Yesu nama mentho madhuram yesu nama యేసు నామ మెంతో మధురం యేసు నామ

Song no: 137

యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||

స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||

నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||

ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||

మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||

శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||

Sndhiyamu veedave naa manasa ya nandhamuna gudave సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే

Song no: 390

సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||

చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||

పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము||

నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము||

నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము||

ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము||

Painamai yunnanaya nee padhambujamula పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల

Song no: 486

పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా తము దొలఁగింపవె ||పైనమై||

సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు మరి దిక్కెవ్వరు ||పైనమై||

దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ ప్రయాణము తుదముట్టించుము ||పైనమై||

పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా ముందట నడువవె ముదమునఁ బ్రభువా ||పైనమై||

కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ మత్తఱి నొసఁగవె ||పైనమై||

నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల నీ సౌధము జేర్పవె ||పైనమై||

ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన చోటనె యుంచుము చాలును ||పైనమై||

Yesu namame pavanamu maku యేసు నామమే పావనము మాకు

Song no: 138

యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||

సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||

భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||

దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||

పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||

Popove yo lokama chalinka jalu nee pondhu పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు

Song no: 484

పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||

సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద భక్తి మా కెబ్బఁ ||బోపోవే||

నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై ననుఁబిల్చెఁ ||బోపోవే||

ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలుఁ ||బోపోవే||

ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ||బోపోవే||

Dhasula prarthana dhappika yosagedu దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు

Song no: 373

దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల||

జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల||

మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||

ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||

Yehova maa thandri gada yesundu ma yanna gada యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ

Song no: 435

యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||

మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||

అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||

పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||

తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||

పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||

కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||