Dhasula prarthana dhappika yosagedu దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు

Song no: 373

దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల||

జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల||

మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||

ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||

Yehova maa thandri gada yesundu ma yanna gada యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ

Song no: 435

యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||

మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||

అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||

పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||

తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||

పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||

కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

Yerimgi yerigi chedi pothivi manasa ieka ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక

Song no: 319

ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిఁగి||

ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిఁగి||

సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని ||యెఱిఁగి||

ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిఁగి||

గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||

పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||

అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము ||యెఱిఁగి||

Devudicchina Divya vakya mi dhenu దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను

Song no: 252

దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||

భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||

సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||

ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||

పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||

దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||

మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||

Manasanandhamu bondhuta kannanu mari ye మనసానందముఁ బొందుట కన్నను మరి యే

Song no: 489

 మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||

Paapula Yedala Kreesthuni priya mettidho పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో


Song no: 187 

పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||
యెరుషలేము న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||

Sakalendriyamulaaraa chala mee pani dhire సకలేంద్రియములారా చాల మీ పని దీరె


Song no: 485 

సకలేంద్రియములారాచాల మీ పనిదీరె నిఁక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని మీ రి దొలంగుఁడు యేసు నా క్షకుఁడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||
పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు లఁచి చూడుఁడు దేవ కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||
శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||
కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ జూడుఁడు ||సకలేంద్రియములారా||
రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద ||సకలేంద్రియములారా||
తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప బోయెద ||సకలేంద్రియములారా||
ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును ||సకలేంద్రియములారా||
కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ గావను ||సకలేంద్రియములారా||
వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద ||సకలేంద్రియములారా||
సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు ||సకలేంద్రియములారా||