Papakupamunandhu padi munigiyunnavu పాపకూపమునందు పడి మునిగియున్నావు

Song no:308

పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ ||పాప||

పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాప||

కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాప||

పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాప||

పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాప||

పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాప||

శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాప||





Hey prabhu yesu hey prabhu yesu హే ప్రభుయేసు హే ప్రభు యేసు

Song no:307

హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు||

శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||

తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||సిల్వధరా||

మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వధరా||

పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవహృదయము కలకలాడెకదా ||సిల్వధరా||

కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వధరా||

దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వధరా||

పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వధరా||

ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వధరా||

కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||సిల్వధరా||


Hey Prabhu Yesu – Hey Prabhu Yesu – Hey Prabhu Deva Suthaa
Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa      ||Hey Prabhu||
Shaanthi Samaadhaanaadhipathi
Swaanthamulo Prashaantha Nidhi (2)
Shaanthi Swaroopaa, Jeevana Deepaa (2)
Shaanthi Suvaartha Nidhi         ||Silva Dharaa||
Thapamulu Tharachina Ninne Gadaa
Japamulu Golichina Ninne Gadaa (2)
Viphalulu Jesina Vignaapanalaku (2)
Saphalatha Neeve Gadaa         ||Silva Dharaa||
Mathamulu Vedakina Ninne Gadaa
Vrathamulu Gorina Ninne Gadaa (2)
Pathithulu Devuni Suthulani Nerpina (2)
Hithamathi Veeve Gadaa         ||Silva Dharaa||
Palukulalo Nee Shaanthi Katha
Tholakari Vaanaga Gurise Gadaa (2)
Malamala Maadina Maanava Hrudayamu (2)
Kalakalalaade Kadaa         ||Silva Dharaa||
Kaananathulya Samaajamulo
Heenatha Jendenu Maanavatha (2)
Maanava Maithrini Silva Pathaakamu (2)
Daanamu Jesegadaa         ||Silva Dharaa||
Devuni Baasina Lokamulo
Chaavuye Kaapuramunde Gadaa (2)
Devunitho Sakhyambunu Jagathiki (2)
Yeevi Nidithivi Gadaa         ||Silva Dharaa||
Paapamu Chesina Sthreeni Gani
Paapula Kopamu Made Gadaa (2)
Daapuna Jeri Paapini Brochina (2)
Kaapari Veeve Gadaa         ||Silva Dharaa||
Khaalee Samaadhilo Maranamunu
Khaidiga Jesina Neeve Gadaa (2)
Khalamayudagu Saathaanuni Garvamu (2)
Khandanamaaye Gadaa         ||Silva Dharaa||
Kaluvarilo Nee Shaanthi Sudhaa
Selayeruga Bravahinche Gadaa (2)
Kalusha Edaarilo Kaluvalu Pooyuta (2)
Siluva Vijayamu Gadaa         ||Silva Dharaa||



Telegram Links


https://t.me/TeluguJesus

https://t.me/TeluguJesusSongs

https://t.me/TeluguChristianSongs

https://t.me/TeluguBibleQuiz

https://t.me/TeluguBibleQuiz1

https://t.me/TeluguBible

https://t.me/TeluguLaw

https://t.me/TeluguAudioBible

https://t.me/TeluguVakyalu newwwwwwww

https://t.me/TeluguSuperHitSongs

https://t.me/TeluguGoodNews

https://t.me/TeluguGospelChatting

https://t.me/OnlineLyricsList

https://t.me/OnlineSongs

https://t.me/OnlineTracks

https://t.me/SSBrothersSongs

https://t.me/Dhaivadhivena

https://t.me/VijayPrasadSongs

https://t.me/IForGodMinistries

https://t.me/HosannaSongs

https://t.me/SongsOfJesusMinistry

https://t.me/ChurchofChristSongs

https://t.me/Aaradana

https://t.me/GodTrueWay

https://t.me/GodOfWord

https://t.me/TheKingdomofGodGospel

��������

డియర్ అడ్మిన్స్ ఎవరినైనా రిమువ్ చేస్తే మళ్ళీ ఎప్పటికి వాళ్లు గ్రూప్ లో జాయిన్ అవ్వలేరు ������������������������������������������������������������������������������������������������������������������ ��������������������������

Randi manavulara rakshakunina mamdi రండి మానవులారా రక్షకునిన మ్మండి

Song no:305

రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి||

ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి||

పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి||

పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని గూర్చు యా ప్రభు నొద్దకిపుడే ||రండి||

భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర మున జేర్చు మిమ్మును నిశ్చయముగా ||రండి||





Vinare yesukristhu bodha madhini gonare వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే

Song no:304

వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే||

దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||

మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే||

మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే||

తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే||

తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||





Poyega poyega kalamu velli poyega పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ

Song no:303

పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ||

ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ||

జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ||

ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ||

మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ||

చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ||

జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ||





Yesuni sucharitha mentha ponarinadhi yevvaru యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు

Song no:302

యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్ భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా ||యేసు||

దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసు||

పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్ ||యేసు||

సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసు||

పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా ||యేసు||

దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా ||యేసు||