Oka sari nee swaramu vinagane ఒకసారి నీ స్వరము వినగానే

Song no:
HD
    ఒకసారి నీ స్వరము వినగానే
    ఓ దేవా నా మనసు నిండింది
    ఒకసారి నీ ముఖము చూడగానే
    యేసయ్య నా మనసు పొంగింది (2)
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||

  1. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
    ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
    నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
    తొలగించె నాలోని ఆవేదన
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||

  2. ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
    బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
    తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
    నడిపించు మమ్ములను నీ బాటలో
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||


    Okasaari Nee Swaramu Vinagaane
    O Devaa Naa Manasu Nindindi
    Okasaari Nee Mukhamu Choodagaane
    Yesayya Naa Manasu Pongindi (2)
    Naa Prathi Shwaasalo Nuvve
    Prathi Dhyaasalo Nuvve
    Prathi Maatalo Nuvve
    Naa Prathi Baatalo Nuvve (2) ||Okasaari||

    Nee Siluva Nundi Kurisindi Prema
    Ae Prema Ainaa Sarithoogunaa (2)
    Nee Divya Roopam Merisindi Ilalo
    Tholaginche Naaloni Aavedana ||Naa Prathi||

    Ilalona Prathi Manishi Nee Roopame Kadaa
    Brathikinchu Mammulanu Nee Kosame (2)
    Tholagaali Cheekatlu Velagaali Prathi Hrudayam
    Nadipinchu Mammulanu Nee Baatalo ||Naa Prathi||

Yesuni korakai yila jeevinchedha bhasuramuga ne యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే

Song no:474

    యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||

  1. నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||

  2. పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||

  3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||

  4. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||

  5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||

  6. అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని||

  7. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||

  8. యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||




Yevarunnarayya Naaku Neevu Thappa ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప

Song no:

ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక || ఎవరున్నరయ్యా ||
నా యేసయ్య.. హల్లెలూయా .. (4)

1 .నా ఆశ్రయం నీవే .. నా ఆశయం నీవే (2)
నా సర్వము యేసు నీవేగా (2) || ఎవరున్నరయ్యా ||

2. ఈ భువికి దీపం నీవే .. నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) || ఎవరున్నరయ్యా ||

Yevarunnarayya Naaku Neevu Tappa Emunnadayya Bhuvilo Neevu Leka || Evarunnarayya || Naa Yesayya .. Halleluyah.. (4)

1 .Naa Ashrayam Neeve .. Naa Ashayam Neeve (2)
Naa Sarvam Yesu Neevegaa (2) || Evarunnarayya ||

2. Ee Bhuviki Deepam Neeve .. Naa Hrudilo Velugu Neeve (2)
Annintini Veliginche Deepam Neeve (2) || Evarunnarayya ||

Unna patuna vacchu chunnanu nee padha sannidhi ko ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో

Song no:315

    ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||

  1. కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ || ఉన్న||

  2. మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని || ఉన్న||

  3. వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె || ఉన్న||

  4. కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె || ఉన్న||

  5. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె || ఉన్న||

  6. దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే || ఉన్న||




Deva dhinapapini o pavana gavu దేవ! దీనపాపిని ఓ పావన గావు

Song no:314

దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||

ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||

నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ||

నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||

పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ||

ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ||

కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ||

త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో ||దేవ||

నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ||

కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ జేసెద ||దేవ||

ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ||

కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ||

విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ||





Maha vaidhyudu vacchenu prajali మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ

Song no:312

మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ || మాధుర్యంపు నామము మోద మిచ్చు గానము వేద వాక్యసారము యేసు దివ్య యేసు ||

మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు.

వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్

ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్

ఓ యన్నలారా పాడుఁడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి ప్రియుఁడేసు

ఓ పిల్లలారా కొల్వుఁడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్

శ్రీ యేసుకై యర్పించుఁడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుఁడేసున్





Janu lamdharu vinamdi dhivya sangathi జను లందఱు వినండి దివ్య సంగతి

Song no:311

జను లందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుఁగాను బ్రాణ మిచ్చెను తన్ను ఁ జేర నన్ను ఁ బిల్చెన్ క్రీస్తు వత్తును ||

నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను.

మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.

ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.

పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినఁగాను బాధ తీఱును.

చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ముఁ బిల్చును