1 సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||నిన్ను బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగ జేసిన బలుడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుడ వీవె అన్ని జీవుల నెఱిగి యాహార...