Randaho vinarandaho shubha vartha okati రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం

రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2).. రండహో
అలనాడు బెత్లేహేము పశుల పాకలోకన్నియ మరియకు శిశువు పుట్టెను (2)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2) ॥రండహో॥
ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2)
అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్ (2)
సంభ్రాలతో యిక శృతి కలపండి ॥రండహో॥
నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండిపరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2)
యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2)
సంభ్రాలతో యిక శృతికలపండి ॥రండహో||  

Yesu janminchera thammuda యేసే జన్మించేరా తమ్ముడా

యేసే జన్మించేరా తమ్ముడా...
దేవుడవతరించేరా తమ్ముడా...
ఓరోరి తమ్ముడా... ఓరోరి తమ్ముడా...
పెద్ద పెద్ద రాజులంతా - నిద్దురాలు బోవంగా
అర్ధరాత్రి వేల మనకు - ముద్దుగా జన్మించినయ్యా
బెత్లెహేము గ్రామమందు - బీదకన్య గర్భమందు
నాధుడు జన్మించినయా - వెలుగు మన కందరికి
కన్య రాశి మరియమ్మ - జోల పాటలు పాడంగా
గగనాల ధూతలంతా - గానాలు పాడంగా

Yesu rakshaka shathakoti sthothram యేసు రక్షకా శతకోటి స్తోత్రం

యేసు రక్షకా శతకోటి స్తోత్రం  “2”
జీవనదాత శతకోటి స్తోత్రం “2”
భజియించి పూజించి ఆరాదించేదము “4”
శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు “2”
నన్ను రక్షింప  నరరూపమేత్తడు  “2”
ఆ సిల్వ మోసి నన్ను స్వర్గలోక మెక్కించాడు “2”
చల్లని దేవుడు నా చక్కాని యేసుడు “2”
పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు “2”
యెన్నటికిని యెడబాయనన్నాడు “2”
తన ప్రేమ చూప నాకు నేలదిగినాడు “2”
నా సేదదీర్చి నన్ను జీవింపచేసాడు

Yesu puttenu pashuvula salalo adhiye santhasa యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్

యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్
క్రీస్తు ఉదయించే నా హృదయంలో – ఇదియే నిజమైన క్రిస్మస్ /2/
Happy Happy Christmas – Merry Merry Christmas
Merry Merry Christmas – Happy Happy Christmas /2/
1.ఆనాడు జ్ఞానులు యేసుని చెర బయలుదేరిరి యెరూషలేము /2/
సోంత జ్ఞానముతో ప్రభునిచూడ – కానరాలేదు ఆయన జాడ /2/
త్రోవ చూపెను ఒక నక్షత్రము – బేత్లెహేముకు – యేసు చెంతకు /2/
Happy Happy Christmas – Merry Merry Christmas
Merry Merry Christmas – Happy Happy Christmas /2/
2.రాత్రివేళలో గొర్రెల కాపరులు – మందను కాయుచు వేచియుండగా /2/
దేవదూత ప్రత్యక్షమాయెను – వర్తమానము తెలియచేసెను /2/
సంతసించిరి ఆ కాపరులు – ప్రభునిగాంచి స్తోత్రము చేసిరి /2/
Happy Happy Christmas – Merry Merry Christmas
Merry Merry Christmas – Happy Happy Christmas /2/
3.ఈనాడు నీవు హృదయము తెరచి – ఆహ్వానించుము యేసు రాజును /2/
ఆయనే నీకు రక్షకుండు – మోక్షదాత సత్యదేవుడు /2/
ఆనందించుము ఆ యేసునిలో – అనుదినమ్ ఒక పర్వదినము /2/
Happy Happy Christmas – Merry Merry Christmas
Merry Merry Christmas – Happy Happy Christmas /2/యేసు పుట్టెను /

Rakshakudu nedu puttadu puttadu chudu mana రక్షకుడు నేడు పుట్టాడు పుట్టాడు చూడు మన కోసం

రక్షకుడు నేడు పుట్టాడు పుట్టాడు చూడు మన కోసం భువికొచ్చెనే-
బెత్లెహేము ఊరు గొప్పపేరు ధరణంత పులకించేనే
అందరూ మెచ్చేవాడు మహిమాలు చేసేవాడు మా తోడు ఉన్నావాడు యేసే -2
యేసయ్యా కే మహిమనిచ్చి పాడేదాందరం ఉత్సాహించి -,2 ( రక్షకుడు)
ఆకాశం సృష్టించిన వాడు పశువుల పాకలో పుట్టాడు -2
నీకోసమే ఈ త్యాగము నువ్వు నమ్మితే మహాభాగ్యము -2
యేసు  ప్రేమ యేసు ప్రేమ నీకు ఉండగా  లోకమంతా ఎందుకయ్యా ఇక దండగా
సృష్టినే శాసించేవాడు సిలువలో బలి అయినాడు - 2
నీకోసమే ఈ త్యాగము నువ్వు నమ్మితే మహాభాగ్యము -2
యేసు  ప్రేమ యేసు ప్రేమ నీకు ఉండగా (రక్షకుడు)

O neethi suryuda kreesthesu nadhuda nee dhivya ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా నీ దివ్య కాంతిని

పల్లవి: ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని – నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా /ఓ నీతి/
1. నేనే లోకానికి – వెలుగై యున్నానని 
మీరు లోకానికి – వెలుగై యుండాలని 
ఆదేశమిచ్చినావుగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా /ఓ నీతి/
2. నా జీవితమునే – తూకంబు వేసిన 
నీ నీతి త్రాసులో – సరితూగ బోనని 
నే నెరిగియింటిగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా/ఓ నీతి/

Rajulaku rajaina yi mana prabhuni puja రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి

Song no: 181

రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు||

కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును ||రాజులకు||

నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||

అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి ||రాజులకు||

కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||

ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు||

శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని ||రాజులకు||
త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు||