నీకిష్టమైనది కావాలి దేవునికి – బలి అర్పణ కోరలేదు దేవుడు /2/
ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో || నీకిష్టమైనది ||
కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి /2/
అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే || నీకిష్టమైనది ||
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా /2/
నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే || నీకిష్టమైనది ||
Neekistamainadhi kavali devuniki bhali arpana koraledu devudu
prabhu manasu telusuko vakyanni chaduvuko —Neekistamainadhi
1. Kayyeenu arpana techadu devuniki hebelu arpana nachindhi devuniki (2)
Arpinchu vatikante arpinchu manishi mukyam
Arpinchu vatikante arpinchu manasu mukyam
Nachali modhataneeve kavali modataneeve
Neekistamainadhi…..
2. Dehanni devuniki ivvali kanukaga Kreesthesu vale deham kavali yaghamugha (2)
Nee dhanamu dhanyamu kante voka papi marpu mukyam (2)
Prakatinchu kreestu korke maraninchu papi korake —Neekistamainadhi
సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా
సర్వ జనులకు దేవుడవు నీవే నయా || 2 ||
ఆదియు అంతము నీవే దేవా
ఆసాద్యమైనది నీకేమి లేదు || 2 ||
అ.పల్లవి : యెహోవా నిస్సీ నాజయము నీవే
యెహోవా షాలోం నా శాంతి నీవే || 2 ||
నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చి
అపాయ మేదియు రాదని చెప్పితివే || 2 ||
మహోన్నతుడా నీనీడలో నాకు
సుఖసంతోషములు పంచిన యేసయ్యా || 2 || యెహోవా ||
విడువక నాయెడ కృప చూపించి
నా మనవులన్నియు సఫలము చేసితివే || 2 ||
ఆశ్చర్యకరుడా! ఆత్మ సారధివై
విజయపదములో నడుపుచున్న యేసయ్యా || 2 || యెహోవా ||
నీ మహిమ నాపై ఉదయింప జేసి
రాజ మకుటముగా నను మలచితివే || 2 ||
నా ప్రాణ నాధుడా! నా చేయి విడువక
మహిమైశ్వర్యముతో దీవించిన యేసయ్యా || 2 || యెహోవా ||
యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది
అది నాకు అండగా నిలచి ఉన్నది " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||
వేదనతో దుఃఖముతో ఉన్న వారిని
జీవితమే వ్యర్ధమని ఎంచిన వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||
వ్యాధితో బాధతో క్రుంగిన వారిని
కన్నీటితో బ్రతుకును గడిపే వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||
సమస్యతో శాంతియే లేని వారిని
సంతోషమే ఎన్నడూ పొందని వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||