Raro janulara vegamugudi రారో జనులారా వేగముఁ గూడి

Song no:301

రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||

అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో||

మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో||

పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||

తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో||

సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో||





Rare yesuni juthamu korika dheera రారె యేసుని జూతము కోరిక దీర

Song no: 300

రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె||

సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||

ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె||

కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||

ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు





Padukuntu sagani na yathralo nee geetham పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం

పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం
నవ్వుకుంటూదాటని ఎదురయ్యే అవరోధం                                 
అలయక విసుగకపరుగునుఆపక
కర్తయేసు నిన్ను చూస్తూ కదలనీ

1.ఎండకుకాలిఅరణ్యం ఇబ్బందినికలిగించినా     
నిందకు చీలిన హృదయం ఆపశృతులే పలికించినా                   వెనుతిరిగి చూడకుండ-వెనకడుగు వేయకుండ                   
ప్రార్థనే తోడుగా గమ్యమే చేరని

2. గాలితుఫానులప్రళయం భయపెట్టాలని చూసినా     ఓటమిచాయల గరళం స్వరగతులే మార్చేసినా

3. ఉరికే నదుల ప్రవాహం మార్గం మూసివేసినా    
ఉరిమే శ్రమల ప్రభావం మాధుర్యం మింగేసినా            

Deham pathadhi manasu malinamainadhi దేహం పాతది మనసు మలినమైనది

దేహం పాతది – మనసు మలినమైనది
జీవం పాపిది – మార్గం తెలియనిది (2)
సర్వోన్నతుడా నిత్య నూతనుడా
నిత్య జీవనం కలిగించుమయ్యా
మరియా కన్న తనయా         ||దేహం||

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే
ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే
తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే
మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు
తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు
వీడగ లేని సంసారమనే బంధం విడిపించు
నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు        ||సర్వోన్నతుడా||

Deham Paathadi – Manasu Malinamainadi
Jeevam Paapidi – Maargam Theliyanidi (2)
Sarvonnathudaa Nithya Noothanudaa
Nithya Jeevanam Kaliginchumayyaa
Mariyaa Kanna Thanayaa       ||Deham||

Daahamtho Nuvvu Neellanu Adigithe Ivvakapoyaane
Aakaligoni Nuvvu Rottenu Adigithe Pettakapoyaane
Thala Daachukune Aashrayamadigithe Po Ani Annaane
Maanamu Kaachaga Vasthramunadigithe
Ledani Annaane                       ||Sarvonnathudaa||

Thelisi Theliyaka Chesina Thappulu Unnavi Manninchu
Thandrivi Neeve Naa Cheyini Nuvvu Patti Nadipinchu
Veedaga Leni Samsaaramane Bandham Vidipinchu
Neepai Manasu Niliche Vidhamunu
Nuvve Nerpinchu                 ||Sarvonnathudaa||

Yesu nee karyamulu yentho goppavi యేసూ నీ కార్యములు ఎంతో గొప్పవి

యేసూ.. నీ కార్యములు - ఎంతో గొప్పవి
తండ్రీ.. నీ తలంపులు - లెక్కలేనివి = 2
అవి కంటికి కనపడవు - హృదయానికి అంతుచిక్కవు - 2

1. కానావిందులో ఒకేమాటతో - అద్భుతముచేసితివీ
చేపకడుపులో ఆశ్చర్యముగా - యోనాను ఉంచితివీ = 2
"అవి కంటికి కనపడవు"

2. షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో - అగ్నిలో నిలచితివీ
దానియేలుకు సింహపు బోనులో - విజయమునిచ్చితివీ = 2
"అవి కంటికి కనపడవు"

3. పౌలు సీలలు ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయెనే
గొర్రెల కాపరి దావీదును - రాజును చేసితివీ = 2
"అవి కంటికి కనపడవు"

Yem chesanayya neekosam e brathukunicchavani ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

ఏం చేసానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||

Devuni mandhiram dhivena pramganam దేవుని మందిరం దీవెన ప్రాంగణం

లాలాలలా
పల్లవి.
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2.
వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2.

చరణం 1
ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించివున్నది

ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది
.వేచియున్నది.
.దేవుని.

చరణం2

వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కడ చెప్పుకునే వీలున్నది
వేచియున్నది.
.దేవునిమందిరం.

చరణం3.
వాక్యాహారములో ఫలించుటకు
దేవుని స్వరమువిని భలమొo దుటకు
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది
.వేచియున్నది.
.దేవునిమందిరం.