• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు

పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు 
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు 
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా 
ఆరాధన నీకే నా యేసయ్య -2

నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి 
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివ

నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసులా కాంక్షను సంపూర్ణ పరచెదవు 
Share:

Siramu mida mulla sakshiga karchina kannila sakshiga శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా        " 2 "
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా   " 2 "
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు    " 3 "
సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని         " 2 "
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం
తద్ రక్తం పరమాత్మేనాం
పుణ్యదాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
క్రీస్తులో........నే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ   " శిరము "

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని  " 2 "
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని
శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని
బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం
క్రీస్తులో.......నే నెరవేరెనుగా
*చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే
శీర్షే సప్త హస్తాసో !
అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి*
మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!!
బ్రహ్మణాలు పలికిన దేవోక్తి
యేసులో......నే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా
   
Share:

Samvastharamulu veluchundaga nithyamu nee krupatho సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా

సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య "2"
గడచిన కాలమంతా నీ
చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు " 2 "
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు " 2 "
                           "  నీకే వందనం  "
బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే  నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు " 2 "
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు " 2 "
                            "  నీకే వందనం  "
Share:

Tharatharamulu unnavadavu yugayugamulu yeluvadavu తరతరములు ఉన్నవాడవు యుగయుగములు ఏలువాడవు

తరతరములు ఉన్నవాడవు.............
యుగయుగములు ఏలువాడవు..... " 2 "
నీవే రాజువు నీవే దేవుడవు  " 2 "
జగాలను యేలే జయశీలుడవు నీవు
జనసైన్యములను నడిపే
విజయశీలుడవు నీవు     " 2 "
ఎన్ని తరాలు మారినా
ఎన్ని యుగాలు గడచినా  " 2 "
నీవే నీవే నీవే రారాజువు    "తరతరములు"
భూమికి నీవే పునాదులు వేసినవాడవు
నీరాజ్య స్థాపనకై ఈసృష్టినే కలుగజేశావు "2"
సృష్టికర్తవు నీవే శాంతిదాతవు నీవే " 2 "
నీవే నీవే నీవే మారాజువు *"తరతరములు"
            
Share:

Nuthana jeevithalu okatayye ee vela sandhaditho నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ సందడితో సంతోషాలతో

నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ
సందడితో సంతోషాలతో
మైమరచే ఈశుభవేళ       " 2 "
యేసయ్య దిగివచ్చేగా
దీవెనలు కురిపించగా
దీవించి ఆశీర్వదించి కలిపేను ఒక జంటగా
ఒకరికి ఒకరు అండగా ఉంటూ
ఆత్మీయ మేలులతో జీవితం కొనసాగుతూ "2"
దేవునికి దగ్గరగా లోకులకు దూరంగా " 2 "
దేవుని సన్నిధిలో కలకాలం ఉండాలిక " 2 "
                                "నూతన"
ఆశీర్వాదముతో అడుగులు వేస్తూ
దేవుని దీవెనలు నిత్యము పొందుతూ " 2 "
కష్టాలలో దేవుని మరువక                  " 2 "
బాధలలో తన చేయి విడువక            " 2 "
                                     "నూతన"
దేవుడు ఎన్నడూ మిమ్మును విడువడు
బుద్ధిని జ్ఞానమును సంపద మీకిచ్చును" 2 "
దేవుని యందు భయభక్తులు కలిగి       " 2 "
ఉండాలి మీరిక బ్రతకాలి జాగ్రత్తగా       " 2 "
                                      "నూతన"
Share:

Yesayya nijamaina devudani ninne nammi yunnanu యేసయ్య నిజమైన దేవుడవని నిన్నే నమ్మియున్నాను

యేసయ్య నిజమైన దేవుడవని
నిన్నే నమ్మియున్నాను
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాను    " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
రత్నాల వర్ణుడవని అతికాంక్షనీయుడవని
ఉంటావులే ప్రభువా
అపత్కాలములో నాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు భయమన్నదే లేదే
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు దిగులన్నదే రాదే
ఉంటావులే నాతో ఎన్నడూ              }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
ఆది అంతం నీవే దేవా       "  యేసయ్య  "
వస్తావులే ప్రభువా కష్ట కాలంలో నాఅండగా
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దారిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వస్తావులే ఈ లోకానికి      }
చేరుస్తావులే పరలోకానికి  } " 2 "
నాతల్లియు తండ్రియు నీవేదేవా "యేసయ్య"
       
Share:

Maranimchi lechithivi nannethagano preminchi nee మరణించి లేచితివి నన్నెంతో ప్రేమించి


Song no:

మరణించి లేచితివి
నన్నెంతో ప్రేమించి నీకృపలో దాచితివి "2"
సిలువలో మృతిపొంది....................

నా సజీవుడు నా యేసు
నన్ను వెదకు చుండెను.                   " 2 "
నా దోషములు కడిగెను
నన్ను పవిత్రునిగా మార్చెను.            " 2 "
హల్లెలూయా హల్లెలూయా*
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "

సమాధిలో లాజరును పిలిచే
మృతిలోనుండి                               " 2 "
జీవమిచ్చును లాజరుకు
ఆ జీవమే నికిచ్చచెను.                   " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "

నా రక్షకుడు నా యేసు
నన్ను ప్రేమించు చుండెను.             " 2 "
నా పాపముల్ క్షమియించును
తన రాజ్యములో చేర్చును          " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages