Vacchadu vacchadu raraju paralokalo nundi వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకంలో నుండి

Song no:
HD
    వచ్చాడు వచ్చాడు రారాజు
    పరలోకంలో నుండి వచ్చాడు
    తెచ్చాడు తెచ్చాడు రక్షణ
    పాపుల కొరకై తెచ్చాడు } 2
    ఆనందమే ఆనందమే
    క్రిస్మస్ ఆనందమే
    సంతోషమే సంతోషమే
    మన బ్రతుకుల్లో సంతోషమే } 2 || వచ్చాడు ||

  1. చలి చలిగా ఉన్న ఆ రాత్రి వేళలో
    దేవదూత వచ్చి శుభవార్త చెప్పెను } 2
    మీ కొరకు రక్షకుడు
    లోకానికి ఉదయించేనూ } 2
    దూతలేమొ సందడి
    గొల్లలేమొ సందడి
    యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||

  2. పశువుల పాకలో పరిశుధ్దుడు
    మనమెట్టి వారమైన త్రోసివేయడు } 2
    మన దోషం తొలగించే
    యేసు క్రీస్తు జన్మించెను } 2
    దాసులేమొ సందడి
    దేశమేమొ సందడి
    యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||

Nee chethitho nannu pattuko నీ చేతితో నన్ను పట్టుకో

Song no:

    నీ చేతితో నన్ను పట్టుకో
    నీ ఆత్మతో నన్ను నడుపు
    శిల్పి చేతిలో శిలను నేను
    అనుక్షణము నన్ను చెక్కుము } 2

  1. అంధకార లోయలోన
    సంచరించినా భయములేదు
    నీ వాక్యం శక్తిగలది
    నా త్రోవకు నిత్యవెలుగు } 2

  2. ఘోరపాపిని నేను తండ్రి
    పాప ఊభిలో పడియుంటిని
    లేవనెత్తుము శుద్దిచేయుము
    పొందనిమ్ము నీదు ప్రేమను } 2

  3. ఈ భువిలో రాజు నీవే
    నా హృదిలో శాంతి నీవే
    కుమ్మరించుము నీదు ఆత్మను
    జీవితాంతము సేవ చేసెదన్ } 2 || నీ చేతితో ||


Nee Chethitho Nannu Pattuko
Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu
Anukshanamu Nannu Chekkumu (2)

Andhakaara Loyalona
Sancharinchinaa Bhayamu Ledu
Nee Vaakyam Shakthigaladi
Naa Throvaku Nithya Velugu (2)

Ghorapaapini Nenu Thandri
Paapa Oobhilo Padiyuntini
Levaneththumu Shudhdhi Cheyumu
Pondanimmu Needu Premanu (2)

Ee Bhuvilo Raaju Neeve
Naa Hrudilo Shaanthi Neeve
Kummarinchumu Needu Aathmanu
Jeevithaanthamu Seva Chesedan (2)        ||Nee Chethitho||

Dhivi nundi dhiginavayya ma gundello దివి నుండి దిగినావయ్యా మా గుండెల్లో

Song no:
HD

    దివి నుండి దిగినావయ్యా
    మా గుండెల్లో జన్మించావయ్యా } 2
    నీవేనయ్య నీవేనయ్య
    నీవేనయ్య మాహా రాజువు
    నీవేనయ్య నీవేనయ్య
    నీవేనయ్య లోక రక్షకుడవు
                        " దివి నుండి  "

  1. లోకమును ఎంతో ప్రేమించావు
    " ఎంతో ప్రేమించావు "
    పాపులను ప్రేమతో క్షమియించావు
    " ప్రేమతో క్షమియించావు "  " 2 "
    బాలుడవు కావు బలవంతుడవు నీవు
    కరుణను చూపావు కరుణామయుడైనావు
            " నీవేనయ్య " " దివి నుండి "

  2. ఆత్మలను సువార్తతో బ్రతికించావు
    "సువార్తతో బ్రతికించావు"
    రోగులకు అంధులకు వైద్యుడవైనావు
    "అంధులకు వైద్యుడవైనావు"  " 2 "
    నీతి సూర్యుడవు నీవు భువిపై ఉదయించావు
    యుద్ధ వీరుడవు నీవు
    సాతాను కొమ్ములు విరిచావు " 2 "
            " నీవేనయ్య " " దివినుండి "

Nashiyinchu athmalenniyo chejari povuchundaga నశియించు ఆత్మలెన్నియో చేజారి పోవుచుండగా

Song no:

    నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
    పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
    పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..

