Vinare yesukristhu bodha madhini gonare వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే

Song no:304

వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే||

దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||

మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే||

మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే||

తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే||

తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||





Poyega poyega kalamu velli poyega పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ

Song no:303

పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ||

ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ||

జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ||

ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ||

మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ||

చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ||

జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ||





Yesuni sucharitha mentha ponarinadhi yevvaru యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు

Song no:302

యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్ భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా ||యేసు||

దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసు||

పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్ ||యేసు||

సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసు||

పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా ||యేసు||

దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా ||యేసు||





Raro janulara vegamugudi రారో జనులారా వేగముఁ గూడి

Song no:301

రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||

అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో||

మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో||

పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||

తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో||

సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో||





Rare yesuni juthamu korika dheera రారె యేసుని జూతము కోరిక దీర

Song no: 300

రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె||

సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||

ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె||

కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||

ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు





Padukuntu sagani na yathralo nee geetham పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం

పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం
నవ్వుకుంటూదాటని ఎదురయ్యే అవరోధం                                 
అలయక విసుగకపరుగునుఆపక
కర్తయేసు నిన్ను చూస్తూ కదలనీ

1.ఎండకుకాలిఅరణ్యం ఇబ్బందినికలిగించినా     
నిందకు చీలిన హృదయం ఆపశృతులే పలికించినా                   వెనుతిరిగి చూడకుండ-వెనకడుగు వేయకుండ                   
ప్రార్థనే తోడుగా గమ్యమే చేరని

2. గాలితుఫానులప్రళయం భయపెట్టాలని చూసినా     ఓటమిచాయల గరళం స్వరగతులే మార్చేసినా

3. ఉరికే నదుల ప్రవాహం మార్గం మూసివేసినా    
ఉరిమే శ్రమల ప్రభావం మాధుర్యం మింగేసినా            

Deham pathadhi manasu malinamainadhi దేహం పాతది మనసు మలినమైనది

దేహం పాతది – మనసు మలినమైనది
జీవం పాపిది – మార్గం తెలియనిది (2)
సర్వోన్నతుడా నిత్య నూతనుడా
నిత్య జీవనం కలిగించుమయ్యా
మరియా కన్న తనయా         ||దేహం||

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే
ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే
తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే
మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు
తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు
వీడగ లేని సంసారమనే బంధం విడిపించు
నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు        ||సర్వోన్నతుడా||

Deham Paathadi – Manasu Malinamainadi
Jeevam Paapidi – Maargam Theliyanidi (2)
Sarvonnathudaa Nithya Noothanudaa
Nithya Jeevanam Kaliginchumayyaa
Mariyaa Kanna Thanayaa       ||Deham||

Daahamtho Nuvvu Neellanu Adigithe Ivvakapoyaane
Aakaligoni Nuvvu Rottenu Adigithe Pettakapoyaane
Thala Daachukune Aashrayamadigithe Po Ani Annaane
Maanamu Kaachaga Vasthramunadigithe
Ledani Annaane                       ||Sarvonnathudaa||

Thelisi Theliyaka Chesina Thappulu Unnavi Manninchu
Thandrivi Neeve Naa Cheyini Nuvvu Patti Nadipinchu
Veedaga Leni Samsaaramane Bandham Vidipinchu
Neepai Manasu Niliche Vidhamunu
Nuvve Nerpinchu                 ||Sarvonnathudaa||