-->

Dutha ganamu padenu madhura geethamu దూత గణము పాడేను మధుర గీతము

Song no: #64

    దూత గణము పాడేను మధుర గీతము
    నా నోట నిండేను స్తోత్ర గీతము

    సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
    ఇష్టులైనవారికి ఇల సమాధానము

  1. ఘనుడు ఆశ్చర్యకరుడు - ప్రియుడు అతి సుందరుడు } 2
    దేవాదిదేవుడే దీనుడై - ఉదయించె పాకలో బాలుడై } 2

  2. నవ్వులు సొగసైన పువ్వులు - చూపులు మణిదీప కాంతులు } 2
    ఆ యేసు జననమే రమ్యము-నమ్మిన ప్రతి హృదయము ధన్యము } 2
Share:

Ye pata padenu yesayya ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని



Song no:
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
 ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని
గుండెల ధుఖం నిండిపోగ  గుండె గొంతుక పెనుగులాఢగ   ( ఏ పాట)

1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై  (2)
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట  (2)  ( ఏ పాట )

2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2)
 పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) )  ( ఏ పాట )
Share:

Randi randi randayo rakshakudu puttenu రండి రండి రండయో రక్షకుడు పుట్టెను

Song no:

    రండి రండి రండయో రక్షకుడు పుట్టెను } 2
    రక్షకుని చూడను రక్షణాలు పొందను } 2 || రండి ||

  1. యూదుల యూదట రాజుల రాజట } 2
    రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట } 2
    యూదుల యూదట రాజుల రాజట } 2
    రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట } 2 || రండి ||

  2. బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు } 2
    పశువుల శాలలో శిశువుగా పుట్టెను } 2
    బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు } 2
    పశువుల శాలలో శిశువుగా పుట్టెను } 2 || రండి ||

  3. సాతాను సంతలో సంతోషమేదిరా } 2
    సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో } 2
    సాతాను సంతలో సంతోషమేదిరా } 2
    సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో } 2 || రండి ||

    Randi Randi Randayo Rakshakudu Puttenu } 2
    Rakshakuni Choodanu Rakshanaalu Pondanu } 2      ||Randi||

    Yoodula Yoodata Raajula Raajata } 2
    Rakshanaalu Ivvanu Vachchiyunnaadata } 2
    Yoodula Yoodata Raajula Raajata } 2
    Rakshanaalu Ivvanu Vachchiyunnaadata } 2      ||Randi||

    Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku } 2
    Pashuvula Shaalalo Shishuvugaa Puttenu } 2
    Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku } 2
    Pashuvula Shaalalo Shishuvugaa Puttenu } 2      ||Randi||

    Saathaanu Santhalo Santhoshamediraa } 2
    Santhosham Kaladuraa Shree Yesuni Raakalo } 2
    Saathaanu Santhalo Santhoshamediraa } 2
    Santhosham Kaladuraa Shree Yesuni Raakalo } 2      ||Randi||
Share:

Rare chuthumu rajasuthudi రారె చూతము రాజసుతుడీ

Song no: 116
రా – హిందుస్థాని తోడి
తా – ఆది
    రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను = రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో ॥రారె॥

  1. దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా = దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున ॥రారె॥

  2. కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం = తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే ॥రారె॥

  3. బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు = బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥

  4. యూద వంశము – ను ద్ధరింప దా – వీదుపురమున – నుద్భవించె సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు ॥రారె॥
Share:

Redu messiya janminchenu sridha veedhu ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు


Song no: 111
ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను
వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప ||ఱేఁడు||

1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను
అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను ||ఱేఁడు||

2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను
నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును ||ఱేఁడు||

3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను
కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు||

4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు
సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా స్థలిపై ||ఱేఁడు||

5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను
చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||ఱే ఁడు||

6. చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును
సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన కర్త జన్మించె ||ఱేఁడు||

7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను

మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ వంశమునందు ||ఱేఁడు|| 
Share:

Kreesthu puttenu pashula pakalo క్రీస్తు పుట్టెను పశుల పాకలో


Song no:
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

1. పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)

2. కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)
Share:

Putte yesudu nedu manaku punya margamu పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము

Song no: 110

    పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||

  1. ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||

  2. యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||బుట్టె||

  3. తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts