- ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!
- ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో
- నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు
- చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్
- ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్
Iennallu maku sayamai yi mundhukunu ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును
Sarvesa rammu nee sannidhi kanthi nosamgu maku సర్వేశా రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు
- సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!
- నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర
- రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్
- స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి
Yehova gaddhe mumdhata janambulara mrokkudi యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి
- యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి యెహోవ దేవుఁడే సుమీ సృజింపఁ జంపఁ గర్తయే
- స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ మళ్లీ చేర్చెను
- సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
- ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము
Dhahana bali neeku nanistamu mariyu dhaiva balulu దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు
- దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||
- నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|
- అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||
O prabhunda nin nuthimchu chunnamu vinayamu thoda ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ
Song no: 31
ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||
నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||
కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||
మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||
నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||
నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ||
నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||
ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||
ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||
Maa yesu kreesthu neeve mahimagala rajuvu nivu neene మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే
- మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||
- భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
- విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
- నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||
- నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||
- దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||
- నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||
- నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|
- దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||
- నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||
- ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||
- నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||
Pahiloka prabho pahi loka prabho pahi yani పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని
- పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||
- నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||
- నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
- దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||
- పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||
- ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||
- కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||
- నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||
- ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||
- ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||