-->

Yemunnadhi e lokamlo ranunnadhi akshaya dheham ఏమున్నది ఈ లోకంలో రానున్నది అక్షయ దేహం


Song no:

ఏమున్నది ఈ లోకంలో
రానున్నది అక్షయ దేహం
ఆస్తులున్న అంతస్తులువున్న
అనురాగాలు నిన్ను చుట్టుకున్న
ప్రాణం పోయేంత వరకే
అవసరం తీరేంత వరకు
                             //ఏమున్నది//

1. పుట్టుకతో ప్రేగు బంధమన్నావు
అది శాశ్వతమని తలిచావు
మరణంతొ మనుషుల బంధం
తెగిపోతుందని మరిచావు
తల్లియైన కన్నతండ్రియైన
కాటివరకే వుంటారు
కన్నుమూస్థే నీవులేవని
మరిచిపోతారు ఈ జనులు
                              //ప్రాణం//

2.పుటుకతో మొదలై మరణంతో
పోయేది కాదు మనుషుల బంధం
నరులలో వున్న ఆత్మ
దేవుడు వెలిగించిన దీపం అమరత్వం
భార్యయైన కన్నబిడ్డలైన
కాటివరకే వుంటారు
కన్ను మూస్థే నీవు లేవని
మరచిపోతారు ఈ జనులు
                                 // ప్రాణం//
Share:

Prabhuva kachithivi intha kalam chavaina brathukaina ప్రభువా కాచితివి ఇంత కాలం చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా

    ప్రభువా కాచితివి ఇంతకాలం
    కాచితివి ఇంతకాలం } 2
    చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా } 2
    నీ సాక్షిగా నే జీవింతునయ్యా || ప్రభువా ||

  1. కోరి వలచావు నాబ్రతుకు – మలిచావయా
    మరణ చాయలు అన్నిటిని – విరిచావయ్యా } 2
    నన్ను తలచావులే మరి పిలచావులే } 2
    అరచేతులలో నను చెక్కు కున్నావులే } 2 || ప్రభువా ||

  2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
    మనిషిగ పుట్టిన సర్పానయ్యా } 2
    విషం విరచావులే పాపం కడిగావులే } 2
    నను మనిషిగా ఇలలో నిలిపావులే } 2 || ప్రభువా ||

  3. బాధలు బాపితివి నీవేనయ్యా
    నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా } 2
    నన్ను దీవించితివి నన్ను పోషించితివి } 2
    నీ కౌగిలిలో నన్ను పెంచుచున్నావులే } 2 || ప్రభువా ||
Share:

Nadipinchumo yesayya naa jeevitha yathralo నడిపించుమో యేసయ్యా నా జీవిత యాత్రలో


Song no:

నడిపించుమో యేసయ్యా
నా జీవిత యాత్రలో          " 2 "
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు"2"
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                                 "  నడిపించుమో  "

ఆకాశమందు అత్యున్నతుడా
నీ రెక్కల నీడ నను దాచేను       " 2 "
నీ రక్షణ నా కుండగా
నీ ఆశ్రయం నా తోడుగా              " 2 "
నీ ఆశ్రయం నాతోడుగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "

ఆకాశమందు ఆశీనుడా
నీతట్టు నా కనులెత్తుచున్నాను      " 2 "
నీ ఆదరణ నా కుండగా
నీ సహాయం నా అండగా                " 2 "
నీ సహాయం నా అండగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "

ఆకాశమందు నీవుతప్ప
నాకెవరున్నారు ఈ లోకంలో     " 2 "
నీప్రేమ నాకుండగా నీకృప నాతోడుగా " 2 "
నీ కృప నా తోడుగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "
Share:

Manushulanu nammuta kante yesayyanu nammuta melu మనుషులను నమ్ముట కంటే యేసయ్యను నమ్ముట మేలు

Manna Madhuri
Song no:

