Aagipodhu naa pata gamyam cheredhaka saguthundhi ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక


Song no:


ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక
సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక

లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను
అలసటతో జోగినా శృతి తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును

నా అడుగు జారినా కలవరము చెందను
నా బలము పోయినా లయ తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును

శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును

Aradhana aradhana stuthi aradhana arsdhana ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన


Song no:


ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన
సత్యవంతుడా ఆరాధన - నిత్యుడగు దేవుడా ఆరాధన
యెహోవాయీరే ఆరాధన చూచుకొను దేవుడా ఆరాధనా
యెహోవా రాఫా ఆరాధన - స్వస్థపరచు దేవుడా ఆరాధనా
యెహోవా షాలేం ఆరాధన - శాంతినిచ్చు దేవుడా ఆరాధనా
యెహోవా నిస్సీ ఆరాధన - జయమునిచ్చు దేవుడా ఆరాధనా

A rathri meda gadilo yesu prabhu - ఆరాత్రి మేడ గదిలో యేసు ప్రభు ఆసీనుడాయె ప్రియమౌ సిలువ నీడలో


Song no:


ఆరాత్రి మేడ గదిలో యేసు ప్రభు ఆసీనుడాయె ప్రియమౌ సిలువ నీడలో
ఆ సిలువ పొందగోరీ సిలువ విందు నియమించే”2” ఆరాత్రి 

బడిన ఇది మీకొరకు నా శరీరంచిందబడిన ఇది మీకొరకు నా రుధిరంనిరతంబు స్వీకరించు నా జ్ఞాపకార్ధంనారాక నీవు మరువకనే కనిపెట్టుమా      ఆరాత్రి॥

గాయపడిన ఇది మీకొరకు సిలువ గేయంసాయపడిన ఇది మీకొరకు సిలువ రాగంపరలోకమందు పాడే ఈ పరమ గీతంఇహమందు స్వీకరించు కృపా విందుగా      ఆరాత్రి॥

aaradhana sthuthi aaradhana nivanti vadu okkadunu ledu ఆరాధన స్తుతి ఆరాధన నీవంటివాడు ఒక్కడును లేడు


Song no:


ఆరాధన స్తుతి ఆరాధన "3"
నీవంటివాడు ఒక్కడును లేడు నీవే అతి శ్రేష్ఠుడా దూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్ధుడా నిన్నా....నేడు....మారని....
ఆరాధన స్తుతి ఆరాధన....... “3"

అఁబహము ఇస్సాకును బలియచ్చిన ఆరాధనఁతోయబడి లోయలో చేసిన  యోసేపు ఆరాధన "2" ఆరాధన స్తుతి ఆరాధన  "2"
పదువేలలోన అతిసుందరుడా నీకే ఆరాధన ఇహ పరములలో ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా...నేడు...మారని... “ఆరాధన స్తుతి”

దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన 2” “ఆరాధన స్తుతి”

Aradhaniyuda naa chalina devuda diva rathrulu ఆరాధనీయుడా నా చాలిన దేవుడా


Song no:


ఆరాధనీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులుకీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా(2)
నాస్తుతి గీతము నీకే ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ
,యుగములు నీకే మహిమ(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

Sarvanga sundhara sadhguna sekara yesayya ninnu siyonulo chuchedha సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా

Song no: 78

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
    యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
    పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

  1. నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
    నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా || సర్వాంగ ||

  2. నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
    నా నిందలన్నిటిలో యెహోషపాతువై
    నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ ||

  3. నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
    నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
    నా జయ ధ్వజమైతివా || సర్వాంగ ||

Sarvonnathuda neeve naku asraya dhurgamu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

Song no: 18
    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

  1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥

  2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥

  3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