Korithi nee sannidhanam cherithi కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానం కడవరకు నాకు


Song no: 2
కోరితి నీ సన్నిదానం
చేరితి నీ సన్నిదానం
కడవరకు నాకు తోడుగ ఉండాలని
 
1. నీ పాదసేవ చేయాలని
    నిన్నే నేను చూడాలని
    మనసార నిన్నె
    కోరితి నా ప్రభువా

2. పాపికి ఆశ్రయం నీవేనని
    పరముకు మార్గము నీలోనని
    ప్రేమతో నిన్నే కోరితి యేసయ్యా

3. చావైన బ్రతుకైన నీవేనని
    బ్రతికితే నీ సేవ చేయాలని
    నిన్నే నేను కోరితి నా దేవా

Varnninchalenesayya vivarinchalenesayya వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా


Song no: 1
వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా
ఆహా...ఆహా...నీ ప్రేమ మదురం
ఆహా...ఆహా...నీ ప్రేమ మదురం

1. పాపినైన నా కొరకై
    ప్రాణము నిచ్చి
    రక్తము చిందించి రక్షణ నిచ్చి
    కనుపాపవలె కాచావె
    నీ రెక్కలలో నను దాచావే

2. అందకారమందు నా
    దీపము నీవై
    అంధుడనైన నాకు మార్గము నీవై
    పరలోకమే తెరచితివా
    నిత్య జీవంబు నా కొసగితివా

Lokamanthata velugu prakashinchenu లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు


Song no: o
లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లో॥

నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను – చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు – వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ॥లో॥ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను – చంద్రుడైన నక్కరలేదు = ఆ పట్టణములో దేవుని మహిమయే – ప్రకాశించుచున్నది యెపుడు – ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ॥లో॥విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక – విూరు వెలుగు సంబంధులు = విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే – మరుగై యుండక నరులందరికి – వెలుగై యుందురనె యేసుండు॥లో॥చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును – చూచిరి ధన్యులై = లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద – ప్రకాశించెను గొప్ప వెలుగు ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లో॥

Yesayya namamlo sakthi vunnadhayya యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా


Song no:
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)        ||యేసయ్య||

పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

సృష్టి శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

Randi suvartha sunadhamutho ramjilu siluva రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో

Song no: 135

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి

యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం భాసర క్రైస్తవ శుభనామం ||రండి||

యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||

యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం ||రండి||

యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి||

యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం. ||రండి||

Randi Suvaartha Sunaadamutho
Ranjilu Siluva Ninaadamutho
Thambura Sithaara Naadamutho
Prabhu Yesu Dayaanidhi Sannidhiki (2)       ||Randi||

Yese Maanava Jaathi Vikaasam
Yese Maanava Neethi Vilaapam
Yese Patheetha Paavana Naamam
Bhaasura Kraisthava Shubha Naamam          ||Randi||

Yese Devuni Prema Swaroopam
Yese Sarveshvara Prathiroopam
Yese Prajaapathi Paramesham
Aashritha Janamula Sukhavaasam            ||Randi||

Yese Siluvanu Mosina Daivam
Yese Aathmala Shaashwatha Jeevam
Yese Kshamaapana Adhikaaram
Daasula Praardhana Sahakaaram           ||Randi||

Yese Sanghamulo Mana Kaanthi
Yese Hrudayamulo Ghana Shaanthi
Yese Kutumba Jeevana Jyothi
Pasipaapala Deevena Moorthy            ||Randi||

Yese Jeevana Mukthiki Maargam
Yese Bhakthula Boothala Swargam
Yese Prapancha Shaanthiki Soothram
Vaasiga Nammina Jana Sthothram           ||Randi||


Nee sallani supe o yesaya na brathukunu marchindhi messiya నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చించి మెస్సీయా

Song no: 116

    నీ సల్లని సూపే ఓ యేసయ్యా
    నా బతుకును మార్చించి మెస్సీయా } 2
    నీ మెల్లని మాటే ఓ యేసయ్యా } 2
    నను సేదదీర్చింది మెస్సీయా {నీ సల్లని}

  1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా
    తగ్గింపు నేర్పింది మెస్సీయా } 2
    పరిశుద్ధ నీ నడత యేసయ్యా } 2
    మాదిరి నాకుంచింది మెస్సీయా {నీ సల్లని}

  2. నీవు కార్చిన రక్తం యేసయ్యా
    నా పాపం కడిగింది మెస్సీయా } 2
    నీవు పొందిన మరణం యేసయ్యా } 2
    నాకు జీవం పోసింది మెస్సీయా {నీ సల్లని}

  3. నీ దేహపు గాయం యేసయ్యా
    స్వస్థత కలిగించింది మెస్సీయా } 2
    నీ కలువరియాగం యేసయ్యా } 2
    కొత్తజన్మనిచ్చింది మెస్సీయా {నీ సల్లని}

Parama daivame manushya rupamai పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను


Song no: o
పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నాకోసమే
అమరజీవమే నరుల కోసమే
దిగివచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)
||పరమ||

అకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరము ధరియించెను
సర్వాధికారుడు బలాడ్యధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను
దాసునిగా మారెను (2)
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా
||పరమ||

అనాదివాక్యమే కృపాసమేతమై
ధరపై కాలుమోపెను
ఆ నీతితేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను
రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను యేసురాజుగా
||పరమ||

నిత్యుడు తండ్రియై విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను
సంధిని సమకూర్చను(2)
సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా
||పరమ||