Bharatha desha suvartha sangamaa భారత దేశ సువార్త సంఘమా భువిదివిసంగమమా


భారత దేశ సువార్త సంఘమా భువిదివిసంగమమా
ధరసాతానునిరాజ్యముకూల్చేయుద్ధరంగమా

1.ఎవనిపంపుదునునాతరపునఇలఎవరుపోవుదురు
నాకైనేనున్ననునన్నుపంపుమనిరమ్మూఓసంఘమా (2)
భారతదేశములోవెలిగేసువార్తసంఘమా

2.అడవిప్రాంతములుఎడారిభూములుద్వీపవాసులనుగనుమా
అంధకారప్రాంతాలప్రభునిజ్యోతినివెలిగించునిచనుమా (2)
భారతదేశములోవెలిగేసువారసంఘమా

3. బ్రతుకులోనప్రభుశక్తిలేనిక్రైస్తవజనాంగమునుకనుమా
కునికినదివ్వెలుసరిచేయఉజ్జీవజ్వాలగొనిచనుమా (2)
భారతదేశములోవెలిగేసువారసంఘమా

Bayamu ledugaa digulu ledhu gaa yesuni nammmina variki భయములేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి


భయములేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి(2)
విడువడునిన్ను, ఎడబాయడు నిన్ను(2)
మాటఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవునా(3)

1.ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములులేవని దిగులు ఏలనో
ఆకాశపక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చు కొనవు
ఆయనేవాటిని పోషించుచున్నాడు"భయము"

2.తల్లి అయినా మరచినా మరువ వచ్చును, తండ్రిఅయినా విడచినా విడువ వచ్చును
వారైనామరచినా మరువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరువకుందును"భయము"

3.ఆరోగ్యం లేదని కృంగుటేలనో, ఆర్థికంగాలేనని జడియనేలనో అడుగువాటికంటే
ఉహించువాటికంటేఅత్యధికముగ ఇచ్చు ఏసుడుండగా చింత దిగులు మాని యేసు ప్రభునుస్తుతించు"భయము"

Bandamu neve snehamu neve బంధము నీవే స్నేహము నీవే


బంధము నీవే స్నేహము నీవే
అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా
ప్రేమించువాడా కృపఁచూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
మరువని తండ్రివయా నాయేసయ్యా
1.కారు చీకటి నను కమ్ము వేళ వెలుగు నీవై ఉదయించినావా
నీ ఒడిలో నే నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా
కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా
2.మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా
హృదయవీణవై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా
3.యీలోకంలో యాత్రికూడను ఎవ్వరులేని ఒంటరినయ్యా
నీవె నాకు సర్వము దేవా చాలును చాలునయా
నీ సన్నిధి చాలునయా నా యేసయ్యా
4.మోడుబారిన నాబ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా
నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలియించె నా జీవితం
ఆనందమానందమే నా యేసయ్యా


Buela desham nadi sustiramaina punadi బ్యూలాదేశము నాది సుస్థిరమైన పునాది


బ్యూలాదేశము నాది సుస్థిరమైన పునాది - కాలము స్థలము లేనిది సుందరపురము - నందనవనము ||బ్యూలా||
1.స్పటిక నదితీరము నాది అన్నిటిలో ఘనం అనాది - అపశృతి లేని రాగములు అలరెడు పురము యేసునివరము ||బ్యూలా||
2.జీవవృక్ష ఫలసాయము నాది దేవుని మహిమ స్పర్శవేది - మరణం బాధేలేనిది - అమరులపురము మంగళకరము ||బ్యూలా||

Bible chebutthundi prapancha bavishyttu బైబిల్ చెబుతుందీ ప్రపంచ భవిష్యత్తూ...


బైబిల్ చెబుతుందీ ప్రపంచ భవిష్యత్తూ...
లోకానికి వస్తుందీ విపత్తు .మీద విపత్తు (2)
తెలుసుకోండిప్రజలారాఇదిదేవునిఉగ్రతా(2)
క్రీస్తుకొరకుబ్రతకండిదేవుడున్నాడుజాగ్రత్త(బైబిల్ )

1.అల్లాడుతుందిప్రపంచంఆకలిచావులతో
తల్లడిల్లిపోతుందికుదరనిరోగాలతో (2)
వణికిపోతుందిప్రపంచంశ్రమలకుగడగడా ..(2)
కష్టమైపోతుందిభువిపైమానవమనుగడ (2)(బైబిల్)

2.అందమైనఈలోకంఅడవైపోతుంది
ప్రజలమద్యనప్రేమచల్లారిపోతుంది(2)
దేవునిమాటలులేకపాడయిపోతుంది
వినాశనంవైపుకుపరుగులుతీస్తుంది (2)(బైబిల్)

3.పంచభూతములువేండ్రములోలయమైపోవునూ..
భూమియుదానికృత్యములుకాలిపోవునూ(2)
ఎదురుచూడాలిక్రీస్తుకొరకుభక్తిశ్రధ్దలతో
పరమచేరాలిక్రీస్తుతోనిత్యసుఖాలకు(2)(బైబిల్)

Bethlehemulo sandadi pashula pakalo sandadi బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి


బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ  !!2!!

1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి !!2!!
వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి !!2!!

2.దూతల  పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి !!2!!
గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి !!2!!

3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి !!2!!
జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి !!2!!

Budi budi augulu vesthu yesutho బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను


బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను       
సండేస్కూల్ కి వెల్తూ యేసును స్తుతించెదను       
షాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యండ్ ఇచ్చెదను.       
సంతోష గానము యేసుతో సండే గడిపెదను      
చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం

1.చిన్ని ప్రాయంలో యేసుని వెంబడించుచు  
నా సిలువను ఎత్తుకొని గురియెద్దకే సాగెదా  
షాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యండ్ ఇచ్చెదను   
సంతోష గానము యేసుతో సండే గడిపెదను   
చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం (బుడి బుడి)