E lokamlo yevvaru chupani kaluvari siluva prema iedhi ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది

ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది - కాలాలే మారినా మారని ప్రేమ ఇది " 2 "
ప్రేమా యేసునిప్రేమా - ప్రేమా కలువరి ప్రేమా
నను విడువని ప్రేమ - నను మరువని ప్రేమ "2" "ఈ లోకంలో"
1. శోకించు వేళ  విలపించు వేళా - యేసు నను చూచేనే - నా - భారము తొలగించెనే "2"
నీవెంటే నేనున్నా కన్నీరెందుకని - నీ చెంతే నేనుంటా దిగులే చెందకని
మనుష్యుల ప్రేమ ఆశించిన కన్నీరే మిగులునని
పలికిన నా యేసయ్య నీకే స్తోత్రమయా "2" "ఈలోకంలో"
2. శపియించబడి నేను కృశియించు వేళా తోడు నీవైతివే - నా - నీడ నీవైతివే "2"
నే నిన్ను విడచిన నన్ను విడువక వెంబడించినావే - నే నిన్ను మరచిన  నన్ను మరువక పలకరించినావే
గమ్యం లేని పయనంలో ప్రభుయేసే గమ్యమని
తెలుసుకొంటినయ్య నను మలచుకొంటినయ్యా "2"
                       "ఈ లోకంలో"

Chudali ninne nenu yesayya cherali ninne mesayya చూడాలి నిన్నె నేను యేసయ్యా చేరాలి నిన్నె నేను మేస్సయ్యా


Song no:

చూడాలి నిన్నె నేను యేసయ్యా
చేరాలి నిన్నె నేను మేస్సయ్యా
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి

నీ పాదములు చేరినా వెంటనే
దొరికెను క్షమాపణ సంతోషమీ

నిను చూచిన వారికందరికి
విడుదల స్వస్ధత కలిగెను

పరలోక స్వాస్ధ్యముకై పరుగెత్తగా
ఇహలోక ఆశలు జయించగను 

Naa snehithuda ninnu vidichi nenundalenu నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను


Song no:

నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను
నా యేసయ్య నిన్ను మరచి నే బ్రతులేను
ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా? "2"            "నా స్నేహితుడా"

1 తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా
   ఎవరు లేకపోయినా నే బ్రతుకగలను "2"
   నీవు లేకపోతే క్షణమైనకూడా "2"
   బ్రతుకలేను స్నేహితుడా "2"                           "నా స్నేహితుడా"

2 ఆస్థి లేకపోయినా పస్తులెన్ని ఉన్ననూ
   ఏమి లేకపోయినా నే బ్రతుకగలను "2"
   నీవు లేకపోతే క్షణమైనకూడా "2"
   బ్రతుకలేను స్నేహితుడా "2"                           "నా స్నేహితుడా"

3 నా శ్వాస నేను కోల్పోయిన సమయాన
   నీ శ్వాసనిచ్చి నను బ్రతికించావు "2"
   మరణమైన వేళ మరలా బ్రతికించి "2"
   నీ శ్వాసనిచ్చావు "2"






Cherithi prabhuva nee sannidhi nee sannidhi pujalu cheyaga చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా


Song no:

చేరితి ప్రభువా నీ సన్నిధి

సాకి:           సర్వ సృష్టి స్థితిలయ కారకా - శ్రీ (యెహోవా) ప్రభువైన దేవా
కన్య మరియ గర్భాన వెలసిన  - శ్రీ యేసునాధా...
పిత సుతులకు అనుబంధమా - పవిత్రాత్మా నమస్తే.... నమస్తే...నమహః...

పల్లవి:  చేరితి ప్రభువా నీ సన్నిధి
           పూజలు చేయగా నా పెన్నిధి
           పాడి స్తుతింతును నీ దివ్య నామం
           వరములు చిందే ఈ దివ్యబలిలో

1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో
    వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా ||చేరితి||


2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం
   నూతన బలమును ఒసగుము దేవా

   కనురెప్పల మము కాయుము ప్రభువా              ||చేరితి||

Srusti kartha yesu deva sarvya lokam ni mata vinunu సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును


Song no:

సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును
సర్వ లోక నాధ సకలం నీవేగా
సర్వలోక రాజ సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము. . . .
1. కానాన్ వివాహములో అద్భుతముగానీటిని ద్రాక్ష రసము చేసి
కన లేని అంధులకు చుపునొసగిచెవిటి మూగల బాగుపరచితివి
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలోఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు

2. మృతుల సహితము జీవింపచేసిమృతిని గెలచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నివసింపకొనిపొవా త్వరలో రానుంటినే
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలోఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు.

Siluvanu mosthu saguthamviplava jyalanu ragilistham సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం


Song no:

సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం (2)
యేసే మా ఊపిరని చాటుతాం భువినే దివిగా మార్చేస్తాం (2)
క్రీస్తు సైనికులం మేమువెలుగే చిరుదివ్వెలం మేము
సత్యాన్వేషకులం మేము నీతికి దాసులము మేము
1. సత్యం కోసం పోరాడుతాం క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2)
శ్రమ ఎదురైనా సహిస్తాం క్రీస్తుని పోలి నడుస్తాం (2)

2. ప్రజల కన్నీరు తుడుస్తాం మరణం వచ్చిన వెనుదిరుగం (2)
పరిశుద్ధతతో జీవిస్తాం యేసు ప్రేమను చూపిస్తాం (2)

Sagedha nenu yesunilo sramayaina karuvaina సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా


Song no:

సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . .
1.తన రూపములో నను చేసికొని
తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన
2. తన రాజ్యములో నను చేర్చుకొని

పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన