Sakshya micchedha mana swamy yesu devudancchu saksha micchedha సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెద


Song no:


సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెద
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు  సాక్ష్య

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించిమక్కువతో
నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో     సాక్ష్య

1.పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదుపిల్లలకును
బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము    సాక్ష్య

2.బోధ చేయలేను వాద ములకు బోను నాక దేలనాధు
డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు   సాక్ష్య

3.పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచుబాపముల
క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచుసాక్ష్య

4.చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైనఘోరపాపు లైన
క్రీస్తు కూర్మితో రక్షించు నంచు   సాక్ష్య

5.పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచుసాక్ష్య

6.ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేకతల్లడిల్లు
వారలకును తండ్రి కుమా రాత్మ పేర సాక్ష్య

Sagilapadi mrokkedhamu sathyamutho athmalo mana prabhu yesuni సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని


Song no:

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని ఆఆ 2||      సాగిలపడి
1.మోషేకంటే శ్రేష్టుడుఅన్ని మోసములనుండి విడిపించున్ 2
వేషధారులన్ ద్వేషించున్ఆశతో మ్రొక్కెదము2||  సాగిలపడి
2.అహరోనుకంటే శ్రేష్టుడుమన ఆరాధనకు పాత్రుండు 2ఆయనే ప్రధాన యాజకుడుఅందరము మ్రొక్కెదము 2సాగిలపడి
3.ఆలయముకన్న శ్రేష్టుడునిజ ఆలయముగా తానే యుండెన్ 2ఆలయము మీరే అనెనుఎల్లకాలము మ్రొక్కెదము2సాగిలపడి

4.యోనా కంటె శ్రేష్టుడుప్రాణ దానముగా తన్ను అర్పించెన్మానవులను విమోచించెన్ఘనపరచి మ్రొక్కెదము 2||    సాగిలపడి

Srusti karthavaina yehova nee chethi paniyaina napai సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన

Song no: 170

    సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
    మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....
    నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు....
    నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ || సృష్టికర్తవైన ||

  1. ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో
    ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!!
    యేసయ్యా నను అనాధగ విడువక
    నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! || సృష్టికర్తవైన ||

  2. నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
    నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!!
    యేసయ్యా నను కృపతో బలపరచి
    ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! || సృష్టికర్తవైన ||

Sahasakaryalu cheyagalige devuni hasthamu chachabadi yunnadhi సహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి యున్నది


Song no:

సహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి యున్నది - సాయపడుచున్నది సాధ్యము చేయుచున్నది .: చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది నీతిగల యెహోవ హస్తము 
1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెనుమట్టితోనే మనిషిని రూపించెను రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము 

2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును విసర్జించువారిని శిక్షించును బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము 

Siluvayamdhey needhu prema thelisikontino prebhu సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు


Song no:

సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2)
1. నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి .. సిలువయందె..

2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం .. సిలువయందె..

Samarpana cheyumu prabhuvunakuni dhehamu dhanamu samayamunu సమర్పణ చేయుము ప్రభువునకునీ దేహము ధనము సమయమును


Song no:

సమర్పణ చేయుము ప్రభువునకునీ దేహము ధనము సమయమును (2)
1.అబ్రామును అడిగెను ప్రభువప్పుడుఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా    సమర్పణ

2.ప్రభుని ప్రేమించిన పేదరాలుకాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా    సమర్పణ


3.నీ దేహము దేవుని ఆలయమునీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా    సమర్పణ

Samardhavanthudaina naa yesayya samasthamu neeku sadhyamenayya సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా


Song no:

సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)
నా స్తుతి యాగము నీకేనా ప్రాణార్పణ నీకేనా సర్వస్వము నీకేనా జీవన గానము నీకే     సమర్ధ
1.పచ్చిక పట్టులలో నన్ను పదిలముగాఉంచువాడవు నీవే యేసయ్యాఆత్మ జలములను నవ్యముగాఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2)
దూతల చేతులలోనన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2)
నీ సమర్ధ
2.శత్రువు చరలోనుండి నను భద్రముగానిల్పువాడవు నీవే యేసయ్యారక్షణ వస్త్రమును నిత్యము నాపైకప్పువాడవు నీవే యేసయ్యా (2)
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2)

రక్తపు బిందువుతోనన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ     సమర్ధ