Yentho sundharamainavi dhara girula pai nentho ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో

Song no: 267

ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||

మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ మోటుజన మెరుఁగఁ పొందుగాఁ ప్రభు యే సొసంగెడు సుందరం బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ కుల పాదము ||లెంతో||

మదిలోఁ ప్రభుని నమ్మిన పాపుల నెల్లఁ తుదిని మోక్ష పదమ్మున విదితమ్ముగాఁ జేర్చి ప్రీతిఁ జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి కొని పదిలముగఁ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము ||లెంతో||

యేసు క్రీస్తు రారాజై యున్నాఁడనుచు భాసురంబుగఁ దెల్పుచు వాసిగాఁ ప్రభు యేసు వసుధ రక్షకుఁడనుచు యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద దోసకారి జనంబు లందరి కీ సుమంగళ వార్తఁ దెలుపుచు దోస మంతయుఁ బాపు మన ప్రభు యేసుఁ జూపెడు వారి పాదము ||లెంతో||

Neeve na priyudavu yesu prabhu nive na yedayudavu నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా

Song no: 414

నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||

పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||

నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||

నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||

నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||

సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే||

నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||

Saranu jocchithi yesu nadhuda sakthihinatha శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె

Song no: 421

శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||

కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||

మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||

తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||

శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||

Yevaru bhagyavamthu laudhu ravani lopala ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష

Song no: 154

ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||

దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||

వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||

శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||

Anna mana yesu prabhuni kanna rakshakudu ledu అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు

Song no: 162

అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||

నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||

దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||యన్న||

ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||

Gyanu laradhinchiri yesu prabhuni జ్ఞాను లారాధించిరి యేసు ప్రభుని

Song no: 114

జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||

చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు ||జ్ఞాను||

ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||

Dhashama bhagamu lella dhevunivi dharalamuga niyya దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య

Song no: 571

దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||

ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||