  1. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
    నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
    అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను } 2
    లోకాన చాటగా } 2 || నశియించు ||

  2. ఈ లోక భోగము – నీకేల సోదరా
    నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
    ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా } 2
    ప్రియ యేసు కోరెను } 2 || నశియించు ||


Nashiyinchu Aathmalenniyo – Chejaari Povuchundagaa
Parithaapa Mondenesu – Priyamaara Ninnu Piluva
Parikinchumayyaa Sodaraa O.. O.. O..

Nee Paapa Bhaaramanthaa – Prabhu Yesu Mosegaa
Nee Paapa Gaayamulanu – Aa Yesu Maanpegaa
Asamaanamaina Prema Ghanumaa Ee Suvaarthanu (2)
Lokaana Chaatagaa (4)            ||Nashiyinchu||

Ee Loka Bhogamu – Neekela Sodaraa
Nee Parugu Pandemandu – Guri Yesude Kadaa
Prabhu Yesunande Shakthinondi Saagute Kadaa (2)
Priya Yesu Korenu (4)           ||Nashiyinchu||

Ontarivi kavu yenadu neevu ఒంటరివి కావు ఏనాడు నీవు

Song no:
HD
    ఒంటరివి కావు ఏనాడు నీవు
    నీ తోడు యేసు ఉన్నాడు చూడు } 2
    ఆలకించవా ఆలోచించావా
    ఆనందించవా } 2 || ఆలకించవా ||

  1. వెలివేసారని చింతపడకుమా
    ఎవరూ లేరని కృంగిపోకుమా
    ఒంటరితనమున మదనపడకుమా
    మంచి దేవుడు తోడుండగా } 2
    ఆత్మహత్యలు వలదు
    ఆత్మ ఆహుతి వలదు } 2 || ఆలకించవా ||

  2. బలము లేదని భంగపడకుమా
    బలహీనుడనని బాధపడకుమా
    ఓటమి చూచి వ్యసనపడకుమా
    బలమైన దేవుడు తోడుండగా } 2
    నిరాశ నిస్పృహ వద్దు
    సాగిపోవుటే ముద్దు } 2 || ఆలకించవా ||


Ontarivi Kaavu Aenaadu Neevu
Nee Thodu Yesu Unnaadu Choodu (2)
Aalakinchavaa Aalochinchavaa
Aanandinchavaa (2)    ||Ontarivi||

Velivesaarani Chinthapadakumaa
Evaru Lerani Krungipokumaa
Ontarithanamuna Madanapadakumaa
Manchi Devudu Thodundagaa (2)
Aathmahathyalu Valadu
Aathma Aahuthi Valadu (2)     ||Aalakinchavaa||

Balamu Ledani Bangapadakumaa
Balaheenudanani Baadhapadakumaa
Otami Choochi Vyasanapadakumaa
Balamaina Devudu Thodundagaa (2)
Niraasha Nispruha Vaddu
Saagipovute Muddu (2)         ||Aalakinchavaa||



Sambaralu santhoshalu yesu vunte chalu సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు

Song no:
HD
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2

    ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
    తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ } 2

    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  1. గొల్లలందరు పూజింప  వచ్చిన  మంచి కాపరి
    దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు } 2
    నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
    తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
    ప్రాణమెట్ట నీకై మట్టిలో   అడుగెట్టిన మంచి మంచి దేవుడు } 2
    నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు
    పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు } 2
    నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు
    ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||


Dhaveedhu pattanamamdhu neethi suryudu దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను

Song no:
HD
    దావీదు పట్టణమందు
    నీతి సూర్యుడు జన్మించెను } 2
    నేడే ఈ శుభవార్త
    ప్రజలందరికీ సంతోషము } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  1. ప్రభువుదూత వచ్చి
    క్రీస్తు వార్తను తెలిపెను } 2
    గొర్రెల కాపరులెల్లి
    దేవుని మహిమ పరచిరి } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  2. ఆకాశంలో నక్షత్రమును చూచిరి } 2
    తూర్పు జ్ఞానులు వెళ్లి
    యేసుకు కానుకలర్పించిరి } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  3. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా } 2
    లోకపాపములు మోసుకొనే
    దేవుని గొర్రెపిల్లగా } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||