Nithyudagu naa thandri neeke sthothramu నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

Song no: 45

    నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
    తరతరముల నుండి ఉన్నవాడవు
    ఆది అంతము లేని ఆత్మా రూపుడా
    ఆత్మతో సత్యముతో అరాధింతును
    నిత్యుడగు నా తండ్రి

  1. భూమి ఆకాశములు గతించినా
    మారనే మారని నా యేసయ్యా
    నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥

  2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
    నా పాపములకు పరిహారముగా మారెనులే
    కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥

  3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
    నూతన సృష్టిగ నేను మారెదను
    నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥

Ieruvadhi naluguru peddalatho ఇరువది నలుగురు పెద్దలతో

Song no: 4

    ఇరువది నలుగురు పెద్దలతో
    పరిశుద్ధ దూతల సమూహముతో (2)
    నాలుగు జీవుల గానంతో (2)
    స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||

  1. భూమ్యాకాశములన్నియును
    పర్వత సముద్ర జల చరముల్ (2)
    ఆకాశ పక్షులు అనుదినము (2)
    గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||

  2. కరుణారసమగు హృదయుడవు
    పరిశుద్ధ దేవ తనయుడవు (2)
    మనుజుల రక్షణ కారకుడా (2)
    మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||

  3. గుప్పిలి విప్పి కూర్మితోను
    గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
    గొర్రెల కాపరి దావీదు (2)
    అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||


iruvadi naluguru peddalatho
parishuddha doothala samoohamutho (2)
naalugu jeevula gaanamtho (2)
sthuthiyimpabaduchunna maa devaa ||iruvadi||

bhoomyaakaashamulanniyunu
parvatha samudra jala charamul (2)
aakaasha pakshulu anudinamu (2)
gaanamu cheyuchu sthuthiyimpan ||iruvadi||

karunaarasamagu hrudayudavu
parishuddha deva thanayudavu (2)
manujula rakshana kaarakudaa (2)
mahima kaligina maa prabhuvaa ||iruvadi||

guppili vippi koormithonu
goppaga deevenalichchedavu (2)
gorrela kaapari daaveedu (2)
ayyenu entho mahaaraaju ||iruvadi||

Anuragalu kuripinche nee prema thalachi అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి

Song no: 167

    అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
    అరుదైన రాగాలనే స్వరపరచి
    ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా

  1. యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
    నీ దివ్య సన్నిది చాలునయ || అనురాగాలు ||

  2. నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
    సర్వ సత్యములలో నే నడచుటకు
    మరపురాని మనుజాశాలను విడిచి
    మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే || అనురాగాలు ||

  3. అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
    వెనుదిరిగి చూడక పోరాడుటకు
    ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
    కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే || అనురాగాలు ||

  4. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
    స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు } 2
    అమూల్యమైన విశ్వాసము పొంది
    అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే || అనురాగాలు ||

Prema maya yesu prabhuva ninne sthuthinthunu prabhuva ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా

Song no: 31

    ప్రేమమయా యేసు ప్రభువా
    నిన్నే స్తుతింతును ప్రభువా -2
    అనుదినమూ - అనుక్షణము -2
    నిన్నే స్తుతింతును ప్రభువా -2
    ప్రేమమయా యేసు ప్రభువా
    నిన్నే స్తుతింతును ప్రభువా

  1. ఏ యోగ్యత లేని నన్ను
    నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
    నన్నెంతగానో ప్రేమించినావు -2
    నీ ప్రాణమిచ్చావు నాకై -2
    ప్రేమమయా యేసు ప్రభువా
    నిన్నే స్తుతింతును ప్రభువా  || ప్రేమమయా ||

  2. ఎదవాకిటను నీవు నిలచి
    నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
    హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
    నాకెంతో ఆనందమే -2
    ప్రేమమయా యేసు ప్రభువా
    నిన్నే స్తుతింతును ప్రభువా   || ప్రేమమయా ||

  3. శోధనలు నను చుట్టుకొనినా
    ఆవేదనలు నను అలుముకొనినా -2
    శోధన, రోదన ఆవేదనలో -2
    నిన్నే స్తుతింతును ప్రభువా -2   || ప్రేమమయా ||

Yemivva galanayya naa yesayya ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై


ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||

గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||

ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||


Puttenamma puttenamma yesu puttenu పుట్టెనమ్మ పుట్టెనమ్మ యేసు పుట్టెను


Song no: 121
పుట్టెనమ్మ పుట్టెనమ్మ యేసు పుట్టెను
బెత్లెహేము పురములోన
ప్రభువు పుట్టెను
కన్య మరియ గర్భమందున
పశుల పాక నీడయందున
ధన్యుల మయ్యాము యేసయ్యలో
అన్యులమైన మన మందరము
పాపులను రక్షించుటకు
ప్రభు యేసు జన్మించెను
దీనులను కరుణించుటకు
దీనుడై ఉదయించెను
ప్రేమను పంచె ప్రేమామయుడు
కృపను చూపె కరుణామయుడు
చీకటి లో వున్న మనకు
వెలుగును ఇవ్వడానికి
మరణములో వున్న మనకు
జీవమును ఇవ్వడానికి
ప్రాణం పెట్టిన ప్రేమామయుడు
పరమును ఇచ్చే పరిశుద్ధుడు


Aacharya karudu alochana kartha ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన



Song no: 127
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అధిపతి అని అతని పేరు
యేసే రాజు రాజుల రాజు
యేసే ప్రభువు ప్రభువుల ప్రభువు
చీకటిలో నడచు జనులు గొప్పవెలుగును చూచిరి
బహు ధన్యులైరి
చీకటి బాపను వెలుగుతో నింపను ప్రభువే జన్మించెను
ప్రభువే జన్మించెను
మరణాచ్ఛాయగల మనుష్యులపై వెలుగు ప్రకాశించెను
మరణము తొలగించి జీవము నిచ్చుటకు ప్రభువే జన్మించెను
ప్రభువే జన్మించెను