Chinnabucchukoku o nesthama nivunna చిన్నబుచ్చుకోకు ఓ నేస్తమా నీవున్న


చిన్నబుచ్చుకోకు    నేస్తమా నీవున్న   స్థితినిబట్టి  కృంగిపోకుమా                
కారణం   లేకుండా  దేవుడు  
నిన్నక్కడ   ఉంచలేదు   గమనించుమా
.:సంతృప్తితో  నీవుజీవించుమా 
 తగిన సమయముకై   కనిపెట్టుమా
1.నీకు లేని వాటి  గూర్చి చింతిస్తూ  దేవునిపై   సణిగేవు  
లెక్కలేని  దీవెనలు అనుభవిస్తూ   కృతజ్ఞత  చూపలేవు      
ఇతరులతో  పోల్చి చూసుకోకుండా  గోప్పకుపోయు  దుఖపడకుండా
2.ఎదుగుతున్న వారిగూర్చి ఆలోచిస్తూ సమయాన్ని   గడిపేవు  
కృషి లేకుండా ఫలితం అభిలషిస్తూ అడ్డదారవెదికేవు                    తొందరపడి కీడు  తెచ్చుకోకుండా  దేవుని చిత్తం పాడు చేయకుండా
3.దేవునిచేవాడబడే వారిని చూస్తూ అసూయతో రగిలేవు    
నీదికాని  తలాంతును అనుకరిస్తూ నిరాశతో మిగిలేవు                 సహోదరుని దారికడ్డురాకుండాపడద్రోసేప్రయత్నాలు  చేయకుండా                  

Chuchuchunna devudavayya nannu చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు


చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
నీ పేరేమిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా
1.శారాయి మాటలే విన్నాను అబ్రాముకే భార్యనయ్యాను
అరణ్య దారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును
2.ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణమును చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
3.పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని
వాగ్దానమిచ్చిన దేవుడవు నీవు గొప్ప దేవుడవు

Chudare golgotha giri చూడరే గొల్గొత గిరి


చూడరే గొల్గొత గిరి - చేరరే కలువరి దరి
యేసు శ్రమల వేదన - పాపి కొరకు రోదన
సిలువపైనదైవసుతునిమరణయాతన

1. లేతమొక్కవలెనుయేసయ్యపెరిగెను
సురూపముసొగసతనికిలేకపోయెను
ఛెళ్ళుమన్నకొరడాలు - ఒడలంతాగాయాలు
ఆదెబ్బలలోమనకుస్వస్థతకలిగెన్

2. బాధింపబడిననుమౌనియాయెను
అన్యాయపుతీర్పునొందిదోషియాయెను
పక్కలోదిగెబళ్ళెం - తలకుముండ్లమకుటం
మనయందరిదోషమునుఆయనేమోసెన్

Chithikina na jivithamu chinigina o kagithamu చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము


చితికిన నా జీవితము చినిగిన కాగితము
నా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్య
నా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగా

1.నీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు
అలనాడు దానియేలు బబులోను దేశములో
నీ పక్షముగా నిలబడినాడు
నా ఆశ అదియే దేవానా మార్గము అదియే

2.నీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు
అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్యన
నడిపించినావా దేవా
నా ఆశ అదియే దేవానా మార్గము అదియే

3.విశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవా
అలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా దేవా 
నా ఆశ అదియే దేవాపరిశుద్దతతో నన్ను కడవరకు నడిపించు 

Chutta beedi cigerettu narakamuloniki చుట్టా బీడీ సిగరెట్టు నరకములోనికి


చుట్టా బీడీ సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు(4)
కనుతెరిచి కనిపెట్టు జీవితమంత కంపుకొట్టు"చుట్టా"

1.సరదాగానే మొదలెట్టి మనేస్తానని ఒట్టుపెట్టి (2)
కోరికదయ్యం నీకు పట్టికాల్చేస్తావు పెట్టెకుపెట్టి (2)"చుట్టా"

2.గబుగబున పీల్చేస్తావు గుండెకాయనే కాల్చేస్తావు (2)
మరణం వస్తేఏంచేస్తావు నరకబాధనే రుచిచూస్తావు (2)"చుట్టా"

3.మనేయాలని అనుకొంటే మోక్షంలో చేరాలంటే(2)
ఉన్నది యేసుని మార్గం ఒకటి రక్షణ దొరుకు నమ్ముకుంటే(2)"చుట్టా"

Chatali jagathilo devuni keerthi చాటాలి జగతిలో దేవుని కీర్తి


చాటాలి జగతిలో దేవుని కీర్తి కావాలి మనిషికి దేవుని నీతిమనుష్యుడా ఏది ఉత్తమమో ఇకనైనా నీవు తెలుసుకోలోక స్నేహమైనా
1.అంద చందమైనాకలకాలము కలిసి రావు నీకు తోడుగామేడ మిద్దెలైన పరువు ప్రతిష్ఠయినాచేకూర్చవు మేలులు నీకు ఎల్లవేళలాబ్రతుకుకు కావాలి 2.శ్రేష్టమైనది బ్రతుకులు సాధించాలి నిత్యమైనవిమనుష్యుడాలోక జ్ఞానమైనా సకల శాస్త్రమైనానిత్య జీవ మార్గము నీకు చూపలేవుగామనుష్య నీతి అయినా
3.బలులర్పనలైనాశాశ్వత రాజ్యములో నిన్ను చేర్చలేవుగాక్రీస్తు మాటలే జీవమైనవి దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనదిక్రీస్తు మార్గమే జీవమైనది దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనదిమనుష్యుడా

Chinna gorrepillanu yesayya చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా


చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
1.శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2)    యేసయ్యా॥
2.ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2)    యేసయ్యా॥
3.శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2)    యేసయ్యా॥
4.అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2)    యేసయ్యా॥