
అపత్కాలములో మాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
మీలాంటి రక్షకుడు మాకుండగా
మాకు భయమన్నదే లేదే
మీలాంటి స్నేహితుడు మాకుండగా
మాకు దిగులన్నదే రాదే
ఉంటావులే మా కడవరకు             }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
సర్వోన్నతమైన స్థలములలో
నీకే మహిమ              "  యేసయ్య  "

వస్తావులే ప్రభువా కష్ట కాలంలో మాఅండగా
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దరిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వచ్చావులే మా ధరణికి      }
చేరుస్తావులే పరలోకానికి  } " 2 "
సర్వోన్నతమైన స్థలములలో
నీకే మహిమ              "  యేసయ్య"

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts