Kraisthavulara lendi ienadu క్రైస్తవులారా! లెండి యీనాడు

Song no: 130

క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుఁడి; ప్రసన్నుఁడైన ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుఁడి క్రీస్తేను మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుఁడి.

దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకటించెను:- ‘ఈ వేళ మహా సంతోషంబగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్నమం దీదినము దైవరక్షకుఁడు జన్మించెను.’

త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను ‘సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుఁడు’.

పరమతండ్రి దయారసము నరులకెంతో నాశ్చర్యము నరావతారుఁడగు దేవుఁడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను.

శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము; ఈ దినమందు నుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము; సదయుఁడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము.

Sri rakshakundu puttaga naakasha శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము

Song no: 129

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. ‘పరంబునందు స్వామికి మహా ప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు’.

ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు.

పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి రెండువేల వర్షములు గతించిపోయెను భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి.

పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు విూ పాపభార మంతయు వహింప వచ్చెను తాపత్రయంబు నంతయుఁ దానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును.

సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళ నే నిజంబుగా సవిూప మాయెను ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండును ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు.

Shuddha rathri saddhanamga nandharu nidhrapova శుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు నిద్రపోవ

Song no: 128

శుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా.

శుద్ధరాత్రి! సద్ధణంగ దూతల హల్లెలూయ గొల్లవాండ్రకుఁ దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను. క్రీస్తు జన్మించెను.

శుద్ధరాత్రి! సద్ధణంగ దేవుని కొమరుఁడ! నీ ముఖంబున బ్రేమ లొల్కు నేఁడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే.

Dhutha pata padudi rakshakun దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ

Song no: #127 226

  1. దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
    ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్
    భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను
    ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ
    దూత పాట పపాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.

  2. ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు
    అంత్యకాలమందున కన్యగర్భమందున
    బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో
    ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా?
    దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
  3. దావె నీతి సూర్యుఁడా రావె దేవపుత్రుఁడా
    నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను
    భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు
    నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును
    దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ

Nee samadhanamu dhasuni kippudu నీ సమాధానము దాసుని కిప్పుడు


Song no: 125

రా – శంకరాభరణము
(చాయ: నాకాలగతు లెవ్వి)
తా – త్రిపుట

నీ సమాధానము – దాసుని కిప్పుడు – నాధా దేవా = యిచ్చి – నీ మాటచొప్పున – పోనిచ్చుచున్నావు – నాధా దేవా ||నీ సమాధానము||
  1. అన్యులకు నిన్ను- బయలు పరచెడి – వెలుగుఁగాను = నీకు – నణఁగు ప్రజలైన – యిశ్రాయేల్ వారికి – మహిమ గాను ||నీ సమాధానము||
  2. నరులకై నీవు ఏ – ర్పరచిన రక్షణన్ – నాధా దేవా – యిదిగో – నాకనులు చూచి యా – నందించుచున్నవి – నాధా దేవా ||నీ సమాధానము||
  3. తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును – గలుగుగాక = మహిమ – తరుగక సదాకాలము – యుగయుగములకును – గలుగు నామేన్ ||నీ సమాధానము||

Nadhu pranamu prabhuni migula నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు

Song no: 124

రా – హిందుస్థాని తోడి
తా – ఆది

నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ – నంబు చేయుచున్నది = నాదు నాత్మ దేవునం దా – నం మొందెను నిరతము ॥నాదు॥
  1. దేవుఁడు తన భృత్యురాలి – దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరఁ దరము లన్నిఁక – నెన్ను నను శుభవతి యని ॥నాదు॥
  2. సర్వ శక్తుఁడు మహాకృత్యము – సంభవింపఁ జేసెను = ఉర్విలో నా ప్రభుని నామం – బోప్పు బరిశుద్ధంబుగా ॥నాదు॥
  3. భయము భక్తియుఁ గల్గి దేవుని – భజనఁ జేసెడి వారికి = నయముగాఁ దన కృప నొసంగు న – నయమును దరతరములు ॥నాదు॥
  4. విదిత బాహువు చేత శార్యము – విభుఁడు కనపర్చెను = హృదయపుఁ దలంపులను గర్వులఁ – జెదరఁ  గొట్టెను నిజముగ ॥నాదు॥
  5. ఆసనాసీనులై యున్న- యతిశయాత్ములన్ బడఁ = ద్రోసి దేవుఁడు దీనులను సిం – హాసనంబుల నునిచెను ॥నాదు॥
  6. క్షుధితులను దన మధురములచేఁ – గోరి తృప్తి పర్చెను = అధిక ధనవంతులను రిక్త – హస్తములతో ననిపెను ॥నాదు॥
  7. ఆది పితరులైన యబ్రా – హాము కతని సంతున = కద్వితీయుఁ డాదిలోక – నాన తిచ్చినట్లుగా ॥నాదు॥
  8. నిరతమును దన కరుణఁ జూప = నిజముగా మది నెంచెను = వరదుఁ డిశ్రాయేలునకుఁ దన – వర సహాయ మొనర్చెను ॥నాదు॥
  9. పరమ తండ్రికి దైవ సుతునకు – పావనాత్మకు నిఁక నిహ = పరము లందును యుగయుగంబులఁ – బరఁగు మహిమ మామేన్ ॥నాదు॥
– భవవాసి సమూయేలు

Iesrayeliyula devunde yentho ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో



Song no: 123
తా – ఆది

ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥
  1. తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
  2. దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥
  3. జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥
  4. ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును – జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
  5. ధర నో శిశువా దేవుని దీర్ఘ – దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥
  6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ – మార్గము సిద్ధపరచుటకై – దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు – గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥
  7. మరియును సమాధాన సరణిలో – మన మిఁక నడువఁ జీఁకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి – నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥
  8. జనక పుత్రాత్మ దేవుని కిలలో – ఘనత మహిమ కల్గును గాక = మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ – ములకును దనరారునుగా కామేన్  ॥నిశ్రా॥