మనుషులను నమ్ముట కంటే
యేసయ్యను నమ్ముట మేలు  " 2 "
యేసయ్యను నమ్ముట ఎంతో మేలు
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ  ఎంతో నీప్రేమ
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ   ఎంతో నీప్రేమ

నీ ఆజ్ఞలు తృణీకరించాను
నీ వాక్యము నేను వ్యతిరేకించి " 2 "
పశ్చాత్తాపముతోను నీయొద్దకు చేరాను
నన్ను క్షమించుమో ప్రభువా
నన్ను క్షమించుమో నా ప్రభువా
                                   "మనుష్యుల"

వేటగాని ఉరి నుండి
నన్ను విడిపించావు యేసయ్య        " 2 "
కనికర స్వరూపుడా
కరుణించుము నీప్రేమతో                 " 2 "
నీ సత్యమార్గములో నన్ను నడువనీ " 2 "
                                    "మనుష్యుల"
Share:

Sthuthinchedhan nee namamu dhyanimchedhan nee vakyamu స్తుతియించెదన్ నీ నామము ధ్యానించెదన్ నీ వాక్యము


Song no:

స్తుతియించెదన్ నీ నామము
ధ్యానించెదన్ నీ వాక్యము     " 2 "
హోసన్నా ఆరాధన
హోసన్నా స్తుతి ఆరాధనా
యేసయ్య ఆరాధన
యేసయ్య స్తుతి ఆరాధనా

వేకువ జామునా నీకొరకు
నేను ప్రార్ధింతును.          "2"
నీ మహిమతోను  నన్ను అభిషేకించి
నీ పరిశుద్ధాత్మతో           " 2 "
ఆరాధనా ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధనా    " 2 "  "స్తుతియించెదన్"

సజీవయాగముగా నాదీన శరీరము
సమర్పింతును               " 2 "
నీ సన్నిధిలో నాకు తోడైయుండి
నీ కరుణా కటాక్షముతో    " 2 "
ఆరాధనా ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధనా   " 2 "  "స్తుతియించెదన్"

విరిగిన హృదయముతో
మనస్ఫూర్తిగా నేను కీర్తింతును " 2 "
నీశక్తితో నాపై నింపిన నీవు ఆదరణ కర్తవు
ఆరాధనా ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధనా    " 2 "  "స్తుతియించెదన్"
Share:

Thandri thandri ninne stuthinchedhan naa athma aradhanalo తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్ నా ఆత్మ ఆరాధనలో

Nissi john
Song no:

తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్
నా ఆత్మ ఆరాధనలో      " 2 "

ప్రభువా నా నోరు స్తుతియించునట్లు " 2 "
నా పెదవులను తెరువుము     " 2 "
ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                    "తండ్రీ తండ్రీ"

ఆదరణ కర్త పరిశుద్దాత్మను  " 2 "
నింపుము నా యేసయ్య       " 2 "
ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                    "తండ్రీ తండ్రీ"

నా జీవిత కాలమంతయు నేను  " 2 "
యెహోవాను స్తుతియించెదను   " 2 "
ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                    "తండ్రీ తండ్రీ"
Share:

Siluvalona nivu chupina premanu nenela maruvanayya సిలువలోన నీవు చూపిన ప్రేమను నే నెలా మరువనయ్యా

సిలువలోన నీవు చూపిన ప్రేమను
నే నెలా మరువనయ్యా        " 2 "
యేసయ్యా నీ ప్రేమ              " 2 "
నేను ఎలా మరువనయ్యా    " 2 "
                            "  సిలువలోన "
నాదోషములే నీ వీపు పైన
మోసితివయ్య నా యేసయ్య  " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము   " 2 "
                             "  సిలువలోన "
నా చెడు తలపులు నీ శిరము పైన
ముళ్ళ మకుటముగా మారెనా " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము   " 2 "
                            "  సిలువలోన "
నీ రక్తముతో నా పాపమును
కడిగితివయ్య నా యేసయ్య    " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము   " 2 "
                             "  సిలువలోన "
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts