Santhosham santhosham santhoshame సంతోషం సంతోషం సంతోషమే ఆనందం ఆనందం ఆనందమే


Song no: 119
సంతోషం సంతోషం సంతోషమే
ఆనందం ఆనందం ఆనందమే
బెత్లెహేములో పశుల పాకలో
కన్య గర్భములో యేసుపుట్టెను
Happy Happy Happy Happy
Christmas Day

చీకటి బ్రతుకును తొలగింప
చిరు దీపమునె వెలిగింప
దీనుడాయెను నను ధన్యుని చేయా

పాపమును ఎడబాపుటకు
పావనుడే ఇల జనియించె
రిక్తుడాయెను ధనవంతుని చేయా

మరణమును ఇల తొలగింప
మహిమను తాను విడిచాడు
మహిమా స్వరూపుడు మనజావతారిగా

Kalamu sampoornamayenu కాలము సంపూర్ణమాయెను దేవుడే కుమారునిగ


Song no: 123
కాలము సంపూర్ణమాయెను
దేవుడే కుమారునిగ
భూవిలో జన్మించెను
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
         క్రీస్తు ఆరాధన

ఆది వాక్యము ఆయె నరరూపుగ
ఆది సంకల్పము ఇలలో నెరవేరేగా


ఆది సంభూతుడు కృపా సత్య సంపూర్ణునిగ
కన్య గర్భములో క్రీస్తుగా పుట్టెను

Yesu puttadani rakshna thecchadani యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని


Song no: 116
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
క్రీస్తు పుట్టాడని శాంతిని ఇచ్చువాడని
మేము వచ్చాము చూడటానికి
మేము వచ్చాము పూజించడానికి

ఇది మా క్రిస్మస్ ఆరాధన
ఇది మా క్రిస్మస్ ఆనందము

చుక్కని చూసి మేము వచ్చాము రాజుల రాజుని పూజించాము
బంగారు సాంబ్రాణి
బోళము అర్పించాము
అత్యానందముతో
తిరిగి మేము వెళ్ళాము     "ఇది"

దూత వార్త విని మేము వచ్చాము
రక్షకుడేసుని మేము చూశాము
పసిబాలుడు కాదు
పరమాత్ముడు అని
అందరికి మేము చాటించాము "ఇది"

Vekuva chukkala shreshtamou dhana వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా

Song no: 134

వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.

చల్లమంచాయన తొట్టిపై నొప్పు పశులతో భువిబరుండెను కున్కెడు నాయన దూతలు మ్రొక్కునందర స్రష్ట, రాజు, రక్షణ.

ఆయనకు మంచికాన్కలిత్తమా! ఏదోం సువాసనల ద్రివసుల్ వార్ది ముత్యాల్ కానబోళంబుఖని స్వర్ణము నిత్తమా యాయనకు.

నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు కాన్కల నాయన ప్రేమరాదు అన్నిట డెందము బీదల మొరల్ దేవుని కిష్టము లౌకాన్కలు.

వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా మాయిరుల్ బాపి నీ సాయమిమ్మ ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.

O bethlehemu gramama saddhemi lekayu ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు

Song no: 133

ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు కానేమి, నిత్యజ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతివాంఛలీ రాత్రి తీరె నీలోన్మ

రియకేసుపుట్టెను నిద్రింప మర్త్యులు పై గూడి దూతల్వింతయౌ ప్రేమన్వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్ ఈ శుద్ధజన్మము దైవానకు నున్నతుల్ భువిన్ శాంతంచు పాడుడీ

సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి నరుండెరుంగకున్నన్ ఈ పాపధాత్రిలో దీనులంగీకరించిన యేసుందుజొచ్చును.

ఓ బెల్లెహేము పావన వతా! మా పై దిగు పోగొట్టి పాపముల్ మాలో నీ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగ విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Randi pada dhuthalara nindu shanthoshambhutho రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో

Song no: 132

రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో యేసుని జన్మంబు గూర్చి ఈ భూలోకమంతట రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

మందగాయు గొల్లలార! మనుష్యులతో నేడు వాసంబు జేయుచున్నాఁడు వాసిగాను దేవుండు రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

జ్ఞానులారా! మానుడింక యోచనలం జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

పరిశుద్ధులారా! విూరు నిరీక్షించుచుండిన యేసు ప్రభువాలయంబు యేతెంచెను చూడుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుఁడి.

పశ్చాత్తాప మొందియున్న పాపులార! మీకు విముక్తి గల్గె; శక్తి నొంది రక్తి నేసుంజేరుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

Hai lokama prabhuvacchen angikarinchumi హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించువిూ

Song no: 131

హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించువిూ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.

హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును.

పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.

సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కుఁడీ స్తోత్రార్హుఁడాయెనే.