Yesunadhini yodhulandharu vasiga యేసునాధుని యోధులందరు వాసిగ


Song no: 117

రా – రేగుప్తి
తా – ఏక

యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు – వేగమె — వాసిగ నిటరండు = భాసురముగ ప్రభు జన్మము బాడుచు – నాసతోడ రండు – వేగమె — యాసతోడ రండు ||జే జయం||
  1. దూతలమాదిరి గాత్రము లెత్తుచు – గీతము బాడుండి – వేగమె – గీతము బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని – ఖ్యాతిగ బలుకుండి – వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం||
  2. గొల్లలు ప్రభు కడకేగిన రీతిని – నెల్లరు నడువుండి – వేగమె – యెల్లరు నడువుండి = ఉల్లములందున సంతసించి ప్రభు – నెల్లెడ దెలుపుండి – వేగమె – యెల్లడ దెలుపుండి ||జే జయం||
  3. జ్ఞానుల భంగిని మానవులందరు – కానుక లియ్యుండి – వేగమె – కానుక లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము – దానము బొందుండి – వేగమె – దానము బొందుండి ||జే జయం||
  4. మరియ రీతిగను మనసు లోపలను – మురియుచు నుండుండి – వేగమె కానుక లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము – దానము బొందుండి – వేగమె – దానము బొందుండి ||జే జయం||
  5. జయజయ శబ్దము జేయుచు ప్రభునకు – జయమని పాడుండి వేగమె — జయమని పాడుండి = జయజయ మంచును – జయ శబ్దముతో జయముల నొందుండి – వేగమె – జయముల నొందుండి ||జే జయం||

Geethamulu padudi yesuniki గీతములు పాడుఁడీ యేసునికి


Song no: 115
రా – భైరవి
(చాయ: సందియము వీడవె)
తా – త్రిపుట

గీతములు పాడుఁడీ – యేసునికి సం – గీతములు పాడుఁడీ = పాతకులమగు మనల దారుణ – పాతకము తన విమలరక్త – స్నాతులనుగాఁ జేసి పాపను – భాతకులలో నవతరించెను ||గీతములు||
  1. రాజులకు రాజుగా – నేలుచు మోక్ష – రాజ్యమున కర్తగా = బూజలందుచు దూత పరిగణ – పూజితుండౌ ఘనుఁడు తన దగు – తేజ మెల్లను విడిచి యీయిలఁ – దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు||
  2. దాసులగు వారలన్ – దమ పటు దోష – త్రాస విముక్తులన్ = జేసి వారల నెల్ల మోక్ష ని – వాసులుగఁ జేయంగ రక్తముఁ – బోసి కృపచేఁగావ వచ్చెను – యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు||
  3. మానవుల కెల్లను – దేవుని ప్రేమ – మానుగాఁ జూపను = ప్రమానిపై దన రక్త మొసఁగఁగ – మానవుండై పుట్టె యూదుల – లోన యేసను పేరుచేఁదా – దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు||
  4. ఆదిఁ దన వాక్యము – నందున యేసు -మోదమున్ నిట్లనెన – మేదినిందా మనుజుఁడై యిఁక – సాదరమ్మునఁ బ్రోవ మనుజుల – నా దయాళుఁడు తనదు దేహము – సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||

Santhoshinchandi yandharu natho సంతోషించుఁడి యందరు నాతో



Song no: 113
రా – శంకరాభరణము
తా – ఆది

సంతోషించుఁడి – యందరు నాతో – సంతోషించుఁడి – యొక = వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని – సంతోషించుఁడి – నాతో ॥సంతో॥
  1. అంధకార మయమైన భూమి నా – ద్యంతము వెలిఁగింప – దాని యూ – వేశముఁ దొలఁగింప = వందితుండు క్రీస్తేసు నాధుఁడు – వచ్చెఁ బ్రకాశుండై – భూమికి – నిచ్చె ప్రకాశంబు ॥సంతో॥
  2. కాన నంధకారంబు దొలఁగఁ ప్ర – కాశించెను లెండు – విూరు ప్ర – కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై – మహిని నవతరించె – భక్తుల – మనము సంతసించె ॥సంతో॥
  3. మిన్ను నుండి సంతోషోదయము – మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగులఁ ప్రకాశించె = మున్ను జేయఁబడిన వాగ్ధత్తము – తిన్నగ నెరవేరె భక్తుల – కన్ను లాస దీరె ॥సంతో॥
  4. ప్రీతియైన నీ పండుగ గూర్చి – నూతన కీర్తనను – గలసికొని – నాతోఁ పాడుచును = నీ తరి దూరస్తుల కీ వార్తను – నే తీరును నైనఁ – దెలుపఁగ – నాతురపడవలెను ॥సంతో॥
  5. పాపులపై దేవునికిఁ గలిగిన – ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను = జూపకపోయిన లోపము మనపై – మోపఁబడును నిజము – వేగము – జూపద మా పథము ॥సంతో॥

