Yesuni namamlo mana badhalu povunu యేసుని నామములో మన బాధలు పోవును


యేసుని నామములో మన బాధలు పోవును
          దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును
          మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమమదొచ్చును
.. యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
          అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

1.        ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా
          ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా
          ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు
          పరివర్తన చెందినచో పరలోకం చేరేదవు        ||యేసు రక్తముకే||

2.       రాజువైన యాజకుడవైనా నిరుపేదవైన బ్రతుకు చెడియున్నా
          ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా
          శ్రీ యేసుని నామములో విశ్వాసం నీకున్నా 
          నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు     ||యేసు రక్తముకే||

Silvalo nakai karchenu yesu rakthamu సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము


సిల్వలో నాకై కార్చెనుయేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెనుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తముయేసు రక్తము (2)
సమకూర్చు నన్ను తండ్రితోయేసు రక్తము (2)
సంధి చేసి చేర్చునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితోయేసు రక్తము (2)
సమాధాన పరచునుయేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చునుయేసు రక్తము (2)
నీతిమంతులుగ చేయునుయేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తముయేసు రక్తము (2)
రోగములను బాపునుయేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చునుయేసు రక్తము (2)

Yenni thalachina yedhi adigina ఎన్ని తలచినా ఏది అడిగినా


ఎన్ని తలచినా ఏది అడిగినా   }
జరిగేది నీచిత్తమే                    }2 ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని   }
నా ప్రార్థనఆలకించుమా     }2 ప్రభువా
             1
నీ తోడు లేక నీ ప్రేమ లేక        }
ఇలలోన ప్రాణి నిలువలేదు }2
అడవి పూవులే నీ ప్రేమ పొందగా 2
నా ప్రార్థన ఆలకించుమా 2 ప్రభువా      ఎన్ని
              2
నా ఇంటి దీపం నీవే అని తెలసి          }
నా హృదయం నీ కొరకై పదిలపరచితి }2
ఆరిపోయిన నా వెలుగు దీపము 2
వెలిగించుము నీ ప్రేమతో 2 ప్రభువా      ఎన్ని
              3
ఆపదలు నన్ను వెన్నంటియున్నా  }
నా కాపరి నీవై నన్నాదుకొంటివి     }2
లోకమంతయూ నన్ను విడచినా 2
నీ నుండి వేరు చెయ్యవు 2 ప్రభువా      ఎన్ని
             4
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి }
నా కొరకై కల్వరిలో యాగమైతివి     }2
నీదు యాగమే నా మోక్ష మార్గము 2
నీయందే నిత్యజీవము 2 ప్రభువా         ఎన్ని

Yesayya Namamlo Sakthi Unnadhayya యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా


 యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
 శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
 నమ్మితే చాలు నీవు  పొందుకుంటావు శక్తిని    

1. పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
 పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం

2. రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము
 మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం

3. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
 దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం

4. సృష్టిని శాసించగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం
 మృతులను లేపగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం

5. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం
 పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం

Yentho sundhara mainadhi ఎంతో సుందర మైనది

ఎంతో సుందర మైనది

ఎంతో ఉన్నత మైనది

ఎంతో ప్రశాంత మైనది నా దేశము

ఎన్నో విలువలు ఉన్నది

ఎన్నో కళలు కన్నది

ఎన్నో మేలులు పొందినది

నా ప్రియ దేశము " 2 "

I love my india.I love my india

I love my india

I pray for my india " 2 "
నా దేశము నా యేసు ప్రేమను 
తెలుసుకోవాలనే నా ఆశ
నా దేశము నా యేసు రక్తములో కడగబడాలనే నా ఆశ " 2 "
నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని
నా యేసులో ప్రతి పాపము విడుదల పొందాలని " 2 "
I love my india.I love my india

I love my india

I pray for my india " 2 "
నా దేశము నా యేసు మార్గములో నడువాలనే నా ఆశ
నా దేశము నా యేసు చెంతకు చేరాలనే నా ఆశ " 2 "
నా యేసుని సువార్తను ప్రకటించాలని
నా యేసుని రాజ్యములో ప్రతి వారు ఉండాలని " 2 "
I love my india.I love my india

I love my india

I pray for my india " 2 " ఎంతో

Ee Jeevithamannadhi Kshanakalamainadhi ఈ జీవితమన్నది క్షణకాలమైనది

ఈ జీవితమన్నది క్షణకాలమైనది
పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||
ఆ‌‌‌స్తులు ఎన్ని ఉన్నా
అంతస్తులు ఎన్ని ఉన్నా
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్న || 2 ||
ఈ జీవితమన్నది ||

గొప్ప ప్రణాళికా నాకై సిద్ధము చేసి
తల్లీ గర్భంలో రూపించావు || 2 ||
సృష్ఠంతటిని నీ నోటిమాట ద్వారా చేశావు
పరిశుద్ధ‌మైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||
ఈ సృష్ఠిపైయున్న ప్రేమకంటే నాపై ఉన్న ప్రేమ || 2 ||
కలువరి శిలువలు ప్రాణం పెట్టి కనుపరిచావయ్య || 2 ||
ఈ జీవితమన్నది ||

ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్ధము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై దీనునిగా ఈ భూమిపై నీవు జన్మించావు || 2 ||
ఈ సృష్ఠిపైయున్న ప్రేమకంటే నాపై ఉన్న ప్రేమ || 2 ||
కలువరి శాలువలు ప్రాణం పెట్టి కనుపరిచావయ్య || 2 ||
ఈ జీవితమన్నది ||

Nuvve kavali yesuku nuvve kavali ninu dhivinchagorina నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి నిను దీవించగోరిన

Song no: 117

    నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి
    నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావలి

    నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి
    నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే } 2 {నువ్వే కావాలి}

  1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు
    నీదు అధికారము అక్కరరాదు
    నీదు పైరూపము లెక్కలోనికిరాదు
    నీదు వాక్చాతుర్యము పనికిరాదు } 2

    అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా చేసుకొని
    విరిగి నలిగిన హృదయంతో దైవసన్నిధి చేరాలి {నువ్వే కావాలి}

  2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము
    నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము
    నీ గోప్పపనులతో ఒరిగేది శూన్యము
    నీ మంచితనము ముండ్లతో సమానము } 2 {నిన్ను నీవు }