Simhasanasinuda yudha gothrapu simhama సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా


Song no:

సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవతనయా
దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు (2)
. . . . హల్లెలూయా మా మహరాజా
హొసన్నా హొసన్నా హల్లేలూయా ! శ్రీయేసురాజా . . .
1.
ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె
ప్రభుయేసు క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . . .

2. సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే
మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . . . అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా
నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా .

Sadhinche viswasam nadhey kondalanni kadhilipovunu సాధించే విశ్వాసం నాదే కొండలన్నీ కదిలిపోవును


Song no:

సాధించే విశ్వాసం నాదే కొండలన్నీ కదిలిపోవును
జయించె విశ్వాసం నాదేహద్దులన్నీ తొలగిపోవును
జయధ్వని యేసయ్యా నామమే
జయశాలి యేసుతో సాగేద నాయెదుట ఎవరు నిలువలేరు
నాయుద్ధము యెహొవా చేయును
నావిజయము యేసులో విశ్వాసమే            
1నాలోని వున్నవాడు లోకంలో వున్నవానికంటే గొప్పవాడు నను గెలిపించువాడు అపవాదిక్రియలను
లయం చేయువాడు(జయధ్వని)              
2నాలోజీవించువాడు మృతులనుసజీవులుగా

చేసే మృత్యుంజయుడునన్ను నడిపించువాడు లేనివాటినివున్నట్లుగా తీర్చే శక్తిమంతుడు(జయధ్వని)

Sageti e jeeva yathralo regeti penu thupanulenno సాగేటి ఈ జీవ యాత్రలో రేగేటి పెను


Song no:

సాగేటి జీవ యాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద దీర్చవా నీ చేతి స్పర్శతో
1. సుడిగుండాలెన్నో లోకసాగరానా వడిగా నను లాగి
పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
యేసయ్యా మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

2. వడగాల్పులెన్నో నా పయనం లోన నడవనీక సొమ్మసిల్ల
జేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
యేసయ్యా మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

Sarvya chitthambbu needheynayya swarupamicchu సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు


Song no:

సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును
1. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు బోవ నను కడుగుమా
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా
నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే నీచేతబట్టి నన్ రక్షింపుమా

. ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీయాత్మతో ఆవరింపుమో నా రక్షకా
అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా

Sathyamunaku mem sakshulam kreeshuku సత్యమునకు మేం సాక్షులము క్రీస్తుకు


Song no:

సత్యమునకు మేం సాక్షులము క్రీస్తుకు మేము సాక్షులము
రోషముగల దేవుని ప్రజలం సత్యము కలిగి జీవిస్తాం
రోషముగల దేవుని ప్రజలం సత్యము కొరకు మరణిస్తాం
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
హోసన్నా. . హోసన్నా. . హోసన్నా. .
1. ఉమ్ములూసినా మొఖము త్రిప్పము
ముళ్ళు గ్రుచ్చినా తలను వొంచము
కొరడ విసిరినా వెనుక తిరుగముబల్లెము పొడిచినా భయపడము
సత్యము కలిగి జీవిస్తాంసత్యము కొరకు మరణిస్తాం

2. మాకు మేము తగ్గించుకొంటాం
మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధన చేస్తాం
సిలువ సంకెళ్ళ సమర్పణ చేస్తాందేవుని రాజ్యము రగిలిస్తాం
సత్యము కలిగి జీవిస్తాంసత్యము కొరకు మరణిస్తాం