Thana rakthamutho kadigi nee atmatho nimpavu తన రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపావు

తన రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపావు  }3

హోసన్నా నా యేసు రాజా హోసన్నా నా జీవన ధాత  } 2

సిలువపై వేలాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి } 2

సిలువపై వేలాడితివా నా పాపమంతా కడిగితివి

సిలువపై వేలాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి } 2

హోసన్నా నా యేసు రాజా హోసన్నా నా జీవన ధాత  } 2

AA bojana panktilo simonu intilo ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం


ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం
చేసిందిఅత్తరు తో యేసయ్యను కన్నీటితో  పాదాలను కడిగింది
తనకురులతో పాదాలు తుడిచింది ఆమె
సువాసనసువాసన ఇల్లంతా సువాసన
ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన
1 జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం
ఆవాక్యమే నన్ను బ్రతికించెను
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధన ఆత్మీయ ఆలపన ||2||(ఆభోజన)
2 సింహపు నోళ్ళను మూయించినది నీ వాక్యం
దానియేలుకువిజయము నిచెను ఆపై నీ వాక్యం
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధన ఆత్మీయ ఆలపన||2||(ఆభోజన)
3 అహష్వరోషు మనసును మార్చినది నీ వాక్యం
ఎస్తేరుప్రార్థన కు విడుదల నిచ్చిన నీ వాక్యం
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన||2||   ( ఆభోజన)

Bhumyakashamulu srujinchina yesayya nike stotram భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం

Song no: 100

    భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం } 2
    నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును } 2
    హలెలూయలూయ... లూయ... హలెలూయా } 4

  1. బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను
    ధీనదశలో నేనుండగా నను విడువనైతివి } 2 || భూమ్యాకాశములు ||

  2. జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను
    ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి } 2 || భూమ్యాకాశములు ||

  3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
    ఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి } 2 || భూమ్యాకాశములు ||

  4. నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
    నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి } 2 || భూమ్యాకాశములు ||

Bhumipai yesu jivinchenu భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు


భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు
     నీకును,నాకును మాధిరి - నీకును,నాకును మాధిరి

1. శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను
    లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు
    గెల్చెను యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని

2. ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి
    దాడి చేయు భాధను సోధనాధికంబును
    సూటిగా ధీటుగా నిల్వగా - సూటిగా ధీటుగా నిల్వగా

3. దూతాళి సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను
    పాపి రక్షణార్ధము  స్వీయ ప్రాణమిచ్చెను
    ప్రేమ సంపూర్ణుడు యేసుడు - ప్రేమ సంపూర్ణుడు యేసుడు

Bhu nivasulaku ee loka nivasulaku భూనివాసులకు - ఈ లోక నివాసులకు


భూనివాసులకు - ఈ లోక నివాసులకు
    యేసే జీవం - యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు
1. పరిసరములలోని - పండిన పైరంతా
    రాలిపోవు చుండ - సంతాపమే లేదా
    కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు
    ఓ దైవ సేవకుడా - ఇకనైనా మేల్కొనవా   భూనివా

2. పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని
    పౌలువంటి భక్తులు - ప్రాణాలు తెగియించిరి
    దేవుని వాక్యము - దేదీప్యమానము
    దీనుడవై యెపుడు - దీక్షతో చాటించు     భూనివా

3. సువార్త భారమును - సంపూర్ణ భాద్యతతో
    మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు
    దేవుని మార్గము - పూజనీయము
    దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు     భూనివా

4. సంఘమ మేల్కొనుమా - సాతానునెదిరించుమా
    సర్వాంగ కవచమును - ధరియించి పోరాడుము
    చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై
    జ్వాలను రగిలించు - రక్షణ ప్రకటించు   భూనివా

Bhu digantamula nivasulara భూ దిగంతముల నివాసులారా


భూ దిగంతముల నివాసులారా
ఫ్రభుయేసుపిలిచెనుత్వరగరండి
1. నాశనకరమగుగుంటనుండి-జిగటగలదొంగయూబిలో
నుండినవారలారాయిటురమ్మనెను        "భూది"

2.హృదయముఅన్నింటికంటెను-మోసకరమైనదియనెన్
అదిఘారమైనవ్యాధిగలది   "భూది"

3.హృదయమునిండినదానినుండి-పెదవులుమాట్లాడుచుండును
నీహృదయముదేవునికర్పించుము   "భూది"

4.ఏవడైననునాస్వరమువిని-హృదయపుతలుపును
తెరచినచో-నేనతనిలోనివసించినడిపింతును    "భూది"

5. కుమారుడాఓకుమారి-నీహృదయమునాకిమ్మని
ప్రభువుఅడుగుచున్నాడురారండి       "భూది"

Bharath deshamanthata prabhuvaina yesu suvarthaa భారతదేశమంతట ప్రభువైన యేసుసువార్త


భారతదేశమంతట ప్రభువైన యేసుసువార్త
ప్రకటీంచే బాద్యత మనపై ఉన్నధి సోదరా
నీపై ఉన్నధి సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ
శతాభ్దాంతపు ధశాబ్ది ఈ యుగాంతపు కాలమిది
పంట విస్తారము ఇది కోతకుస సమయము “2”

1. ప్రోద్ధుగుంకు వెళాయేను పనియెంతో ఆదికము
జాలము చేయకు సోదరా కాలము లేదని ఎరుగరా
కారు చీకటులు క్రమ్మురా శతా

2. విశ్వసములో నడుము బిగించి సీద్ధమానసుతో నడుము వంచి
వాక్యమునే కొడవలి వాటి-వడిగా పంటనుకోయరా
వడివడిగా పనిసాగించారా శతా

3. నిద్రించుటకు సమయము లేదు నిర్జీవతకు చోటే లేదు
నీతి ప్రవర్థనతో మేల్కొని క్రిస్తు మహిమను చాటించు
దర క్రీస్తు ప్రేమను ప్రకటించు శతా

4. కన్నులెత్తి పైరును చూడు కొడవయే పనివారు
కొత యజమాని యేసునాధుని కోయువారిని పంపమని
కన్నీళ్ళతో ప్రార్దించరా శతా

5. సూధూర సాగర ద్వీపాలకు కొండ కోనల అడవులకు
ఎండిన ఎడారి భూములకు మహిమ సువార్తను ఆందించు
భూధిగంతములు పయనించు శతా