Yesu swamy neeku nenu naa samastha mitthunu యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును

Song no: 455

యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును ||నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీ కిత్తు నా సమస్తము||

యేసుసామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే.

నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము.

నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి నీదు ప్రేమశక్తి నింపు నీదుదీవె నియ్యవే.

యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము.

Sarva chitthambbu nidhenayya swarupamicchu kummarive సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే

Song no: 451

సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న మాంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||

ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకున్న పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ||

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ చేతబట్టినన్ రక్షింపుమా ||సర్వ||

ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ||

Ghanudavu nivayya niku sati yevarayya prabhudavu nivayya ఘనుడవు నీవయ్య – నీకు సాటి ఎవరయ్యా


Song no:

ఘనుడవు నీవయ్యనీకు సాటి ఎవరయ్యా 
ప్రభుడవు నీవయ్యాసర్వ స్రుస్టికి యేసయ్యా 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

1,ఎర్ర సముద్రమును రె౦డు పాయలు చేసావు 
బ౦డలో ను౦డి జీవ జలములు నిచ్చావు 
గాలిలో ను౦డి పూరేళ్ళూనిచ్చావు 
ఆకాశములో ను౦డి మన్నాను నిచ్చావు.

2,కానా వి౦దులో నీరును - ద్రాక్షరసముగా మార్చావు 
కుళ్ళిన లాజరును తిరిగి జీవి౦పజేసావు 
పాపిని నాకొరకై పాప భార౦ మోసావు 
నీ హస్తములోనే నన్ను దాచుకున్నావు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

ఘనుడవు నీవయ్యనీకు సాటి ఎవరయ్యా 
ప్రభుడవు నీవయ్యాసర్వ స్రుస్టికి యేసయ్యా

Neetho nenu nadavalani nitho salisi vundalani aashayya నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా


Song no:

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)        ||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||



Aashayyaa.. Chinna Aashayyaa
O Yesayyaa.. Neeve Theerchaalayyaa

Neetho Nenu Naduvaalani
Neetho Kalisi Undaalani (2)
Aashayyaa Chinna Aashayyaa
O Yesayyaa.. Neeve Theerchaalayyaa (2)       ||Neetho||

Naduvaleka Nenu Ee Loka Yaathralo
Bahu Balaheenudanaithinayyaa (2)
Naa Cheyi Patti Neetho Nannu
Nadipinchumayyaa Naa Yesayyaa (2)
Neetho Naduvaalani – Neetho Undaalani
Chinna Aashayyaa.. O Yesayaa           ||Aashayyaa||

Soulunu Poulugaa
Maarchina Naa Goppa Devudaa (2)
Neelo Premaa Naalo Nimpi
Neelaa Nannu Neevu Maarchumayyaa (2)
Neelaa Undaalani – Neetho Undaalani
Chinna Aashayyaa.. O Yesayaa          ||Aashayyaa||

Adhigo kalvari siluvalo yesayya vreladuchunnadu అదిగో కల్వరి సిలువలో యేసయ్య వ్రేలాడుచున్నాడు


Song no:

అదిగో కల్వరి సిలువలో
యేసయ్య వ్రేలాడుచున్నాడు  " 2 "  అదిగో

మన దోషము యేసుకు గాయములు
మన పాపము యేసుకు రక్తము     " 2 "
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "

మన నడకలు యేసుకు కాళ్లకు శీలలు
మన చేతలు యేసుకు చేతుల్లో మేకులు"2"
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "

మన తలంపులు యేసుకు ముళ్ళ కిరీటము
మన మాటలు యేసుకు బల్లెపు పోటు " 2 "
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "

Priya yesu mana koraku prematho pondhina sramalu ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు


Song no:

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||
కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||
ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||
పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||
పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||


Priya Yesu Mana Koraku
Prematho Pondina Shramalu
Kaanchaga Kalvari Drushyam
Kaarenu Kallalo Rudhiram (2)    ||Priya Yesu||

Kalvari Kondapaina
Dongala Madhyalona
Silvalona Vrelaadenu
Naakai Yesu Maraninchenu (2)    ||Priya Yesu||

Mundlatho Allina Makutam
Jallaatamuna Pettagaa
Sravinche Parishuddha Raktham
Dravinche Naa Hrudayam (2)    ||Priya Yesu||

Paapaandhakaaramulo
Payaninchu Manujulanu
Paavanulugaa Cheyutaku
Paavanudesu Maraninchenu (2)    ||Priya Yesu||

Paapinaina Naa Koraku
Preminchi Praanamichchenu
Silvalo Vrelaadenu
Neekai Praanamunichchenu (2)    ||Priya Yesu||




Yevari kosamo e prana thyagamu nikosame ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము నీకోసమే

Song no:

    ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము – 2
    నీకోసమే నాకోసమే కలువరి పయనంఈ కలువరి పయనం ....."ఎవరికోసమో"

  1. ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందాఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా - (2)
     మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతోతడబడుతూ పోయావా... - సోలి వాలి పోయావా...."ఎవరికోసమో"

  2. జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాముజీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాముమా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగానీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి*తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరినిక్షమించు *అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని "ఎవరికోసమో"