Rakshakundudhayinchi nadata manakoraku రక్షకుండుదయించినాఁడఁట మనకొరకుఁ


Bilmoria



Song no: 112

రా – మధ్యమావతి
తా – అట
రక్షకుండుదయించినాఁడఁట – మనకొరకుఁబరమ – రక్షకుం డుదయించి నాఁడఁట = రక్షకుండుదయించినాఁడు – రారె గొల్లబోయలార – తక్షణమనఁ బోయి మన ని – రీక్షణ ఫల మొందుదము ॥రక్షకుండు॥
  1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు = దేవుఁడగు యెహోవా మన – దిక్కుఁ దేరి చూచినాఁడు ॥రక్షకుండు॥
  2. గగనమునుండి డిగ్గి – ఘనుఁడు గబ్రియేలు దూత = తగినట్టు చెప్పె వారికి – మిగుల సంతోషవార్త ॥రక్షకుండు॥
  3. వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాఁడు = కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ॥రక్షకుండు॥
  4. పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రములజుట్టి = శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ॥రక్షకుండు॥
  5. అనుచు గొల్ల లొకరి కొక – రానవాలు జెప్పకొనుచు = అనుమతించి కడకుఁ క్రీస్తు – నందరికినీ దెల్పినారు ॥రక్షకుండు॥

Koniyadadharame ninnu komala hrudhaya కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ




Song no: 108

రా – కమాసు
తా – త్రిపుట

కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను = తనరారు దినకరుఁ – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు — కాంతిమంతుఁడ వీవు ॥కొనియాడ॥
  1. ఖెరుబులు సెరుపులు – మరి దూతగణములు = నురుతరంబుగఁ గొలువ – నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ॥కొనియాడ॥
  2. సర్వలోకంబులఁ – బర్వు దేవుఁడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ॥కొనియాడ॥
  3. విశ్వమంతయు నేలు – వీరాసనుఁడ వయ్యుఁ = పశ్వాళితోఁ దొట్టిఁ – పండియుంటివి నీవు ॥కొనియాడ॥
  4. దోసంబులను మడియు – దాసాళిఁ గరుణించి = యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ॥కొనియాడ॥
  5. నరులయందునఁ గరుణ = ధర సమాధానంబు = చిరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ॥కొనియాడ॥
  6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మఁ జేకొని = శ్రేయముగ బవళించు శ్రీకరవరసుత ॥కొనియాడ॥

Udhayinchinadu kresthudu nedu ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు

Song no: 107

రా – సురటి
తా – త్రిపుట
ఉదయించినాఁడు – క్రీస్తుఁడు నేఁడు – ఉదయించినాఁడు = విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ = సదయుఁడై చెడియున్న పృథివికి – నొదవ సమ్మద మల పిశాచికి – మద మణంగను సాధు జనముల — హృదయముల ముద మెదుగునట్లుగ ॥నుదయించి॥
  1. ఏ విభునివలన – నీ జగ మయ్యె – నా విభుఁ డీయిలను = దైవత్వమగు మను – ష్యావతారముఁ దాల్చె = జీవులకు జీవనముపై తగ – దేవుఁడును దానొక్కఁడు చిర-జీవియగు ప్రభు పాపి జీవులఁ – గావఁ దనుఁ జావునకు నొడఁబడి ॥యుదయించి॥
  2. యూదుల నడుమన్ – బెక్కగు భేదా – భేదముల్ బొడమన్ = వాదించి ప్రభు రాకఁ – గాదంచు మది నెంచి = విూదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ – డౌ దయాళుఁడు ప్రాణ మిడుటకు ॥నుదయించి॥

Vacchi grabriyelu palkenu వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ

Song no: 106

రా – ఆనందభైరవి
తా – త్రిపుట
వచ్చిగాబ్రియేలు పల్కెను – మరియ – మచ్చకంటిడెంద ముల్కెను = హెచ్చైన శుభముల – నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని – న్నెచ్చు జేయునటంచు ॥వచ్చి॥
  1. భయ మాత్మలో వీడు కన్యకా – నీవు – దయబొంది యున్నావు ధన్యగా = రయముగ నిదిగోగ – ర్భముఁ దాల్చెదవు పుత్రో – దయమౌ యేసను పేర – తని కిడు మంచును ॥వచ్చి॥
  2. అతఁడెన్నఁబడును మహాత్ముడై – సర్వో – న్నతుఁడైన దైవకుమారుఁడై = హిత మొప్పు దేవుండు – న్నతిఁ జేసి దావీదు – వితత సింహాసన – మతని కిచ్చునంచు ॥వచ్చి॥
  3. ఘనతరుఁడగు వాని రాజ్యము – అంత – మొనగూడ దది నిత్యపూజ్యము = వనితమగు యాకోబు – వంశ మెల్లపు డేలు – కొను నాతఁ డనుంచుఁ దె – ల్పెను దూత మరియతో ॥వచ్చి॥