Gyanu laradhinchiri yesu prabhuni జ్ఞాను లారాధించిరి యేసు ప్రభుని

Song no: 114

జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||

చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు ||జ్ఞాను||

ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||

Dhashama bhagamu lella dhevunivi dharalamuga niyya దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య

Song no: 571

దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||

ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||

Srusti pitha sarvonnatha samarpinthun sarvaswamun సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్

Song no: 447

సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||

మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||

వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||

పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||

మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||

తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||

Sri yesune bhajinchu na manasa శ్రీ యేసునే భజించు నా మనసా

Song no: #79

    శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

  1. యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు||
  2. నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు||
  3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసు||
  4. నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసు||
  5. మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు||

Dhathruthyamunu galigi perugudhama dhanamu దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము

Song no: 573

దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ||దాతృ||

శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ||దాతృ||

సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృ||

గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృ||

సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ||

ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృ||

విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||

దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||

పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||

వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృ||

వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||

Deva sahayamu nimmu jeevampu దేవా సహాయము నిమ్మా జీవంపు

Song no: 376

దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా||

గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా||

కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||

దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||

మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా||

మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా||

Veerula mayya jaya veerula mayya వీరుల మయ్యా జయ వీరుల మయ్యా

Song no: 359

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||

మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల||

పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||

అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||

భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల||