Nee dhanamu ni ghanamu prabhu yesudhey నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

Song no: 578

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||

ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||

పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||

వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||

కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||

Na yanna ragadhe o yesu thandri na yanna ragadhe నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే

Song no: 179

నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు ||నా యన్న||

ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై పోవునట్లుగా ||నా యన్న||

పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||

ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ ప్రేమఁ జూతు ||నా యన్న||

తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||

Papamu dhalachu sumi pacchatthapamu bondhu sumi పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ

Song no: 317

పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము||

పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము||

గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము||

ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము||

తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ ||పాపము||

అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ ||పాపము||

Jeevithanthamu varaku neeke seva salppudhunantini జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని

Song no: 442

జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

Lemmu thejarillumu neeku velugu vacchiyunnadhi లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది

Song no: 465

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||

జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||

సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||

గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము||

నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము||

ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||

Kalugunugaka devuniki mahima kalugunu gaka కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక

Song no: #27

    కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||

  1. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||

  2. మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||

  3. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ ||కలుగును||

  4. లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||

  5. పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||

Yesuni premanu nemarakanu neppuda dhalachave యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే

Song no: 173

యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||

పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||

కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||

మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని||

ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||

వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||