చేయపూనుకో ఈ క్షణమైనా
గుర్తించు బాధ్యత నేడైనా - సాధించు ఆత్మలు కొన్నైనా
రాయుని తొలగించకుంటే ఎలా
నీలో బలముండి కూడా మనసు లేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
ఆప్యాయత చూపకుంటే ఎలా
ఆదరణ వాక్యమైన పలకలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
జాలిని చుపించకుంటే ఎలా
చిన్నపాటి త్యాగమైనా చేయలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
భారం కలిగుండకుంటే ఎలా
సువార్తను కొందరికైనా పంచలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల











