Yesu nee karyamulu yentho goppavi యేసూ నీ కార్యములు ఎంతో గొప్పవి

యేసూ.. నీ కార్యములు - ఎంతో గొప్పవి
తండ్రీ.. నీ తలంపులు - లెక్కలేనివి = 2
అవి కంటికి కనపడవు - హృదయానికి అంతుచిక్కవు - 2

1. కానావిందులో ఒకేమాటతో - అద్భుతముచేసితివీ
చేపకడుపులో ఆశ్చర్యముగా - యోనాను ఉంచితివీ = 2
"అవి కంటికి కనపడవు"

2. షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో - అగ్నిలో నిలచితివీ
దానియేలుకు సింహపు బోనులో - విజయమునిచ్చితివీ = 2
"అవి కంటికి కనపడవు"

3. పౌలు సీలలు ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయెనే
గొర్రెల కాపరి దావీదును - రాజును చేసితివీ = 2
"అవి కంటికి కనపడవు"

Yem chesanayya neekosam e brathukunicchavani ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

ఏం చేసానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||

Devuni mandhiram dhivena pramganam దేవుని మందిరం దీవెన ప్రాంగణం

లాలాలలా
పల్లవి.
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2.
వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2.

చరణం 1
ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించివున్నది

ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది
.వేచియున్నది.
.దేవుని.

చరణం2

వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కడ చెప్పుకునే వీలున్నది
వేచియున్నది.
.దేవునిమందిరం.

చరణం3.
వాక్యాహారములో ఫలించుటకు
దేవుని స్వరమువిని భలమొo దుటకు
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది
.వేచియున్నది.
.దేవునిమందిరం.

Nenu kuda vunnanayya nannu vaduko నేను కూడా ఉన్నానయ్య నన్ను వాడుకో యేస్సయ్య

నేను కూడా ఉన్నానయ్య }
నన్ను వాడుకో యేస్సయ్య ఆ.ఆ... }॥2॥
పనికి రాని పాత్రననీ }
నను పారవేయకు యేస్సయ్య }॥2॥

 1. జ్ఞానమేమి లేదు గాని }
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ.ఆ... }॥2॥
నీవేనా జ్ఞాన మాని ॥2॥
నీ సేవ చేయ వచ్చినానయ్య ॥2॥ ॥నేను॥

2. ఘనతలోద్దు మెప్పులోద్దు.... }
ధనము నాకు వద్దే వద్దు }॥2॥
నీవే నాకు ఉంటే చాలు ॥2॥
నా బ్రతుకులోన ఏంతో మేలు ॥2॥ ॥ నేను॥

3. రాళ్ళతో నన్ను కొట్టిన గాని }
రక్తము కారిన మరువలేనైయా ఆ.ఆ.. }॥2॥
ఊపిరి నాలో ఉన్నంత వరకు ॥2॥
నీ సేవలో నేను సాగిపోదునయా ॥2॥ ॥నేను॥

4. మోషే యేహోషువాను పిలిచావు.. }
ఏలియ ఏలిషాను నిలిపావు ఆ.ఆ. }॥2॥
పేతురు యెహను యాకోబులను ॥2॥
అభిషేకించి వాడుకున్నావు ॥2॥ ॥నేను॥

Yesuni namamlo mana badhalu povunu యేసుని నామములో మన బాధలు పోవును


యేసుని నామములో మన బాధలు పోవును
          దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును
          మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమమదొచ్చును
.. యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
          అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

1.        ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా
          ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా
          ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు
          పరివర్తన చెందినచో పరలోకం చేరేదవు        ||యేసు రక్తముకే||

2.       రాజువైన యాజకుడవైనా నిరుపేదవైన బ్రతుకు చెడియున్నా
          ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా
          శ్రీ యేసుని నామములో విశ్వాసం నీకున్నా 
          నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు     ||యేసు రక్తముకే||

Silvalo nakai karchenu yesu rakthamu సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము


సిల్వలో నాకై కార్చెనుయేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెనుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తముయేసు రక్తము (2)
సమకూర్చు నన్ను తండ్రితోయేసు రక్తము (2)
సంధి చేసి చేర్చునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితోయేసు రక్తము (2)
సమాధాన పరచునుయేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చునుయేసు రక్తము (2)
నీతిమంతులుగ చేయునుయేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తముయేసు రక్తము (2)
రోగములను బాపునుయేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలునుయేసు రక్తము (2)
యేసు రక్తముప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చునుయేసు రక్తము (2)

Yenni thalachina yedhi adigina ఎన్ని తలచినా ఏది అడిగినా


ఎన్ని తలచినా ఏది అడిగినా   }
జరిగేది నీచిత్తమే                    }2 ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని   }
నా ప్రార్థనఆలకించుమా     }2 ప్రభువా
             1
నీ తోడు లేక నీ ప్రేమ లేక        }
ఇలలోన ప్రాణి నిలువలేదు }2
అడవి పూవులే నీ ప్రేమ పొందగా 2
నా ప్రార్థన ఆలకించుమా 2 ప్రభువా      ఎన్ని
              2
నా ఇంటి దీపం నీవే అని తెలసి          }
నా హృదయం నీ కొరకై పదిలపరచితి }2
ఆరిపోయిన నా వెలుగు దీపము 2
వెలిగించుము నీ ప్రేమతో 2 ప్రభువా      ఎన్ని
              3
ఆపదలు నన్ను వెన్నంటియున్నా  }
నా కాపరి నీవై నన్నాదుకొంటివి     }2
లోకమంతయూ నన్ను విడచినా 2
నీ నుండి వేరు చెయ్యవు 2 ప్రభువా      ఎన్ని
             4
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి }
నా కొరకై కల్వరిలో యాగమైతివి     }2
నీదు యాగమే నా మోక్ష మార్గము 2
నీయందే నిత్యజీవము 2 ప్రభువా         ఎన్ని

Yesayya Namamlo Sakthi Unnadhayya యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా


 యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
 శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
 నమ్మితే చాలు నీవు  పొందుకుంటావు శక్తిని    

1. పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
 పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం

2. రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము
 మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం

3. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
 దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం

4. సృష్టిని శాసించగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం
 మృతులను లేపగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం

5. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం
 పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం