Aradhaniyuda naa chalina devuda diva rathrulu ఆరాధనీయుడా నా చాలిన దేవుడా


Song no:


ఆరాధనీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులుకీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా(2)
నాస్తుతి గీతము నీకే ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ
,యుగములు నీకే మహిమ(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

Sarvanga sundhara sadhguna sekara yesayya ninnu siyonulo chuchedha సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా

Song no: 78

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
    యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
    పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

  1. నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
    నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా || సర్వాంగ ||

  2. నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
    నా నిందలన్నిటిలో యెహోషపాతువై
    నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ ||

  3. నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
    నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
    నా జయ ధ్వజమైతివా || సర్వాంగ ||

Sarvonnathuda neeve naku asraya dhurgamu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

Song no: 18
    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

  1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥

  2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥

  3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

Saathosham naku santhosham yesu nalo vunte santhosham సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం


Song no:

సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం     సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం     హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 
1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...    నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన    యేసంటే నాకు సంతోషం     - 2   ||హల్లేలూయా 
2.  ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా...     నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన    యేసంటే నాకు సంతోషం   - 2 ||హల్లేలూయా

Sri yesu geethi padava a silva prema chatava శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా


Song no:

పల్లవి:     శ్రీ యేసు గీతి పాడవా -   సిల్వ  ప్రేమ  చాటవా (2)
జనులెందరో - నశించు చుండగా    (2)
సువార్త  చాట కుందువా - నాకేమిలే అందువా(2)
1.ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2)..సువార్త..
2. ప్రతి వారికిప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా

పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా   (2)  ..సువార్త..

Shubha vela sthothra bali thandri deva nikenayya శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా


Song no:

శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా-తండ్రి దేవా నీకేనయ్యా (2)
1. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ (2)
2. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా ఎల్ రోయి ఎల్ రోయి (2)
3  .యెహోవ షమ్మా మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా యెహోవ షమ్మా (2)
4.  యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా (2)

శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ (2)

Sakthigala parishuddhathma nalona vacchinandhuna శక్తిగల పరిశుద్ధాత్మనాలోనవచ్చినందున


Song no:

శక్తిగల పరిశుద్ధాత్మనాలోనవచ్చినందున
దుష్టసాతానుని ఒక్కమాటతో పారద్రోలెదన్

1.పవర్ఆత్మనాలోన పిరికిఆత్మ, సమీపించదు
ప్రేమఆత్మ, నాలోన తొలగించచేదులన్నిటిన్ - నే

2.క్రమపరచుపరిశుద్దాత్మనన్నుకంట్రోలుచేసినడిపించను
ఇష్టమువలెతిరుగనునేనుతనచిత్తముచేసిజీవించెదను

3.క్రీస్తులోసువాసననేనువీధివీధివెదజల్లెదను
రక్షింపబడువారికిమేముజీవమిచ్చుసుగంధమైతిమి

4.లోకమునకువెలుగునునేనుఊరంతావెలుగిచ్చెదన్
ఉప్పువలెమారెదనుఎల్లప్పుడురుచినిచ్చెదన్

5.దేవునిద్వారాజన్మించానుఏపాపముచేయనునేను

ప్రభువేకాపాడుచున్నాడుదుష్టుడుఎన్నడుముట్టడునన్ను.