Udhayinchinadu kresthudu nedu ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు

Song no: 107

రా – సురటి
తా – త్రిపుట
ఉదయించినాఁడు – క్రీస్తుఁడు నేఁడు – ఉదయించినాఁడు = విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ = సదయుఁడై చెడియున్న పృథివికి – నొదవ సమ్మద మల పిశాచికి – మద మణంగను సాధు జనముల — హృదయముల ముద మెదుగునట్లుగ ॥నుదయించి॥
  1. ఏ విభునివలన – నీ జగ మయ్యె – నా విభుఁ డీయిలను = దైవత్వమగు మను – ష్యావతారముఁ దాల్చె = జీవులకు జీవనముపై తగ – దేవుఁడును దానొక్కఁడు చిర-జీవియగు ప్రభు పాపి జీవులఁ – గావఁ దనుఁ జావునకు నొడఁబడి ॥యుదయించి॥
  2. యూదుల నడుమన్ – బెక్కగు భేదా – భేదముల్ బొడమన్ = వాదించి ప్రభు రాకఁ – గాదంచు మది నెంచి = విూదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ – డౌ దయాళుఁడు ప్రాణ మిడుటకు ॥నుదయించి॥

Vacchi grabriyelu palkenu వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ

Song no: 106

రా – ఆనందభైరవి
తా – త్రిపుట
వచ్చిగాబ్రియేలు పల్కెను – మరియ – మచ్చకంటిడెంద ముల్కెను = హెచ్చైన శుభముల – నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని – న్నెచ్చు జేయునటంచు ॥వచ్చి॥
  1. భయ మాత్మలో వీడు కన్యకా – నీవు – దయబొంది యున్నావు ధన్యగా = రయముగ నిదిగోగ – ర్భముఁ దాల్చెదవు పుత్రో – దయమౌ యేసను పేర – తని కిడు మంచును ॥వచ్చి॥
  2. అతఁడెన్నఁబడును మహాత్ముడై – సర్వో – న్నతుఁడైన దైవకుమారుఁడై = హిత మొప్పు దేవుండు – న్నతిఁ జేసి దావీదు – వితత సింహాసన – మతని కిచ్చునంచు ॥వచ్చి॥
  3. ఘనతరుఁడగు వాని రాజ్యము – అంత – మొనగూడ దది నిత్యపూజ్యము = వనితమగు యాకోబు – వంశ మెల్లపు డేలు – కొను నాతఁ డనుంచుఁ దె – ల్పెను దూత మరియతో ॥వచ్చి॥

Rare gollavaralara neti rathri రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము

Song no: 105

రా – ఆనందభైరవి
తా – త్రిపుట
రారె గొల్లవారలారా – నేటి – రాత్రి బేత్లెహేము నూర = జేరి మోక్షదూత – కోరి దెల్పెను క్రీస్తు – వారి జాడకన్ను – లారా జూతము వేగ ॥రారె॥
  1. పుట్టు చావులు లేనివాడఁట – పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట = ఎట్టి వారలను జే – పట్టి పాపము లూడఁ – గొట్టి మోక్షపత్రోవఁ – బెట్టు వాడట వేగ ॥రారె॥
  2. బహుకాలమాయెను వింటిమి – నేడు – మహికివచ్చుట కనుగొంటిమి = విహితముతోడ – సేవించి వత్తము మోక్ష – మహితుని గని దుఃఖ – రహితులమవుదము. ॥రారె॥

Vinare yo narulara veenula kimpu meera వినరే యో నరులారా వీనుల కింపు విూర

Song no: 104

రా – యదుకులకాంభోజి
తా – ఆది
వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥
  1. నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ — దొరయౌ మరియా వరపత్రుఁడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను గనరే ॥వినరే॥
  2. ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బూని తనమేని సిలువ – ప్రమాను నణఁ చి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ – డైన మహాత్ముఁడు – జానుగ – యాగము సలిపిన తెరంగిది ॥వినరే॥
  3. పొందుఁ గోరిన వారి – విందా పరమోపకారి – యెంద రెందరిఁ బరమా – నందపద మొందఁగఁ జేసెను = అందమునన్ దన – బొంది సురక్తము – జిందెను భక్తుల – డెందము గుందఁగ ॥వినరే॥
  4. ఇల మాయావాదుల మాని – యితఁడే సద్గురు డని – తలపోసి చూచి మతి ని – శ్చల భక్తిని గొలిచిన వారికి=నిల జనులకు గలు-ములనలరెడు ధని-కుల కందని సుఖ – ములు మరి యొసఁగును ॥వినరే॥
  5. దురితము లణఁప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగఁ జనె = బిరబిర మన మం – దర మా కరుణా – శరనిధి చరణ మె – శరణని పోదము ॥వినరే॥

Memu velli chuchinamu swamy yesukreesthunu మేము వెళ్లిచూచినాము స్వామి యేసు


Song no: 118

రా – జంఝూటి
తా – ఆది
మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ ॥మేము॥
  1. బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ = బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో ॥మేము॥
  2. జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము ॥మేము॥
  3. తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా ॥మేము॥
  4. మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగము = త్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము ॥మేము॥
  5. పరిశుద్ధాత్మ జన్మ మాకు – వరముగా నొసంగెను = పరమపురము మాకు హక్కు – పంచెదాను నిరతము ॥మేము॥
  6. మాకు సర్వగర్వమణిగి – మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను ॥మేము॥

Alppudanaina naa korakai iswaryamune అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా

అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా
పాపినైన నాకొరకై నీ
ప్రాణమునె అర్పించితివా
1.కెరూబులతో సెరపులతో
   నిత్యము నిన్నె పొగడచుండు
   పరిశుద్ధుడు పరిశుద్ధుడని
   ప్రతిగానములతో స్తుతియించె
   మహిమనే నీవు విడచితివా
2. సుందరులలో అతి   
    సుందరుడవు
    వేల్పులలోన ఘనుడవు నీవు
    ఎండిన భూమిలో మొక్క వలె
    సొగసు సురూపము విడచితివా
    దాసుని రూపము దాల్చితివా
       

Padhey padhey nenu padukona పదే పదే నేను పాడుకోన ప్రతిచోట నీ మాట నా పాట గా


Song no:
పదే పదే నేను పాడుకోన ప్రతిచోట నీ మాట నా పాట గా
మరీ మరీ నేను చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా

నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు రాగం నీవే ||2|| ||పదే పదే||
మమతల మహారాజా యేసు రాజా ||4||

అడగక ముందే అక్కరలేరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు వున్నా బంధువు నీవే బంధాలను పెంచినా భాగ్యవంతుడా ||2||
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచినా భాగ్యవంతుడా ||2||
మమతల మహారాజా యేసు రాజా ||4||

అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగినవేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే ||2||
అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే ||2||
||పదే పదే||