Nee mata naa pataga anukshanam padani నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ
Song no:
నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||
1. ఏ చోట గళమెత్తినా -
నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2
వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||
2. నీ దివ్య గానామృతం -
జలధారలుగా పొంగనీ
తాకేటి ప్రతి వారినీ -
ఫలవంతముగా మార్చనీ2
శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||
3. ఆత్మీయ గీతాలతో -
తనువంతా పులకించనీ
సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2
కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
హృదయాల్లో నివసించుచూ -
కార్యాలు జరిగించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||
Jai Jai yesayya pujyudavu neevayya జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా
Song no:
హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)
కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై॥
దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై|
Rajula raju rajula raju రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు
Song no:
రాజుల రాజు , రాజుల రాజు, రాజుల రాజు
జన్మించెను ఈ లోకానికై వెలుగు తాను తెచ్చేను
పశువుల పాకలోన , బెత్లెహేమూ నగరులోన “2”
జన్మించెను మన రారాజుడు , ఉదయించేను మన రక్షకుడు
పరలోక మహిమాను విడచి దేవాది దేవుడు
తోడూండీ నన్ను నడప నాతో నిలిచేను
పరలోక మహిమను విడచి ఆశర్యకరుడు
యెసయ్య నా కోసం తరలి వచ్చెను “జన్మించెను”
యూదయ దేశమునందు పరిశుద్దుడు యెసయ్య
జన్మించెను నా కోసమే
బంగారం సాంబ్రాణి బొళమ్ యెసయ్యకు
అర్పించి ఆరాదించి ఆనందించిరి “జన్మించెను”
Maarpu chendhava neevu maarpu chendhava మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా
Song no:
- మార్పు చెందవా నీవు మార్పు చెందవా
- ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీవు
నిలిచే ధైర్యం నీకుందా } 2 || మార్పుచెందవా ||
- దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు } 2
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు } 2 || మార్పుచెందవా ||
- ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా } 2
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే } 2
నీకంటూ ఏముందిలే || మార్పుచెందవా ||
నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా....
మారు మనసును పొందవా
Song no:
- maarpu chendava neevu maarpu chendava
- yennallu neevu jeevinchinaa gaani
emunnadhi ee lokamulo
innaallu neevu chesina kriyalannitiki
theerpunnadhi pai lokamulo
theerpu dhinamunanduna
aayana mundhara neevu
niliche dhairyamu neekundha } 2 || Maarpu chendava ||
- dhigambarigaane vachavu neevu
dhigambariga pothavu
mannaina neevu mannai pothaavu } 2
yedo oka dinamandhuna
nee aasthi anthasthu nee andha chandhaalu
nee venta raavennadu } 2 || Maarpu chendava ||
- aathmanu kaaka dhehaanni champe
manushulaku bayapadakayya
aathmatho paatu nee dhehaanni champe
dhevudike bayapadavayya } 2
devudichina aathma devudi yoddhake cherunu
neekantu emundhile } 2 || Maarpu chendava ||
nee brathuku maarchukova ...aa..
nee brathuku maarchukova
anukoola samayam idhiyenani yerigi
maaru manasunu pondhava ..
maaru manasunu pondhavaa













