Yesayya ninu chudalani yesayya ninu cheralani యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం

Chalina devudavu yesu Chalina devuda neevu చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు
వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో
ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే
1. అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను
చేనులోని పైరు పండకపోయినను
శాలలోని పశువులు లేక పోయినను
2. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన
లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన
సత్యము పలుకుటచే నష్టము కలిగినను
3. దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యా
శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే
ననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే

Chudalani undhi yesuni cheralani vundhi చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది

చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2)
1.పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె
పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే
మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది
2. నాలో విచేవి పరిమళాల వనమంతా
యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా
ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

Na nayakuda, na poshakuda neke aaradhana

Na nayakuda, na poshakuda neke aaradhana..
Na aasraya sthanam na rakshana kedem neke aalapana ( na nayakuda)
Ne krupanu ne padagaa, vey nollu chalavuga.. "2"

Aaradhanaaa... Aaradhana... Neke aalapana "2" (na nayakuda)

1. Thalli garbhamulone... Nanu roopinchina na silpivi...
Pindamunai undagane... Nannu chuchina na thandrivi "2"
Naku peru petti pilachina vada, neke aaradhana "2"
Aaradhana... Aaradhana... Neke aalapana ... "2" ( na nayakuda)

2. Aasha gala pranamunu.. Thrupti parachina na daivama
Aakalitho unna nannu... Melukolpina na jeevama.. "2"
Nenu korina revuku nadipina vada, neeke aalapana "2"
Aaradhana... Aaradhana... Neke aalapana... "2" (na nayakuda)

3. Raajuvaina devaa.. Ninnu ghanaparachedanu
Needu aascharya karyalanu... Nenu dhyaninchedanu "2"
Ne rajya prabhavamu showryamu gurchi... Nenu padedhanu "2"
Aaradhana... Aaradhana... Neke aalapana... "2" ( na nayakuda)

Parishuddhuda paramathmuda dhaveedhu chiguraina yesu పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన యేసు

పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన యేసు నామధేయుడా
అ.ప: ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు
మహిమయు నీకే ప్రభూ
1.పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన
ఓ దివ్యతేజుడాసుర్యకాంత పద్మరాగములపోలియున్నవాడా గ్రంధమును విప్పగలిగిన సర్వసమర్ధుడా
2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మునుకొన్న ఓ జయశీలుడా రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా
మరణించి తిరిగి లేచిన గొప్ప బలాడ్యుడా
3. భుతవర్తమాన భవిష్యత్ కాలమున జీవించుచున్న
ఓ ప్రేమధారుడాసృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా జీవకోటిపూజలందుకొనుసత్యస్వరూపుడా

Preminche varu lerani vedhinche varandharini ప్రేమించె వారు లేరని వేదించే వారందరని

ప్రేమించె వారు లేరని వేదించేవారందరని "2“
వేదన చెందుచున్నావా - ఆవేదన చెందుచున్నావా "2"  "ప్రేమించెవారు "
1.వ్యాధి బాధలందు నీవు - వేదనలోనుంటివా  
స్వస్థపరచు యెహోవానే - నీవెరుగకుంటివా  
శూన్యము నుండి సమస్తము చేసిన దేవుడు  
నీ వ్యాధి బాధలను తీర్చుటకు ఆయన సమర్ధుడు  
ఆ యేసునే నమ్ముకో ఆవేదన తీర్చుకో "2 "
2. లోకమంత ఏకమై నిన్ను ద్వేషించిన  
ప్రేమించే యేసునే నీవెరుగకుంటివా  
మరణము నుండి జీవముకు పిలిచిన దేవుడు  
ఈ లోకము నుండి వేరు చేయును ప్రేమించిన యేసుడు  
ఆ యేసునే నమ్ముకో ఆవేదన తీర్చుకో "2"

Pamppumu deva dhivenalatho Pamppumu deva పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా

పంపుము దేవా  దీవెనలతో - పంపుము దేవా
   పంపుము దయచేత - పతిత పావన నామ
   పెంపుగ నీ సేవ - బ్రియ మొప్ప నొనరింప
    పంపుము దేవా  దీవెనలతో - పంపుము దేవా
1. మా సేవనుండిన - మా వెల్తులన్నియు
    యేసుని కొరకు నీ వెసగ క్షమియించును
2. వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి
    దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప
3. ఆసక్తితో నిన్ననిశము సేవింప
    భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి