• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Prabhu yesu kreesthu janminche paripurna ప్రభు యేసు క్రీస్తు జన్మించే - పరిపూర్ణ తేజముతో

ప్రభు యేసు క్రీస్తు జన్మించే - పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం –
ఇదియే మహోదయం.."2"
పరిశుధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడైపరలోక మార్గము చూపుటకు –
తన ప్రేమను తెలుపుటకు..॥ప్రభు యేసు॥
పాపులకై పరమును విడచి - నరరూపధారునిగా పశువుల శాలలో
Ĺమరియ సుతునిగా ఆయన పవళించే.."2"
దూతలు తెల్ప ఆ వార్తను విని ఆ గొర్రెల కాపరులు
అడుగో ప్రభు అని కని ఆరాధించిరి ..॥ప్రభు యేసు॥
తూరుపు తారలు కనుగోనినా - ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి
అద్భుత కరుడగు యేసును దర్శించి .."2"
భక్తితో మ్రొక్కి  కానుకలిచ్చి - బహు సంతోశించగా మనము
ఇది విని ప్రభుని ఆరాధింతుము..॥ప్రభు యేసు॥
Share:

Prakashinche nakshanthram chikati viswamlo ప్రకాశించే నక్షత్రం చీకటి విశ్వంలో ఉదయించేను రక్షకుడు

ప్రకాశించే నక్షత్రం – చీకటి విశ్వంలో – ఉదయించేను రక్షకుడు పాపందకారములో
దివి నుండి భూవికేతెంచును – మన కొరకే ఆ ప్రభుయేసుడూ “2”
1.భూవిపై శాపము బాపుటకు వచ్చెను – పాప విమోచన కలిగించుటకు వచ్చెను “2”
మహిమా శరీరము వదిలి – ఇలనరుడై ఉదయించేను
మన కొరకై తాను తగ్గించుకోనెను “2”
2.స్తుతిల నైవేద్యమును గైకొను ఆ దేవుడే
ఉన్నత భాగ్యం వదిలి భూవిపై పుట్టెను “2”
ఇమ్మాను యేలుగా సదాకాలము – మనకు తోడై ఉండే దేవుడు “2”
Share:

Pudami pulakinchindhi prakruthi paravasinchindhi పుడమి పులకించింది ప్రకృతి పరవశించింది

పుడమి పులకించింది – ప్రకృతి పరవశించింది
యెసయ్య  పుట్టాడని నీ కొరకే వచ్చాడని   “2”  
క్రిస్మస్ సంతోషం వచ్చింది – మనకు రక్షణ ఇచ్చింది 
లేఖనములను నెరవేర్చగా – జన్మించే యెసయ్య నిరుపేదగా
పాపభారమంత యూ రూపు మాపగ – పుట్టెను యెసయ్యా నరరూపినిగా
దేవాది దేవుడే పుడమిపై వెలిసెను “2”  
మార్గము సత్యము జీవమూ ఆ యేసుడే “2”   
కన్య మరియ గర్బమందు బాల యేసుగా
పశుల పాక తోట్టే యందు పసిబాలునిగా
నరక దుఖ్హ వ్యాధులను రూపుమాపగా
పయనమయ్యే త్యాగమూర్తి సిల్వధారిగా
దేవాది దేవుడే పుడమిపై వెలిసెను “2”  
మార్గము సత్యము జీవమూ ఆ యేసుడే “2”   
పాట
Share:

Bala yesuni janma dhinam vedukaina shubha dhinamu బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము

బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ         ||బాల||
మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాట -లు పాడి          ||బాల||
పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు        ||బాల||
మన జోల పాట -లు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు           ||బాల||
Share:

Bethlehemu urilo pashuvula paka needalo బెత్లెహేము ఊరిలో - పశులపాక నీడలో

బెత్లెహేము ఊరిలో - పశులపాక నీడలో
ఉదయించె బాలుడు - రవికోటితేజుడు
అ.ప. : ఆనందామానందామానందాం (4)
హాసనం విడచి - పరమ సౌఖ్యం మరచి
నరులహృది భానుడై - ధరకు దిగె దీనుడై
మహిమరూపం మార్చి - మంటి దేహం దాల్చి
పాపశ్రమ మోయను - శాపమును బాపను
తండ్రి చిత్తం నెరవేర్చ - పరిశుద్ధరక్తం కార్చ
లోక ఇక్కట్లను తీర్చ - మరణశక్తిని హతమార్చ
Share:

Bethlehemu puramulona ardharathri బెత్లహేము పురములోన ఆర్ధరాత్రి వేలలోన

బెత్లహేము పురములోన
ఆర్ధరాత్రి వేలలోన దేవా దూత  తేచెనంట శుభవార్త(2)
నేడే రక్షకుడు బెత్లహేములోన మీకై పుట్టినాడు చుడమనుచు
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మేర్రి మేర్రి మేర్రి క్రిస్మస్  (2)
వార్త విన్నా కాపరులంత
బాలయేసుని దర్శించిరి(2)
పూజించిరి ఆరాధించిరి
బహుముతు ఎన్నో సమర్పించిరి (హ్యాపీ)
సువార్త విన్నా నివు నేను యేసు రాజుని చెంత చేరేదం(2)
కీర్తించేదం కొనియడదం
హృదయాలను యేసుకే సమర్పించెదం(2) (హ్యాపీ)
Share:

Bethlehemu puramunandhu chithramayenanta బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట

బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట
కర్తయేసు బాలుడుగా జననమాయెనంట
అంధాకారమైన - ఆకస వీధులలో
ఆనందపు మహిమ చోద్యామేమిటోనంట
పరమ పురమే వదలి పావనుండు యేసు
నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట
ఇమ్మానుయేలుగా - నెమ్మది నీయగా
కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి
గొల్లలేమో వార్త విని గొర్రెలనే వదలి
మెల్లగా అందారికి చాటి చెప్పిరంట
దావీదాు పురములో - లోకరక్షకుడుగా
యేసయ్య జనియించిన సంబరమే కనరండి
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట
రెక్కలు చాచి - చక్కనైన దూతలు
మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages