50
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు Vuruko Naa Praanamaa Kalatha Chendhaku
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)
ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2)
నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2)
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2)
|| ఊరుకో ||
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా (2)
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట అసంభవమేగా (2)
|| ఊరుకో ||
అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2)
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2)
|| ఊరుకో ||
Vuruko Naa Praanamaa Kalatha Chendhaku
Aanuko Prabhu Rommuna Nischinthagaa (2)
Edaari Daarilona – Kanneeti Loyalona (2)
Naa Pakshamandu Niliche Naa Mundare Nadiche
Nee Shakthine Chaata Nannunchene Chota
Ninnerugute Maa Dhanam
Aaraadhane Maa Aayudham
Erra Samudraalu Naa Mundu Porluchunnaa
Pharo Sainyamanthaa Naa Venuka Tharumuchunnaa (2)
Nammadagina Devude Nadipinchuchundagaa
Nadi Madhyalo Nannu Vidichipettunaa (2)
|| vuruko ||
Inthavaraku Nadipinchina Daakshinyaporrnudu
Anyaayamu Cheyuta Asambhavamaegaa (2)
Vaagdhaanamichchina Sarvashakthimanthudu
Dushkaaryamu Cheyuta Aasambhavamegaa (2)
|| vuruko ||
Avarodhaalenno Naa Chuttu Alumukunnaa
Avarodhaallone Avakaashalanu Daachegaa (2)
Yehovaa Selavichchina Okkamaatayainanu
Charithralo Ennatiki Thappiyundaledugaa (2)
|| vuruko ||
Audio
విత్తనం విరుగకపోతే ఫలించునా Vittanam virugakapothey phalinchuna
విత్తనం విరుగకపోతే ఫలించునా
కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం
విశ్వాసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం [2]
గోల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే [2]
కిరీటం కావాలంటే గోల్యతులు రావద్ద [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
సేవించే మాదేవుడు రక్షించక మానునా
రక్షించక పోయినా సేవించుట మానము [2]
ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే [2]
అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమపెట్టే కొలది వారు విస్తరించి ప్రభాలిరీ [2]
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే [2]
వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [4]
Vittanam virugakapothey phalinchuna
kasthale lekhapote kiritame vacchuna [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
Poratam dhevunidhaitey nakela aratam
visvasinci niluchuntene istadu vijaya kiritam [2]
golyatunu puttincinadhey davidhunu hecchinchuṭake [2]
kiritam kavalante golyatulu ravaddha [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
sevinchey madevudu rakshinchaka manuna
rakṣhinchaka poyina sevinchuṭa manamu [2]
ietuvanti visvasame tandrine takune [2]
agniloki prabhuve raga edaina hani cheyuna [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
israyelu prajalanu aigupthu adhikarulu
sramapette koladi varu vistarinci prabhaliri [2]
pharonu puttinchinade prabhu saktini chatutake [2]
vagdhanam neravera pharolu ravaddha [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [4]
Audio
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన Anubhavaniki vacchena anthuleni vedhana
అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన...
దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా...
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన -
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే
ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2)
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి
ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
|| ||
రాజాధిరాజు ఉదయించెనే నిన్ను నన్ను
S
M
L
రాజాధిరాజు ఉదయించెనే, నిన్ను నన్ను రక్షింప జన్మించెనే
యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
కన్య మరియ గర్భమందున, ఇమ్మానియేలు జన్మించనే చీకటిలో ఉన్న మన జీవితాలకు, వెలుగును నింపుటకు ఉదయించెనే (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
దేవదూతలు వచ్చినారు, కాపరులకు శుభవార్త తెచ్చినారు
బాల యేసుని పూజించుటకు, వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
లోక పాప భారము నీవు మోసావు, గొప్ప రక్షణను మాకిచ్చావు
పరలోకవాసులుగా మమ్ము చేసావు నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
|| రాజాధిరాజు ||
telugu only
నే సాగెద యేసునితో నా జీవిత
S
M
L
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)
యేసుతో నడిచెద యేసుతో గడిపెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా
|| నే సాగెద ||
లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా
|| నే సాగెద ||
వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా
|| నే సాగెద ||
తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
యోసేపు వలె సాగెదా
|| నే సాగెద ||
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా
|| నే సాగెద ||
Ne Saageda Yesunitho
Naa Jeevitha Kaalamanthaa (2)
Yesutho Nadicheda Yesutho Gadipeda (2)
Paramunu Cheraga Ne Velleda (2)
Hanoku Vale Saagedaa
|| Ne Saagedha ||
Lokapu Shramalu Nannedirinchinaa (2)
Katinulu Raallatho Himsinchinaa (2)
Stephanu Vale Saagedaa
|| Ne Saagedha ||
Venuka Shathruvulu Ventaadinanoo (2)
Mundu Samudramu Edurochchinaa (2)
Moshe Vale Saagedaa
|| Ne Saagedha ||
Brathukuta Kreesthe Chaavainaa Mele (2)
Kreesthukai Hatha Saakshigaa Maarina (2)
Poulu Vale Saagedaa
|| Ne Saagedha ||
Thalli Marachina Thandri Vidachina (2)
Bandhuvule Nannu Velivesinaa (2)
Balavanthuni Vale Saagedaa
|| Ne Saagedha ||
గూడు లేని గువ్వలా దారి తప్పితి Goodu Leni Guvvalaa Daari Thappithi
గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా
|| గూడు ||
గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2)
|| నా ప్రాణమా ||
చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2)
|| నా ప్రాణమా ||
Goodu Leni Guvvalaa Daari Thappithi
Gunde Chedarina Koyilanai Moogaboyithi (2)
Nee Gundelo Daachumaa Nee Gootike Cherchumaa (2)
Naa Praanamaa Naa Kshemamu Neevayyaa
Naa Kshemamaa Naa Praanamu Neevayyaa
|| Goodu ||
Guvvalaku Goollishtam – Koyilaku Paatishtam
Naakemo Nuvvishtam – Nee Sannidhi Ishtam (2)
Nuvvante Ishtam Yesayyaa
Nuvvu Lekunte Brathuke Kashtamayyaa (2)
|| Naa Praanamaa ||
Chepalaku Neellishtam – Pillalku Thallishtam
Neekemo Chelimishtam – Naa Sneham Entho Ishtam (2)
Nenante Neekentho Ishtamayyaa
Neeventunte Inkaa Ishtamayyaa (2)
|| Naa Praanamaa ||
Sri yesundu janminche reyilo శ్రీ యేసుండు జన్మించె రేయిలో
121
యేసుని జననము
రాగం - ముఖారి
తాళం - ఆట
శ్రీ యేసుండు జన్మించె రేయిలో } 2
నేడు పాయక బెత్లెహేము ఊరిలో } 2
|| శ్రీ యేసుండు ||
కన్నియ మరియమ్మ గర్భమందున } 2
ఇమ్మానుయేలనెడి నామమందున } 2
|| శ్రీ యేసుండు ||
సత్రమందున పశువులశాల యందున } 2
దేవపుత్రుండు మనుజుండాయెనందునా } 2
|| శ్రీ యేసుండు ||
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి } 2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి } 2
|| శ్రీ యేసుండు ||
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా } 2
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా } 2
|| శ్రీ యేసుండు ||
మన కొరకొక్క శిశువు పుట్టెను } 2
ధరను మన దోషములబోగొట్టెను } 2
|| శ్రీ యేసుండు ||
పరలోకపు సైన్యంబు గూడెను } 2
మింట వర రక్షకుని గూర్చి పాడెను } 2
|| శ్రీ యేసుండు ||
అక్షయుండగు యేసు పుట్టెను } 2
మనకు రక్షణంబు సిద్ధపరచెను } 2
|| శ్రీ యేసుండు ||
Sri Yesundu Janminche Reyilo } 2
Nedu Paayaka Bethlehemu Oorilo } 2
|| Sri Yesundu ||
Kanniya Mariyamma Garbhamanduna } 2
Immaanuyelanedi Naamamandunaa } 2
|| Sri Yesundu ||
Sathramanduna Pashuvulashaala Yanduna } 2
Devaputhrundu Manujundaayenandunaa } 2
|| Sri Yesundu ||
Mana Koraku Oka Shishuvu Puttenu } 2
Dharanu Mana Doshamulabogettenu } 2
|| Sri Yesundu ||
Gollalellaru Migula Bheethillagaa } 2
Thelpe Goppa Vaartha Dootha Challaga } 2
|| Sri Yesundu ||
Akshayundagu Yesu Puttenu } 2
Manaku Rakshanambu Sidhdhaparachenu } 2
|| Sri Yesundu ||
శ్రీ యేసుండు జన్మించె రేయిలో Sri yesundu janminche reyilo
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)