O neethi suryuda kreesthesu nadhuda nee dhivya ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా నీ దివ్య కాంతిని

పల్లవి: ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని – నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా /ఓ నీతి/
1. నేనే లోకానికి – వెలుగై యున్నానని 
మీరు లోకానికి – వెలుగై యుండాలని 
ఆదేశమిచ్చినావుగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా /ఓ నీతి/
2. నా జీవితమునే – తూకంబు వేసిన 
నీ నీతి త్రాసులో – సరితూగ బోనని 
నే నెరిగియింటిగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా/ఓ నీతి/

Rajulaku rajaina yi mana prabhuni puja రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి

Song no: 181

రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు||

కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును ||రాజులకు||

నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||

అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి ||రాజులకు||

కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||

ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు||

శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని ||రాజులకు||
త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు||

Rajulaku raju puttenannayya రాజులకు రాజు పుట్టెనన్నయ్య

    రాజులకు రాజు పుట్టేనయ్య (2)
    రారే చూడా మనమెల్లుదామన్నయ్య (2)

  1. యూదాయనే దేశమందన్నయ్య (2)
    యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య (2)

  2. పశువుల పాకలోనన్నయ్య (2)
    శిశువు పుట్టే చూడ రండన్నయ్య (2)

  3. తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
    తరలీనరే బేత్లెహేమన్నయ్య (2)

  4. బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
    బాగుగాను యేసు కిచ్చిరన్నయ్య (2)

  5. ఆడుదము పాడుదామన్నయ్య (2)
    వేడుకలో మనం వేడుదామన్నయ్య (2)



    1. Rajulaku Raju Puttenayya (2)
      Raare Chuda Manamelluda Mannayya (2)
      Yudayane Deshamandannaya (2)
      Yudulaku Goppa Raaju Puttenayya (2)

    2. Pashuvula Paakalonannayya (2)
      Shishuvu Putte Chuda Randannayya (2)

    3. Taaran Juchi Turpu Gnanulannayya (2)
      Taralinare Bethlehemannayya (2)

    4. Bangaramu Sambranu Bolamannayya (2)
      Baaguganu Yesu Kichirannayya (2)

    5. Aadudamu Paadudamannayya (2)
      Vedukalo Manam Vedudhamannayya (2)

Rajula raju paramunuveedi pudamini dharshinchenu రాజులరాజు పరమునువీడి పుడమిని దర్శించెను

రాజులరాజు పరమునువీడి పుడమిని దర్శించెను
పావనలోక దీవెనలన్నీ ధరణిపై వర్షించెను
అ.ప. : మనము కూడి కొనియాడి ఆరాధించుదాం
పాటపాడి యేసయ్యను పూజించుదాం
చీకటిఛాయలు దూరంచేసి వెలుగులు చూపించను
కోటి సూర్యులతేజం కలిగియున్న దైవం
ప్రేమరూపిగ ఉదయించెను
నాశనపాత్రుల శాపంబాపి విడుదల ప్రకటించను
లోక రక్షణకార్యం చేయబూనిన దైవం
గొర్రెపిల్లగ ప్రభవించెను
బాధిత జనులకు నాయంతిర్చి నవ్వులు పూయించను
కాడి తేలికచేసి బరువు దించే దైవం
మానవునిగా జనియించెను

Raaraju janminchinadu ee avanilo aa nadu రారాజు జన్మించినాడుఈ అవనిలోన ఆ నాడు

రారాజు జన్మించినాడుఈ అవనిలోన ఆ నాడు నీ హృదిలో జన్మించుతాడు
స్థిరపరచుకో నీ మదిని నేడు (2)
యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకోయేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో (2)     ॥రారాజు॥
ఇదిగో నేను తలుపునొద్దనిలుచుండి తట్టుచున్నాను
ఎవడైనను నా స్వరమును వినితీసినయెడల వచ్చెదను (2)
అని నిన్ను పిలుచుచున్నాడుత్వరగా తలుపును తెరచి చూడుచేజార్చకీ
అవకాశము నేడురాదీ సమయము ఇంకేనాడు (2)     ॥యేసే దైవం॥
నేనే మార్గం నేనే సత్యంనేనే జీవం అని అన్నాడు
నా ద్వారా తప్ప తండ్రి కడకుచేరే మార్గం లేదన్నాడు (2)
ఈ మాటను పరికించి చూడుయోచించుము
నిజమేదో నేడుత్వరలో ప్రభు రానైయున్నాడుఆ లోపే యేసయ్యను వేడు (2)   ॥యేసే దైవం॥

Rarandi yesayya janminche rarandi yesayya రారండి యేసయ్యా జన్మించే రారండి యేసయ్యా చూదాము

రారండి యేసయ్యా జన్మించే
రారండి యేసయ్యా చూదాము(2)
యుదయా దేశములో
యేసయ్యా జన్మించే
బెత్లహేము గ్రామములో
యేసయ్యా జన్మించే
యుదయా దేశములో
బెత్లహేము గ్రామములో
యేసయ్యా జన్మించే యేసయ్యా జన్మించే చీకటిని తోలగించే (రారండి)
దావీదు వంశమున్నా
యేసయ్యా జన్మించే
కన్య మరియా గర్భామున
యేసయ్యా జన్మించే
దావీదు వంశమున్నా
కన్య మరియా గర్భామున
యేసయ్యా జన్మించే యేసయ్యా జన్మించే సమధనమునునిచే (రారండి)
గొర్రేలా కాపరులు
యేసయ్యాను దర్శించే
తూర్పు దేశపు జ్ఞానులు
యేసయ్యాను దర్శించే
గొర్రేలా కాపరులు
తూర్పు దేశపు జ్ఞానులు
యేసయ్యా దర్శించే యేసయ్యా దర్శించే కానుకలు అర్పించే (రారండి)

Rathri nedu rakshakundu velise vinthaga రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)

లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను (2)
ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||

బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ (3) ||రాత్రి||

ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి||

పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా (3) ||రాత్రి||

లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||